Fri Dec 20 2024 20:02:08 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: అనంత్ అంబానీ పెళ్లిలో సల్మాన్ ఖాన్ చేతులు పట్టుకుని ఐశ్వర్య రాయ్ ఫోటోలకు ఫోజులు ఇవ్వలేదు.
ఏడు నెలల ప్రీ-వెడ్డింగ్ వేడుకల తర్వాత.. అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ జూలై 12, 2024న పెళ్లి చేసుకున్నారు. కిమ్ కర్దాషియాన్, నటుడు జాన్ సెనా, బ్రిటిష్ మాజీ ప్రధానులు టోనీ బ్లెయిర్, బోరిస్ జాన్సన్ వంటి ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు.
Claim :
అనంత్ అంబానీ పెళ్లిలో అర్పితా ఖాన్‌తో కలిసి సల్మాన్ ఖాన్, ఐశ్వర్యరాయ్ ఫోటోగ్రాఫ్‌లకు పోజులివ్వడాన్ని వైరల్ చిత్రం చూపిస్తుందిFact :
వైరల్ అవుతున్న చిత్రాన్ని ఎడిట్ చేశారు. రెండు వేర్వేరు చిత్రాలను జోడించి ఒకటే ఫోటోగా సృష్టించారు.
ఏడు నెలల ప్రీ-వెడ్డింగ్ వేడుకల తర్వాత.. అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ జూలై 12, 2024న పెళ్లి చేసుకున్నారు. కిమ్ కర్దాషియాన్, నటుడు జాన్ సెనా, బ్రిటిష్ మాజీ ప్రధానులు టోనీ బ్లెయిర్, బోరిస్ జాన్సన్ వంటి ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు. ప్రియాంక చోప్రా, ఐశ్వర్యారాయ్, అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ మొదలైన బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ వేడుకలో భాగమయ్యారు. అయితే ఐశ్వర్య రాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్, మిగిలిన కుటుంబ సభ్యులతో కలిసి వివాహానికి హాజరుకాలేదు.
పెళ్లిలో పాల్గొనడానికి ముందు.. అతిథులు వేదిక బయట మీడియాకు ఫోజులిచ్చారు. ఐశ్వర్య రాయ్.. అభిషేక్ బచ్చన్, అతని కుటుంబాన్ని వదిలేసిందని.. ఐశ్వర్య రాయ్- సల్మాన్ ఖాన్ కలిసి ఫోటో దిగారనే వాదనతో సల్మాన్ ఖాన్, అతని సోదరి అర్పితా ఖాన్‌తో ఐశ్వర్య రాయ్ ఉన్నట్లు చూపించే చిత్రం వైరల్ అవుతోంది. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు “సల్మాన్ ఐశ్వర్య” అనే శీర్షికతో ఈ చిత్రాన్ని పంచుకున్నారు. ఐశ్వర్య.. బచ్చన్ కుటుంబంతో , ఇప్పుడు ఆమె సల్మాన్ భాయ్‌తో ఉందంటూ పోస్టులు పెట్టారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. అర్పితా ఖాన్‌తో సల్మాన్ ఖాన్, ఐశ్వర్యరాయ్ తన కుమార్తె ఆరాధ్యతో కలిసి ఉన్న రెండు చిత్రాలను ఎడిట్ చేసి.. తప్పుడు వాదనతో షేర్ చేస్తున్నారు.
మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి ఈ చిత్రాన్ని వెతకగా.. సల్మాన్ ఖాన్ ఐశ్వర్య రాయ్‌తో కాకుండా ఒంటరిగా చిత్రాల కోసం పోజులిచ్చాడని చూపించే కొన్ని వీడియోలు, చిత్రాలు మాకు కనిపించాయి. వైరల్ బాలీవుడ్ అనే యూట్యూబ్ ఛానెల్ ప్రచురించిన వీడియోలో సల్మాన్ ఖాన్ అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహానికి వచ్చిన విజువల్స్ ఉన్నాయి. అతను కొద్దిసేపు మీడియాకు సోలోగా పోజులిచ్చాడు. ఆ తర్వాత సోదరి అర్పితా ఖాన్‌తో కలిసి ఫోటోలు దిగాడు.
అర్పితా ఖాన్‌తో పాటు సల్మాన్ ఖాన్ వివాహానికి వచ్చిన ఫోటోలను అనేక వార్తా వెబ్సైట్లు ప్రచురించినట్లు మేము కనుగొన్నాము. మన స్టార్స్ అనే యూట్యూబ్ ఛానెల్ ప్రచురించిన వీడియోను కూడా మేము కనుగొన్నాము. అక్కడ ఐశ్వర్య రాయ్ తన కుమార్తె ఆరాధ్యతో కలిసి వివాహ ప్రాంగణంలోకి ప్రవేశించి ఫోటోలకు పోజులిచ్చింది.
ఐశ్వర్య తన కుమార్తెతో కలిసి ఫోటోలు దిగారని ANI ప్రచురించిన ఒక చిత్రాన్ని మేము కనుగొన్నాము. అది వైరల్ చిత్రంలోని ఆమె ఒరిజినల్ ఫోటో. సల్మాన్ ఖాన్, అతని సోదరి అర్పితా ఖాన్ కలిసి ఉన్నట్లుగా చూపించే మరొక చిత్రానికి ఐశ్వర్య రాయ్ ను కలిపి వైరల్ ఇమేజ్ ను డిజిటల్‌గా ఎడిట్ చేశారు. అందువల్ల.. సల్మాన్ ఖాన్‌తో ఐశ్వర్య రాయ్ చిత్రాలకు పోజులిచ్చిన వైరల్ ఇమేజ్ ను ఎడిట్ చేశారు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : అనంత్ అంబానీ పెళ్లిలో అర్పితా ఖాన్‌తో కలిసి సల్మాన్ ఖాన్, ఐశ్వర్యరాయ్ ఫోటోగ్రాఫ్‌లకు పోజులివ్వడాన్ని వైరల్ చిత్రం చూపిస్తుంది
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story