Fri Nov 22 2024 05:38:09 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: పూరీ జగన్నాథ్ ఆలయానికి వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఎవరూ ఆపలేదు. ఆమె ఇష్టం ప్రకారమే బ్యారికేడ్ వెనుక నిలబడ్డారు
పూరీలోని జగన్నాథ ఆలయ గర్భగుడిలోకి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను అనుమతించారని, అయితే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అదే ఆలయంలోని గర్భగుడిలోకి అనుమతించలేదని కథనంతో రెండు చిత్రాలు వైరల్ అవుతూ ఉన్నాయి.

దళిత వర్గానికి చెందిన ఆమెను మందిరం లోపలికి అనుమతించలేదని కథనాలను ప్రచారం చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉన్నాయి.అశ్విని వైష్ణవ్ గర్భగుడిలోకి వెళ్ళింది పూరీ జగన్నాథ్ ఆలయంలో కాదు. ఈ చిత్రాలలో కనిపించే ఆలయం ఢిల్లీలోని హౌజ్ ఖాస్‌లోని జగన్నాథ దేవాలయం, పూరీ ఆలయం కాదు.
మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, రథయాత్ర సందర్భంగా అశ్విని వైష్ణవ్ ఆలయాన్ని సందర్శించిన చిత్రాలు జూలై 2021 నాటివని కనుగొన్నాము. జూలై 12, 2021న రైల్వే మంత్రి స్వయంగా చేసిన ట్వీట్లో ఈ చిత్రాన్ని చూడవచ్చు.
రథయాత్ర కోసం దేవత ఆవాహన సమయంలో మాత్రమే ఆలయ గర్భగుడి తెరిచి ఉంచుతారు. ఈ సందర్భంగా ప్రధాన అతిథి, అర్చకులను మాత్రమే గర్భగుడిలోకి అనుమతిస్తారు. ఆలయంలో నిర్వహించే ఆచారాలు, వేడుకలకు సంబంధించిన వివరాలు వెబ్సైట్లో ఉన్నాయి.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఢిల్లీలోని హౌజ్ ఖాస్‌లోని జగన్నాథ ఆలయాన్ని సందర్శించిన ఫోటోలను తన ట్విట్టర్ హ్యాండిల్లో పోస్టు చేశారు. “మహాప్రభు శ్రీజగన్నాథుని రథయాత్ర రాక సందర్భంగా నేను దేశప్రజలందరికీ, ముఖ్యంగా మహాప్రభు శ్రీ జగన్నాథ భక్తులకు నా హృదయపూర్వక అభినందనలు.. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ మహత్తరమైన పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో సుఖ సంతోషాలను, శాంతిని, శ్రేయస్సును తీసుకురావాలని శ్రీ జగన్నాథుడిని ప్రార్థిస్తున్నాను. జై జగన్నాథ్!" అంటూ ఆమె పోస్టు పెట్టారు.

మరింత సెర్చ్ చేయగా.. రాష్ట్రపతి జీవిత చరిత్ర అయిన “మేడమ్ ప్రెసిడెంట్” పుస్తక రచయిత సందీప్ సాహు చేసిన ట్వీట్ కూడా మాకు కనిపించింది. ఈ ట్వీట్ జూన్ 26, 2023న పోస్ట్ చేశారు, హౌజ్ ఖాస్ జగన్నాథ ఆలయ కార్యదర్శి ప్రకారం, రాష్ట్రపతి మతపరమైన ఆచారాల్ని పాటించే వ్యక్తి కావడంతో చివరి బారికేడ్ దాటి వెళ్లకూడదని అనుకున్నారు. ఇది రాష్ట్రపతి స్వంత నిర్ణయమని.. ఆమెను ఎవరూ ఆపలేదని తెలిపారు.
ఆయన ట్వీట్ ఇక్కడ చూడొచ్చు.
ఆయన ట్వీట్ ఇక్కడ చూడొచ్చు.
www.outlook.comలో వచ్చిన కథనం ప్రకారం, ఆలయ అధికారులు ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. బారికేడ్ వెనుక నిలబడాలనే నిర్ణయం రాష్ట్రపతి స్వయంగా తీసుకున్నారని ధృవీకరించారు. న్యూస్‌చెకర్ ఫ్యాక్ట్ చెక్ టీమ్ ప్రకారం, ఢిల్లీలోని హౌజ్ ఖాస్‌లోని జగన్నాథ ఆలయ నిర్వాహకులు, శ్రీ నీలాచల్ సేవా సంఘం సభ్యులు మాట్లాడుతూ ప్రెసిడెంట్ ముర్ము ఆలయాన్ని సందర్శించారు. భద్రతా కారణాల దృష్ట్యా, ఆమె ఉదయాన్నే ఆలయాన్ని సందర్శించి పూజలు చేయాలని నిర్ణయించుకుంది. ఈ పర్యటనపై ఎలాంటి పబ్లిసిటీ లేదు.
హౌజ్ ఖాస్‌లోని జగన్నాథ దేవాలయాన్ని 1967లో నిర్మించారు. ఆలయ నిర్వాహకులు 1979లో రథయాత్రను నిర్వహించడం ప్రారంభించారు. ఈ ఆలయం పూరీ ఆలయాన్ని పోలి ఉంటుంది.
ప్రెసిడెంట్ ముర్మును ఆమె కులం కారణంగా జగన్నాథ ఆలయంలో వివక్షకు గురి అయ్యారనే వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదిలా ఉంది. ఈ వాదనలను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకండి.

Claim : President Murmu not allowed inside Puri Temple sanctorium
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : Misleading
Next Story