Fri Nov 15 2024 04:07:28 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: బెంగళూరులో రూట్ నెంబర్ 420 అంటూ మార్ఫ్ చేశారు
బెంగళూరులో రూట్ నెంబర్ 420 అంటూ మార్ఫింగ్ చేశారు
Claim :
బెంగళూరులో కర్ణాటక ప్రభుత్వం విధానసౌధ నుంచి పరప్పన అగ్రహారానికి రూట్ నంబర్ 420తో బస్సు సర్వీసును ప్రారంభించింది.Fact :
వైరల్ అవుతున్న ఫోటోను మార్ఫింగ్ చేశారు. బెంగళూరులో అలాంటి రూట్ అంటూ ఏమీ లేదు
బెంగుళూరులో కర్ణాటక ప్రభుత్వం కొత్త బస్సు రూట్ ను ప్రారంభించిందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. బస్ రూట్ నంబర్ 420 అంటూ ఉన్న బస్సుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. బస్సు సర్వీసు విధాన సౌధ నుండి ప్రారంభమై పరప్పన అగ్రహారంలో ముగుస్తుందని చెబుతున్నారు.
వైరల్ అవుతున్న పోస్టులలో “మొదటిసారిగా, బెంగుళూరులో ఒక బస్సు మార్గం సరైన గమ్యస్థానానికి పంపిస్తూ ఉన్నారు. రూట్ నెం. 420 విధాన సౌధ నుండి ... పరప్పన అగ్రహార (సెంట్రల్ జైలు) వరకు వెళుతోంది” అని చెప్పుకొచ్చారు.
బెంగళూరులోని విధానసౌధ అంటే శాసనసభ ప్రాంతం కాగా.. బెంగళూరులోని సెంట్రల్ జైలు ఉన్న ప్రదేశం పరప్పన అగ్రహారం. ఇది కర్ణాటక రాష్ట్రంలోని అతిపెద్ద జైలు. రాజకీయ నాయకులు డైరెక్టుగా జైలుకు వెళతారు.. 420 నెంబర్ ఉంచారు అంటూ సెటైర్లు వేస్తూ ఉన్నారు.
బస్ రూట్ '420'ని కర్ణాటక ప్రభుత్వం సముచితంగా ప్రారంభించిందని, దీనివల్ల విధాన్ సౌధ నుండి రాజకీయ నాయకులు అరెస్టు అయినప్పుడు పరప్పన అగ్రహార జైలుకు వెళ్లడం సులభం అవుతుందని పలువురు పోస్టుల్లో తెలిపారు. రాజకీయ నాయకులు ఎన్నో తప్పులు, నేర కార్యకలాపాలలో భాగమయ్యారని.. అందుకే వారు జైలుకు వెళతారని పలువురు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ వస్తున్నారు. ఈ ఫోటోను షేర్ చేస్తూ ఉన్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్: వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు. రూట్ నెంబర్ 420 అంటూ కర్ణాటక ప్రభుత్వం ఎలాంటి బస్సు సర్వీసును మొదలుపెట్టలేదు.
కర్ణాటక ప్రభుత్వం విధానసౌధ నుంచి పరప్పన అగ్రహారానికి రూట్ నంబర్ 420లో బస్సు సర్వీసును ప్రారంభించలేదు. కర్ణాటకలోని బెంగళూరులో అలాంటి బస్సు రూట్ నంబర్ లేదు. ఈ చిత్రం మార్ఫింగ్ చేశారు.
మేము బెంగళూరులో బస్సు రూట్స్ కు సంబంధించి పలు వివరాల కోసం వెతికినప్పుడు, నగరంలో బస్సు రూట్ నంబర్ 420 అంటూ ఏదీ లేదు. మేము విధానసౌధ నుండి పరప్పన అగ్రహార జైలు వరకు నడిచే బస్సు మార్గాలను తనిఖీ చేసాము. వాటిలో రూట్ నంబర్ 420 ఎక్కడా లేదని గుర్తించాం.
మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ఆగస్ట్ 2009లో ప్రచురించిన రైజింగ్ సిటిజన్ అనే బ్లాగ్ ద్వారా చిత్రం షేర్ చేశారని గుర్తించాం. BMTC ని పునరుద్ధరిస్తూ ఉన్నారని బ్లాగ్ పేర్కొంది.
అదే చిత్రం BMTC వోల్వో బస్సు సోషల్ మీడియా ఖాతాలో అప్లోడ్ చేశారని మేము కనుగొన్నాము. ఈ చిత్రం సెప్టెంబర్ 28, 2022న అప్లోడ్ చేశారు.
బస్సు రూట్ నంబర్ 365 అని ఉంది కానీ.. 420 అని ఎక్కడా లేదు. ఈ రూట్ మీద కన్నడలో ‘నేషనల్ పార్క్’ అని ఉంది.
కాబట్టి, వైరల్ చిత్రం మార్ఫింగ్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది. వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
కాబట్టి, వైరల్ చిత్రం మార్ఫింగ్ చేశారని స్పష్టంగా తెలుస్తోంది. వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
Claim : బెంగళూరులో కర్ణాటక ప్రభుత్వం విధానసౌధ నుంచి పరప్పన అగ్రహారానికి రూట్ నంబర్ 420తో బస్సు సర్వీసును ప్రారంభించారు
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Facebook
Fact Check : False
Next Story