Fri Dec 20 2024 09:56:25 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: పెద్ద ఎత్తున ప్రజలు ఓ కారు చుట్టూ గుమిగూడిన ఫోటో తప్పుడు వాదనలతో వైరల్ అవుతున్నాయి.
ఓ కారు చుట్టూ పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల కేరళలోని కొచ్చి పర్యటన సందర్భంగా ఈ ఫోటో తీశారు అనే వాదనతో వీడియోను వైరల్ చేస్తూ ఉన్నారు.
ఓ కారు చుట్టూ పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల కేరళలోని కొచ్చి పర్యటన సందర్భంగా ఈ ఫోటో తీశారు అనే వాదనతో వీడియోను వైరల్ చేస్తూ ఉన్నారు. వేలాది మంది ప్రజలు గుంపులుగా ఒక వీధిలో కారును చుట్టుముట్టిన ఫోటోను షేర్ చేస్తున్నారు.ప్రధాని మోదీ ఏప్రిల్ 24 నుండి ఏప్రిల్ 26, 2023 వరకు 2 రోజుల పాటూ కేరళ పర్యటనలో ఉన్నారు. తిరువనంతపురం నుండి కసరోడ్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ను PM జెండా ఊపి ప్రారంభించారు. కొచ్చిలో భారతదేశపు మొట్టమొదటి వాటర్ మెట్రోను కూడా ఆయన ప్రారంభించారు. ఆయన పర్యటన సందర్భంగా అనేక చిత్రాలు ఆన్లైన్లో వైరల్ అవుతూ ఉన్నాయి. వాటిలో ఇది కూడా ఒకటి.“രാഷ്ട്രീയ പിതാവ് മോദീജിയെ ഒരു നോക്ക് ദർശിക്കാനായി ജനസാഗരമായി കൊച്ചി നഗരം” అంటూ మలయాళంలో పోస్టు చేశారు. అనువదించగా.. "రాజకీయ నాయకుడు మోదీని చూసేందుకు వచ్చిన ప్రజలతో కొచ్చి నగరం జన సముద్రంగా మారింది" అని అర్థం వస్తుంది.
“Guess which political leader’s rally in Kerala is this?” అంటూ కూడా ట్విట్టర్ యూజర్లు పోస్టు పెట్టారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
భారత ప్రధాని నరేంద్ర మోదీని చూసేందుకు ప్రజలు తరలివచ్చారని చెబుతున్న వాదన తప్పు. ఈ చిత్రం 2017లో ఓ ఈవెంట్ కోసం నటి సన్నీ లియోన్ కొచ్చికి వచ్చినప్పుడు తీశారు. ఆమెను చూడడానికి కేరళ యూత్ భారీ ఎత్తున అక్కడికి చేరుకుంది.ఈ వైరల్ చిత్రం వివరణతో ఆగస్టు 2017లో ఒక కథనంలో ప్రచురించబడింది “Sunny Leone’s car mobbed by fans in Kerala” అంటూ కథనాలు కూడా వచ్చాయి. “Sunny Leone brought Kochi to a standstill in 2017, on Throwback Thursday” అనే శీర్షికతో ఇండియా టుడేలో ప్రచురించిన మరొక కథనం కూడా చూడొచ్చు. కొచ్చిలోని ఎంజీ రోడ్లో స్మార్ట్ఫోన్ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి సన్నీ లియోన్ను ఆహ్వానించారు. వేలాది మంది అభిమానులు సన్నీ కారును చుట్టుముట్టడంతో ఎంజీ రోడ్డులో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. షారుఖ్ ఖాన్ లేదా ఫుట్బాల్ లెజెండ్ మారడోనా కేరళను సందర్శించినప్పుడు కంటే ఎక్కువ మంది జనం సన్నీని చూడడానికి వచ్చారు. సన్నీ పోలీసుల సహాయంతో స్మార్ట్ఫోన్ బ్రాంచ్ ప్రారంభోత్సవానికి సంబంధించిన వేదిక వద్దకు వెళ్లగలిగింది. ఇంత అభిమానం చూపించడంతో సన్నీ లియోన్ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేసింది.ఇదే చిత్రాన్ని సన్నీ లియోన్ తన ట్విట్టర్ ఖాతాలో ఆగస్టు 2017లో షేర్ చేసింది.“My car in literally a sea of love in Kochi Kerala!! Thanks” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.వైరల్ అవుతున్న చిత్రం భారత ప్రధాని మోదీ ఇటీవల కేరళలోని కొచ్చి పర్యటనకు సంబంధించినది కాదు. ఇది 2017లో సన్నీ లియోన్ కొచ్చిని సందర్శించినప్పటిది. వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
Claim : Image shows Modi's car mobbed in Kochi
Claimed By : Twitter Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Twitter
Fact Check : False
Next Story