Mon Dec 23 2024 09:10:26 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: నాసా హోలీ రోజున భారతదేశానికి సంబంధించిన శాటిలైట్ ఇమేజ్ ను తీసిందని జరుగుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
హోలీ అనేది రంగుల పండుగ, దీనిని మిలియన్ల మంది భారతీయులు జరుపుకుంటారు. ఇది వసంతకాలం ప్రారంభం, చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది.
Claim :
మార్చి 25, 2024న హోలీ సందర్భంగా అంతరిక్షం నుంచి నాసా తీసిన వైరల్ చిత్రంFact :
వైరల్ అవుతున్న చిత్రాన్ని నాసా తీయలేదు, మార్ఫింగ్ చేశారు
హోలీ అనేది రంగుల పండుగ, దీనిని మిలియన్ల మంది భారతీయులు జరుపుకుంటారు. ఇది వసంతకాలం ప్రారంభం, చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది. హోలికా దహనాన్ని పాటించడం.. ప్రజలు పాటలు పాడటం, నృత్యం చేయడం లాంటివి కలిసికట్టుగా చేస్తూ ఉంటారు. ఈ పండుగను ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా హోలీ ఆడటానికి ముందుకు వస్తారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లి ప్రేమను-అభిమానాన్ని చూపిస్తారు.
ఈ సంవత్సరం పండుగ తర్వాత, వివిధ రాష్ట్రాలు వివిధ రంగులతో నిండిపోయిన భారతదేశ మ్యాప్‌ను చూపించే చిత్రం X లో షేర్ చేస్తున్నారు. ఈ చిత్రం హోలీ రోజున NASA ద్వారా అంతరిక్షం నుండి తీశారు.
“1st time NASA image of India seen from space on Holi. Feel proud in new India. Share in your RWA WhatsApp before Soros makes NASA delete this image from their servers!” అనే వాదనతో షేర్ చేస్తున్నారు. నాసా ఈ ఫోటోను తీసిందని.. డిలీట్ చేయడానికంటే ముందే ఈ ఫోటోను వాట్సాప్ గ్రూప్ లలో షేర్ చేయాలని సోషల్ మీడియాలో కోరుతున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ చిత్రాన్ని ఎడిట్ చేశారు. నాసా తన వెబ్సైట్లో అలాంటి చిత్రాలను అప్లోడ్ చేయలేదు.
మేము Googleలో రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించినప్పుడు.. ఏ మీడియా వెబ్సైట్లో కూడా ఈ ఫోటో గురించి ప్రస్తావించినట్లు.. ఈ చిత్రాన్ని మేము కనుగొనలేకపోయాము. జాగ్రత్తగా గమనించగా.. భారతదేశ మ్యాప్‌కు రంగులు డిజిటల్‌గా జోడించినట్లు మనం కనిపెట్టవచ్చు. ప్రతి రాష్ట్రం మీద ఒక నిర్దిష్ట రంగును ఉంచారు. ఇది వాస్తవానికి సాధ్యం అవ్వదు. ప్రజలు అన్ని రంగులను ఉపయోగించి హోలీని జరుపుకుంటారు కానీ ఒక నిర్దిష్ట రంగుతో మాత్రమే చేపట్టరు.
మేము NASA వెబ్సైట్లో ప్రచురించిన చిత్రాలను కూడా వెతికాం. అందులో హొలీకి సంబంధించిన చిత్రాలను మేము కనుగొనలేకపోయాం.
“హోలీ” అనే కీవర్డ్‌లతో సెర్చ్ చేసినప్పుడు.. వెబ్సైట్లో సంబంధిత చిత్రాలను కూడా మేము కనుగొనలేకపోయాము.
మేము NASA సోషల్ మీడియా హ్యాండిల్‌లను కూడా తనిఖీ చేసాము.. కానీ హోలీ సందర్భంగా ఎటువంటి చిత్రాలను అప్లోడ్ చేయలేదని మేము గుర్తించాం.
అందువల్ల, హోలీ సందర్భంగా రంగులతో నిండిన భారతదేశం చిత్రం నాసా ప్రచురించిన అసలు చిత్రం కాదు. ఇది మార్ఫింగ్ చేసిన చిత్రం. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : Viral image was taken by NASA from space on the occasion of Holi on March 25, 2024
Claimed By : Twitter users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : False
Next Story