ఫ్యాక్ట్ చెక్: హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత ‘ఆప్ కి అదాలత్’ ఇంటర్వ్యూలో టెలిప్రాంప్టర్ ను ఉపయోగించలేదు.
హైదరాబాద్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి కొంపెల్ల మాధవి లత ఇటీవల రజత్ శర్మ హోస్ట్ చేసిన ‘ఆప్ కి అదాలత్’ అనే ప్రముఖ షోలో పాల్గొన్నారు.
Claim :
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత ‘ఆప్ కి అదాలత్’ ఇంటర్వ్యూలో టెలిప్రాంప్టర్ రిమోట్ ను పట్టుకున్నారు.Fact :
బీజేపీ అభ్యర్థి మాధవి లత ధ్యానం కోసం డిజిటల్ కౌంటర్‌ను పట్టుకుంది. టెలిప్రాంప్టర్ రిమోట్ కాదు
హైదరాబాద్‌కు చెందిన భారతీయ జనతా పార్టీ ఎంపీ అభ్యర్థి కొంపెల్ల మాధవి లత ఇటీవల రజత్ శర్మ హోస్ట్ చేసిన ‘ఆప్ కి అదాలత్’ అనే ప్రముఖ షోలో పాల్గొన్నారు. ఈ షోలో గతంలో వివిధ సెలబ్రిటీలు పాల్గొన్నారు. హోస్ట్ రజత్ శర్మ ఎన్నో సంచలన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తదితర ప్రముఖులు ఈ షోలో గతంలో పాల్గొన్నారు. మాధవి లత షోలో పాల్గొని పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆమె చెప్పిన సమాధానాలు చాలా గొప్పగా ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
మేము Amazonలో కూడా ఇలాంటి పరికరాన్ని కనుగొన్నాము. జపం చేసే సమయంలో మంత్రాలను డిజిటల్ గా కౌంటింగ్ చేయవచ్చు.
బీజేపీ నాయకురాలు మాధవి లత చేతిలో ఉన్న పరికరం టెలిప్రాంప్టర్ రిమోట్ కాదు, ధ్యానం కోసం ఉపయోగించే డిజిటల్ కౌంటింగ్ మెషీన్. వైరల్ అవుతున్న వాదన తప్పుదారి పట్టిస్తోంది