ఫ్యాక్ట్ చెక్: మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాను ఆలయంలోకి రాకుండా అడ్డుకున్నారనే వాదన నిజం కాదు
మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ప్రసిద్ధ సంగీత స్వరకర్త. ఆయన 7000 కంటే ఎక్కువ పాటలను కంపోజ్ చేశారు. 1000 కంటే ఎక్కువ సినిమాల
Claim :
మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజాను దళితుడైన కారణంగా ఆలయంలోకి రానీయకుండా అడ్డుకున్నారుFact :
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. ఆలయంలో ఆయనకు స్వాగతం పలికారు, కానీ గర్భగుడిలోకి ప్రవేశించాలన్న అభ్యర్థనను తిరస్కరించారు
మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ప్రసిద్ధ సంగీత స్వరకర్త. ఆయన 7000 కంటే ఎక్కువ పాటలను కంపోజ్ చేశారు. 1000 కంటే ఎక్కువ సినిమాలకు మ్యూజిక్ ను అందించారు. 20000 కంటే ఎక్కువ కచేరీలలో ప్రదర్శనలు ఇచ్చారు. 40 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 15 జాతీయ చలనచిత్ర అవార్డులు, భారతదేశపు మూడవ పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ను కూడా గెలుచుకున్నాడు. ఆయన రాజ్యసభ ఎంపీ కూడా. ఇళయరాజా తన వినూత్నమైన, విలక్షణమైన సంగీత శైలికి ప్రసిద్ధి చెందారు. భారతీయ శాస్త్రీయ సంగీతం, జానపద, పాశ్చాత్య శాస్త్రీయ, జాజ్, రాక్ వంటి వివిధ శైలులను కలిపిన గొప్ప మ్యూజిక్ డైరెక్టర్. ఎన్నో గొప్ప గొప్ప ఆల్బమ్స్ సంగీత ప్రియులకు అందించారాయన.
ఇళయరాజా డిసెంబర్ 15, 2024 న తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయాన్ని సందర్శించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన స్వరపరిచిన 'దివ్య పాసురం' విడుదలకు ముందు , ఆలయ అధికారులు ఆయనను ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించడానికి అనుమతించలేదనే వాదనతో ప్రచారం చేస్తున్నారు. “हिंदुओं ने छुआछूत के ख़िलाफ़ लड़ाई लड़ी? बेशर्म ये आज ही की ख़बर है पढ़ ले एक सांसद को मंदिर में घुसने से रोक दिया गया है “ అంటూ హిందీలో పోస్టులు వైరల్ చేస్తున్నారు. "ఇంకా అంటరానితనం ఉందా? హిందువులు అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారా? ఒక ఎంపీని గుడిలోకి రానీయకుండా అడ్డుకున్నారు “ అని అందులో ఉంది.
క్లెయిం ఆర్కైవ్ లింకు ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ