Mon Dec 23 2024 12:16:43 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: అజర్‌బైజాన్‌లోని బాకులోని టవర్లను చూపుతున్న చిత్రం తప్పుడు వాదనతో ప్రచారం చేస్తున్నారు
గాజా స్ట్రిప్‌ను నియంత్రిస్తున్న పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఇజ్రాయెల్‌పై ఊహించని విధంగా దాడి చేసింది
Claim :
అజర్‌బైజాన్‌లోని బాకులోని ఫ్లేమ్ టవర్స్‌పై ఇజ్రాయెల్ జెండాను ప్రదర్శించారుFact :
ఈ చిత్రం 2015 నాటిది, ఇది ఇటీవలిది కాదు.
గాజా స్ట్రిప్‌ను నియంత్రిస్తున్న పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఇజ్రాయెల్‌పై ఊహించని విధంగా దాడి చేసింది. గాజా స్ట్రిప్‌లోని అనేక ప్రాంతాలపై వైమానిక దాడులతో దాడి చేయడం ద్వారా ఇజ్రాయెల్ ప్రతిఘటించింది. హమాస్ తీవ్రవాదులు పలు ప్రాంతాల్లో మారణహోమాన్ని సృష్టించారు. ఎంతో మంది అమాయకులను బలితీసుకున్నారు. పాలస్తీనా ప్రజలను, ఇతర దేశాలకు చెందిన వారిని బంధీలుగా చేసుకున్నారు. హమాస్ తీవ్రవాదులను హతం చేయాలనే లక్ష్యంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం మిలిటరీ ఆపరేషన్ ను మొదలుపెట్టింది.
చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఇజ్రాయెల్‌కు సంఘీభావంగా అజర్‌బైజాన్‌లోని బాకుకు సంబంధించిన ఫ్లేమ్ టవర్స్ చిత్రాలను షేర్ చేస్తున్నారు.
"ధన్యవాదాలు అజర్బైజాన్ - సంఘీభావానికి చిహ్నంగా బాకు రాజధానిలోని భవనాలపై ఇజ్రాయెల్ జెండా" అనే శీర్షికతో వినియోగదారులు చిత్రాన్ని పంచుకున్నారు.
“Thank you Azerbaijan - Israeli flag on buildings in the capital of Baku as a sign of solidarity.” అంటూ పోస్టులు పెడుతున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. ఇజ్రాయెల్‌కు సంఘీభావంగా బాకులోని ఫ్లేమ్ టవర్లను వెలిగించలేదు. ఈ చిత్రం 2015 సంవత్సరం నాటిది.
మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా vk.comలో 2021లో ప్రచురించిన పోస్ట్‌ని మేము కనుగొన్నాము.
మేము మరింత సెర్చ్ చేయగా జూన్ 2015 కు సంబంధించిన మరొక ట్వీట్‌ని కనుగొన్నాము, ఈ చిత్రంలో బాకు ఫ్లేమ్ టవర్స్‌పై ఇజ్రాయెల్ జెండాను ప్రదర్శించారు అనే శీర్షికతో పోస్టు పెట్టారు.
“Israeli Flag displayed on Flame Towers in #Baku honoring part. of Team Israel at @BakuGames2015 in #Azerbaijan" అంటూ పెట్టిన పోస్టులను చూశాం.
లాస్ ఏంజిల్స్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ అజర్బైజాన్ అనే ఫేస్బుక్ పేజీ జూన్ 2015లో “అజర్‌బైజాన్‌లోని యూరోపియన్ గేమ్స్‌లో టీమ్ ఇజ్రాయెల్ భాగస్వామ్యాన్ని గౌరవిస్తూ బాకులోని ఫ్లేమ్ టవర్స్‌పై ప్రదర్శించిన ఇజ్రాయెల్ జెండా” అనే శీర్షికతో చిత్రాన్ని భాగస్వామ్యం చేశారు.
జూన్ 2015లో అప్లోడ్ చేసిన YouTube వీడియోలో.. బాకు లోని ఫ్లేమ్ టవర్స్ అన్ని యూరోపియన్ జెండాలతో వెలిగిపోతోంది. ఆ వీడియో వివరణ ప్రకారం, జూన్ 2015లో అజర్‌బైజాన్‌లోని బాకులో యూరోపియన్ గేమ్స్ ను నిర్వహించినప్పుడు తీశారు.
కాబట్టి, ఇజ్రాయెల్ జెండాతో బాకు ఫ్లేమ్ టవర్స్ వీడియోలు, ఫోటోలు ఇటీవలివి కాదు. 2015 సంవత్సరానికి చెందిన చిత్రం. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది.
Claim : Israeli flag displayed on the illuminated Flame Towers in Baku in Azerbaijan in support of the ongoing Al-aqsa flood operation.
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : Misleading
Next Story