Fri Nov 22 2024 19:08:20 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: రాహుల్ గాంధీ ఓ తాడును చూపిస్తున్న ఫోటోను మార్ఫింగ్ చేశారు
భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. “కాంగ్రెస్ పాలన బ్రాహ్మణ పాలన! Bjp పాలన బ్రాహ్మణ పాలన! ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి." అంటూ ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు.
Claim :
బ్రాహ్మణ సమాజాన్ని ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బహిరంగ సభలో పవిత్రమైన దారాన్ని ప్రదర్శిస్తున్నట్లు వైరల్ చిత్రం చూపిస్తుందిFact :
చిత్రంలో రాహుల్ గాంధీ చిరిగిన కుర్తాను చూపుతున్నారు. ఆయన ధరించిన పవిత్ర దారాన్ని చూపించడం లేదు.
భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. “కాంగ్రెస్ పాలన బ్రాహ్మణ పాలన! Bjp పాలన బ్రాహ్మణ పాలన! ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి." అంటూ ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు.
వైరల్ ఇమేజ్‌లో రాహుల్ గాంధీ బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తి అని సూచించే దారాన్ని చూపించడాన్ని మనం చూడవచ్చు. కాంగ్రెస్ బ్రాహ్మణ సామాజికవర్గానికి, బీజేపీ బ్రాహ్మణ వర్గానికి ప్రాధాన్యత ఇస్తుందని, ప్రజలు తమ నాయకులను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని పలు పోస్ట్‌లు సూచిస్తున్నాయి.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ ఫోటోను మార్ఫింగ్ చేశారు. రాహుల్ గాంధీ చూపిస్తోంది కుర్తా.. యజ్ఞోపవీతాన్ని కాదు.
మేము గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాం. ఈ చిత్రం 2017 నాటిది అని మేము కనుగొన్నాము.

ఒక పబ్లిక్ మీటింగ్‌లో ప్రసంగిస్తున్నప్పుడు, రాహుల్ గాంధీ తన కుర్తా చినిగిపోయిందని తెలిపారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ లాగా ఖరీదైన బట్టలు ధరించలేదని విమర్శించారు.
తాను ధరించిన కుర్తాకు రంధ్రం చూపిస్తూ రాహుల్ గాంధీ రిషికేశ్‌లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు: “మేరా కుర్తా ఫటా హో తో ముఝే ఫరక్ నహీ పడ్తా, లేకీన్ మోడీ జీ కా కప్డా కభీ నహీ ఫటా హోగా ఔర్ వో గరీబ్ కీ రాజనీతి కర్తే హైం (నా కుర్తా చిరిగినా పర్వాలేదు, కానీ మోదీజీ బట్టలు ఎప్పుడూ చిరిగిపోవు)" అని అన్నారు. మోదీ బట్టలు చాలా ఖరీదైనవని.. ఆయన రాజకీయాల్లో పాల్గొన్నా కూడా ఆయన బట్టలు చినిగిపోవని తెలిపారు.
‘Oneindia News’ యూట్యూబ్ ఛానల్ లో రాహుల్ గాంధీకి సంబంధించిన ఈ వీడియోను చూపించారు. ‘Rahul Gandhi sports 'Torn Kurta' during Rishikesh rally, Watch Video | Oneindia News’ అనే టైటిల్ తో వీడియోను అప్లోడ్ చేశారు. ఆ వీడియోలో రాహుల్ గాంధీ చినిగిపోయిన కుర్తాను చూపించారని తెలిపారు. జనవరి 16, 2017న వీడియోను అప్లోడ్ చేశారు.
ANI కూడా రాహుల్ గాంధీకి సంబంధించిన ఫోటోను షేర్ చేసింది. “Mera pocket/kurta phata ho toh mujhe farak nahi padta,lekin Modi Ji ka kapda kabhi nahi phata hoga aur vo gareeb ki rajneeti karte hain: RG” అనే క్యాప్షన్ తోనే ఫోటోను షేర్ చేశారు. తన కుర్తా చినిగిపోయిందని అన్నారు.. ప్రధాని మోదీ చేసే రాజకీయాలపై విమర్శలు గుప్పించారు.

పలు మీడియా సంస్థలు కూడా ఇదే విషయాన్ని నివేదించాయి.
ఇక్కడ రెండు చిత్రాల పోలికలను గమనించవచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. రాహుల్ గాంధీ వైరల్ ఇమేజ్‌లో యజ్ఞోపవీతాన్ని చూపడం లేదు కాదు.. ఆయన తన చిరిగిన కుర్తాను ప్రజలకు చూపుతున్నారు.

Claim : The viral image shows Congress leader Rahul Gandhi showing off a sacred thread in a public meeting to please the Brahmin community
Claimed By : Twitter users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : False
Next Story