Fri Nov 08 2024 04:14:16 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: చైనా లోని ఎక్స్ ప్రెస్ వే.. జమ్మూ కశ్మీర్ లోనిదంటూ పోస్టులు వైరల్
శ్రీనగర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న జాతీయ రహదారి (NH-44) కి సంబంధించిన ఫోటో అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు.
శ్రీనగర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న జాతీయ రహదారి (NH-44) కి సంబంధించిన ఫోటో అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు. జమ్మూ కశ్మీర్ లోని హైవే ఇదంటూ నెటిజన్లు పోస్టులు పెడుతూ ఉన్నారు. ఫేస్బుక్ వినియోగదారులు “జమ్మూ, కశ్మీర్ జాతీయ రహదారి 44 అని.. మన దేశంలో, అది కూడా జమ్మూ కశ్మీర్ లో ఇలాంటివి ఉన్నాయని తెలిసి మీరు ఆశ్చర్యపోతారని నాకు తెలుసు” అనే శీర్షికతో చిత్రాన్ని షేర్ చేసారు.
"మీడియా పొరబాటున కూడా జనానికి చూపించని వాస్తవం" అంటూ పోస్టులు పెడుతూ వస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
ఫ్యాక్ట్ చెక్ టీమ్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా కైక్సిన్ గ్లోబల్ (Caixin Global) అనే పేజీని కనుగొంది. పేజీ ప్రచురించిన ఫోటో కథనం ప్రకారం హైవే విస్తరణ కోసం చైనా దృష్టి పెట్టింది. స్లైడ్ 8లో.. అదే వైరల్ చిత్రం "వాయువ్య చైనాలోని గన్సు ప్రావిన్స్‌లోని వీయువాన్-వుడు ఎక్స్‌ప్రెస్‌వే 2020లో తెరుస్తారు" (The Weiyuan-Wudu Expressway in Northwest China's Gansu province opened to traffic in 2020) అని క్యాప్షన్ ఉంది. ఈ కథనం ఈ ఎక్స్‌ప్రెస్ వే చైనాలో ఉందని స్పష్టం చేస్తోంది. ఈ ఫోటోకు విజువల్ చైనా గ్రూప్ (VCG), చైనీస్ ఫోటో అండ్ మీడియా ఏజెన్సీకి క్రెడిట్స్ ఇచ్చారు.చైనీస్ ప్రభుత్వం అధికారిక పత్రికా ప్రకటన ప్రకారం, వీయువాన్-వుడు ఎక్స్‌ప్రెస్‌వే కు సంబంధించిన లాంగ్నాన్ విభాగం 2020లో ట్రయల్ ఆపరేషన్ల కోసం ప్రారంభించారు. నవంబర్ 2020లో ప్రచురించిన ఒక కథనం ప్రకారం.. ఈ ఎక్స్ ప్రెస్ వే నిర్మాణాన్ని పూర్తీ చేయడం ఈ ప్రావిన్స్‌లో ట్రాన్స్ పోర్టేషన్ కు సహాయంగా ఉండనుంది. ప్రయాణాలను సులభతరం చేస్తుందని పేర్కొంది.
దీని నుండి క్యూ తీసుకొని, మేము Google Earthలో వెతికాము. చైనా లోని గన్సు ప్రావిన్స్‌లోని లియాంఘేకౌ గ్రామం గుండా వెళుతున్న వీయువాన్-వుడూ ఎక్స్‌ప్రెస్‌వేలో భాగమేనని గుర్తించాం. ఈ రోడ్డే వైరల్ ఫోటోలో ఉందని గుర్తించాం. వైరల్ ఫోటోకు భారతదేశానికి ఎటువంటి సంబంధం లేదని తెలుసుకున్నాం.
చైనీస్ ఎక్స్‌ప్రెస్‌వేకు చెందిన చిత్రాన్ని భారతదేశంలోని జమ్మూలో ఉందంటూ పోస్టులు వైరల్ చేస్తున్నారు. నేషనల్ హైవే-44 కు ఈ ఫోటోకు ఎటువంటి సంబంధం లేదు.
Claim : National Highway (NH) 44 running from Srinagar to Kanyakumari
Claimed By : Facebook Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Facebook
Fact Check : False
Next Story