Sun Dec 22 2024 19:31:35 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్ : అనంత్ అంబానీ వివాహ స్ట్రీమింగ్ హక్కులను హాట్‌స్టార్ గెలుచుకోలేదు
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ జులై 12, 2024న ముంబైలో వివాహం చేసుకోబోతున్నారు. జూన్ 5, 2024న ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ జంట Jio వరల్డ్ BKCలో గ్రాండ్ లో సంగీత్‌ను నిర్వహించారు. పలువురు ప్రముఖులు
Claim :
వేలంలో ముకేశ్ అంబానీని ఓడించి హాట్‌స్టార్ అనంత్ అంబానీ వివాహ స్ట్రీమింగ్ హక్కులను గెలుచుకుందిFact :
అలాంటి వేలం ఏదీ జరగలేదు, సోషల్ మీడియా పోస్ట్ 'ది ఫాక్సీ' ప్రచురించిన వ్యంగ్య కథనం.
అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ జులై 12, 2024న ముంబైలో వివాహం చేసుకోబోతున్నారు. జూన్ 5, 2024న ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ జంట Jio వరల్డ్ BKCలో గ్రాండ్ లో సంగీత్‌ను నిర్వహించారు. పలువురు ప్రముఖులు, బాలీవుడ్ సెలెబ్రిటీలు ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. పాప్ స్టార్ జస్టిన్ బీబర్‌ను ప్రత్యేక ప్రదర్శన కోసం ఆహ్వానించారు.
ఈ పరిస్థితుల్లో హాట్‌స్టార్ అనంత్ అంబానీ పెళ్లికి సంబంధించిన స్ట్రీమింగ్ హక్కులను గెలుచుకున్నారని.. ముఖేష్ అంబానీని వేలంలో ఓడించిందని సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ముఖేష్ అంబానీ ఒక వ్యాపారవేత్తగా వేలం నిర్వహించారని, అందరికీ సమాన అవకాశాలను అందజేస్తున్నారని తెలిపారు. హాట్‌స్టార్ CEO IPL స్ట్రీమింగ్ హక్కులను లాక్కోవడంపై ముఖేష్ అంబానీపై ఇప్పటికీ ఆగ్రహంతో ఉన్నారు. ఆయనకు గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుని బిడ్డింగ్ లో అధిగమించారంటూ వైరల్ పోస్టులు ఉన్నాయి. గతంలో హాట్‌స్టార్‌ను సులువుగా అధిగమించిన అంబానీ, వివాహానికి ముందు ఈవెంట్లకు భారీగా ఖర్చు చేసిన కారణంగా నిధుల కొరతతో ఈసారి
సొంత కుమారుడి పెళ్ళికి సంబంధించిన స్ట్రీమింగ్ వేలంపాటలో అవమానకరమైన ఓటమిని ఎదుర్కొన్నారు. వేలం మధ్యలో Jio ధరలను పెంచడం ద్వారా నిధులను సేకరించడానికి ప్రయత్నించారని.. ఆయన్ను ఆశ్చర్యపరిచే విధంగా, Jio వినియోగదారులు రీఛార్జ్ చేయడానికి బదులుగా పోర్ట్ చేయడం ప్రారంభించారని వైరల్ కథనంలో ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. అలాంటి వేలం ఏదీ జరగలేదు. హాట్‌స్టార్ అనంత్ అంబానీ వివాహ స్ట్రీమింగ్ హక్కులను గెలుచుకోలేదు.
కీవర్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేయగా.. ఈ క్లెయిమ్‌లకు మూలం The Fauxy అనే వెబ్సైట్లో ప్రచురించబడిన కథనమని మేము కనుగొన్నాము. వైరల్ పోస్ట్‌లను షేర్ చేసిన కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ కథనంలో ప్రచురించబడిన విషయాలనే పంచుకున్నారు. 'బ్రేకింగ్: హాట్‌స్టార్ అనంత్ అంబానీ వివాహ స్ట్రీమింగ్ హక్కులను గెలుచుకుంది' అనే శీర్షికతో ది ఫాక్సీ ఒక కథనాన్ని ప్రచురించింది. హాట్‌స్టార్ CEO రివెంజ్ తీసుకున్నారని కథనంలో ఉంది.
అంబానీ మా నుండి IPL హక్కులను తీసుకున్నాడు.. ఫలితంగా మిలియన్ల మంది వినియోగదారులను కోల్పోయారని హాట్ స్టార్ అధికారులు చెప్పినట్లుగా ఆ కథనం ఉంది. ఇప్పుడు మేము పెళ్లికి సంబంధించిన విజువల్స్ నుండి లాభం పొందుతాము.. ముఖేష్ అంబానీ మార్కెటింగ్ కోసం మిలియన్లు ఖర్చు చేసాడు.. తన స్వంత కొడుకు పెళ్లిని చూడటానికి ఆయనే చెల్లించాలి. వివాహం జూలై 12, 2024న ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
Fauxy ఒక వ్యంగ్య వెబ్సైట్, వెబ్సైట్లో ప్రచురించబడిన కథనాలు ఏవీ నిజమైనవి కావు. వారు వ్యంగ్య కథనాలను ప్రచురిస్తారు. అవి కల్పిత రచనలు. వారి కథనాలు వాస్తవానికి దూరంగా ఉంటాయి.
అబౌట్ అజ్ అనే చోట “Fauxy is a satirical web portal. The material published on this website is based on fiction. Readers are advised not to consider articles in the fauxy to be factual." అని ఉంటుంది. ఫాక్సీ అనేది వ్యంగ్య వెబ్ పోర్టల్.. ఈ వెబ్సైట్లో ప్రచురించిన మెటీరియల్ ఊహాజనితమైనది.. ఫాక్సీలోని కథనాలను వాస్తవమైనవిగా పరిగణించవద్దని పాఠకులకు సూచిస్తున్నామని అందులో ఉంది. ఆలోచింపజేసే కామెడీని అందించడమే తమ లక్ష్యంగా పెట్టుకున్నామని ఫాక్సీలో తెలిపారు.
Latestly.comలో ప్రచురించిన ఒక కథనం ప్రకారం.. "ది ఫాక్సీ" వ్యంగ్య కథనాలను హోస్ట్ చేస్తుంది. ఈ వెబ్సైట్లో ప్రచురించబడిన అంశాలు పూర్తిగా కల్పితమే. ఫాక్సీలోని కథనాలను వాస్తవమైనవి లేదా నిజమైనవిగా పరిగణించవద్దని పాఠకులకు సూచించారు. ఫాక్సీ చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని గమనించాలి” అని ఉంది.
అందువల్ల, అనంత్ అంబానీ వివాహ ప్రసార హక్కులను హాట్‌స్టార్ వేలంలో గెలుచుకుందనే వాదనలో ఎలాంటి నిజం లేదు. కేవలం హాస్యభరిత కంటెంట్ మాత్రమే!!
Claim : వేలంలో ముకేశ్ అంబానీని ఓడించి హాట్‌స్టార్ అనంత్ అంబానీ వివాహ స్ట్రీమింగ్ హక్కులను గెలుచుకుంది
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story