Mon Nov 25 2024 00:25:01 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: కృత్రిమ వేళ్లకు సంబంధించిన చిత్రాలు జపాన్‌కు చెందినవి. భారతదేశం లేదా 2024 సాధారణ ఎన్నికలకు సంబంధించినవి కావు
18వ లోక్‌సభ ఎన్నికలకు రెండవ దశ ఓటింగ్ ఏప్రిల్ 26, శుక్రవారం జరగనుండగా, మొదటి దశ ఏప్రిల్ 19న ముగిసింది. ఇందులో దాదాపు 64% ఓటింగ్ నమోదైంది. రెండో దశ ఓటింగ్‌లో 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల (యూటీ)లోని 89 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
Claim :
ఎన్నికల్లో దొంగ ఓట్లను వేయడానికి పశ్చిమ బెంగాల్లో కృత్రిమ వేళ్లను తయారు చేస్తున్నారుFact :
ఈ చిత్రం జపాన్ కు సంబంధించిన కృత్రిమ వేళ్లను చూపుతుంది. ఇది ఒక కళాకారుడు సృష్టించినది.
18వ లోక్‌సభ ఎన్నికలకు రెండవ దశ ఓటింగ్ ఏప్రిల్ 26, శుక్రవారం జరగనుండగా, మొదటి దశ ఏప్రిల్ 19న ముగిసింది. ఇందులో దాదాపు 64% ఓటింగ్ నమోదైంది. రెండో దశ ఓటింగ్‌లో 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల (యూటీ)లోని 89 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికల సమయంలో దొంగ ఓట్లు వేయడానికి కృత్రిమ వేళ్లను తయారు చేస్తున్నారనే వాదనతో చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు రెండు చిత్రాలను పంచుకున్నారు. ఈ వేళ్లు బెంగాల్లో తయారవుతున్నాయని సోషల్ మీడియా వినియోగదారులు చెబుతున్నారు.
“ভোটে কারচুপির জন্য নকল আঙ্গুল: అంటూ బెంగాలీలో పోస్టులు పెడుతున్నారు.
জাল ভোট দেওয়ার জন্য নকল আঙ্গুল তৈরি হচ্ছে। আঙ্গুল তো নয় আঙ্গুলের খোলস। আঙ্গুল পরে নিলে বুঝাই যাবে না সেটি আসল না নকল। ভোটগ্রহণ কর্মীরা ওই আঙ্গুলে কালি মাখিয়ে বোকা বনে যেতে পারেন। দেশের কি হাল দেখুন “
ఈ వైరల్ పోస్టును అనువదించగా “ఓట్ల రిగ్గింగ్ కోసం నకిలీ వేళ్లు: దొంగ ఓట్లు వేయడానికి నకిలీ వేళ్లు సృష్టిస్తున్నారు. ఏది నిజమో, ఏది నకిలీదో మీరు చెప్పలేరు. పోలింగ్ సమయంలో పోలింగ్ నిర్వాహకులు మోసపోవచ్చు. దేశం ఎలా ఉందో చూడండి” అని అర్థం వస్తుంది.
గతసారి సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు 2019లో కూడా ఇలాంటి వాదనలతో చిత్రాలు ప్రచారంలో ఉన్నాయి.
ఈ వైరల్ విజువల్స్ వాట్సాప్ లో కూడా విస్తృతంగా షేర్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ చిత్రాలు భారతదేశానికి చెందినవి కావు.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. ఈ ఇమేజ్‌లు పాతవని. పలు న్యూస్ వెబ్సైట్లలో భాగస్వామ్యం చేసిన కథనాలను మేము కనుగొన్నాము.
deceptology.com అనే వెబ్సైట్ లో “How fake pinkies help Japanese Gangsters” అని ఉండగా.. “నకిలీ వేళ్లు జపనీస్ గ్యాంగ్స్టర్లకు ఎలా సహాయపడతాయి” అనే కథనంలో చిత్రాలను షేర్ చేశారు. రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులకు సిలికాన్ శరీర భాగాలను లేదా తీవ్రమైన ప్రమాదాల్లో గాయపడిన వారికి కాళ్లు, చేతులను తయారు చేసే వ్యక్తికి సంబంధించిన వివరాలను కూడా ఈ కథనం పంచుకుంటుంది.
ABC News వెబ్ సైట్ లో జూన్, 2013 నాటి కథనం ప్రకారం.. ఈ నకిలీ వేళ్ళను జపాన్ కు చెందిన మాఫియా ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటుంది. అక్కడి మాఫియా గ్యాంగ్ లలో ఎక్కువగా వేళ్లను నరికేసుకుంటూ ఉంటారు. ఈ పనిని "యూబిట్ సూమ్" అని అంటూ ఉంటారు. యకూజా మాఫియాకు చెందిన వాళ్లు ఏదైనా తప్పు చేసినా వేళ్లను నరికేసుకుంటూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు మాఫియా గ్రూప్ ల నుండి శిక్ష పడ్డాక కూడా బయటకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. అలా వెళ్ళిపోయిన వారికి ఇతర గ్యాంగ్ లలో దాదాపు అవకాశం ఇవ్వరు.. పని కూడా దొరకదు. అలాంటి వారి కోసం ఎక్కువగా ఈ కృత్రిమ వేలును ఉపయోగిస్తారు.
షింటారో హయాషి అనే వైద్యుడు సిలికాన్ ప్రొస్తెటిక్ వేళ్లను సృష్టిస్తూ ఉన్నారు. అచ్చం.. మన ఒరిజినల్ వేళ్ల లాగే ఈ వేళ్లు కూడా ఉంటాయి. ఒక్కొక్కటి దాదాపు $3,000 ధర ఉంటుంది. క్లయింట్ శరీరానికి సంబంధించిన ఖచ్చితమైన చర్మం రంగుతో సరిపోయేలా వేళ్లను జాగ్రత్తగా పెయింట్ చేస్తారు. హయాషి వ్యాపారంలోని సభ్యులు, తరచుగా వివిధ సీజన్ల కోసం అనేక సెట్ల వేళ్లను తమ దగ్గర ఉంచుకుంటూ ఉంటారు. కాలానికి తగ్గట్టుగా శరీరంలో మార్పు వస్తుంటే.. అందుకు తగ్గట్టుగా వేలును మార్చుకుంటూ ఉంటారు.
అందువల్ల, జపనీస్ మాజీ-మాఫియా సభ్యుల కోసం సిద్ధం చేసిన కృత్రిమ వేళ్ల చిత్రాలు తప్పుడు వాదనతో షేర్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో నకిలీ ఓటింగ్ కోసం తయారు చేస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. వైరల్ విజువల్స్ కు భారతదేశానికి ఎటువంటి సంబంధం లేదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.

Claim : ఎన్నికల్లో దొంగ ఓట్లను వేయడానికి పశ్చిమ బెంగాల్లో కృత్రిమ వేళ్లను తయారు చేస్తున్నారు
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story