Sun Dec 22 2024 15:59:46 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఇండియన్ ఆర్మీ అధికారులు ఓటర్లను ప్రభావితం చేయడం లేదు.
2024 లోక్‌సభ ఎన్నికలు భారతదేశంలో 7 దశల్లో జరుగుతున్నాయి. మొదటి రెండు దశల్లో ఏప్రిల్ 19, ఏప్రిల్ 26న 190 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు. మూడో దశలో భాగంగా మే 7న కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ నిర్వహించారు
Claim :
పోలింగ్ బూత్‌లో నకిలీ ఓట్లు వేస్తుండగా ఇండియన్ ఆర్మీ అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారుFact :
వీడియో పాతది, ఓట్లు వేయడానికి ఆర్మీ అధికారులు వారి కుటుంబాలను పోలింగ్ బూత్‌కు తీసుకుని వస్తున్నారు. భారత ఆర్మీ ఓటర్లను ప్రభావితం చేయలేదు
2024 లోక్‌సభ ఎన్నికలు భారతదేశంలో 7 దశల్లో జరుగుతున్నాయి. మొదటి రెండు దశల్లో ఏప్రిల్ 19, ఏప్రిల్ 26న 190 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు. మూడో దశలో భాగంగా మే 7న కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ నిర్వహించారు. నాల్గవ దశ మే 13, 2024న నిర్వహించనున్నారు. ఎన్నికలు, పోలింగ్ కు సంబంధించి అనేక చిత్రాలు, వీడియోలు తప్పుదారి పట్టించే వాదనతో సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
ఆర్మీ ట్రక్ దగ్గర ఆర్మీ సిబ్బందిని చూపించే ఓ వీడియో వైరల్ అవుతూ ఉంది. ట్విట్టర్లో ఆర్మీ అధికారులు ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని, బీజేపీకి నకిలీ ఓట్లు వేస్తున్నారనే వాదనతో ప్రచారంలో ఉంది.
“BIG BREAKING. Army is being used by the BJP to cast fake votes. INDIAN ARMY has been assigned to do ILLEGAL & FRAUDULENT work for the BJP. Caught RED handed inside the Election Booths to influence voters for FAKE Votes to the BJP.. #ArvindKejriwal #LokSabhaElections2024” అనే క్యాప్షన్ తో వీడియోను పోస్టు చేశారు. భారతీయ జనతా పార్టీ ఫేక్ ఓట్లను వేయించడానికి ఏకంగా ఆర్మీనే ఉపయోగించిందని.. చివరికి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని ఈ పోస్టుల్లో చెబుతున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో పాతది. 2024 ఎన్నికలకు సంబంధించినది కాదు. 2019 ఎన్నికల సమయంలో కూడా ఇదే వీడియోను వైరల్ చేశారు. వైరల్ వాదనలో ఎలాంటి నిజం లేదని తేలింది.
మేము వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్‌లను తీసుకుని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను అమలు చేశాం. మేము శౌర్య చక్ర బ్రిగేడియర్ హర్దీప్ సింగ్ సోహి ట్విట్టర్ పోస్ట్‌ను కనుగొన్నాము. “WRONG to use name of #IndianArmy to create sensationalism & spread misinfo. Indian Army has always been apolitical. This is an old clip of Grenadiers Regimental Centre veh in #Jabalpur apparently ferrying their folks to exercise #RightToVote" అంటూ పోస్టు పెట్టారు. భారత ఆర్మీ గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారని అందులో వివరించారు.
దీన్ని క్యూగా తీసుకుని ‘Grenadiers Regimental Centre, Jabalpur” అనే కీవర్డ్స్ ను తీసుకుని మేము గూగుల్ సెర్చ్ చేశాం. 2019లో కొన్ని ఫ్యాక్ట్ చెక్ సంస్థలు ఈ వైరల్ పోస్టులను ఫ్యాక్ట్ చెక్ చేసిన కథనాలను మేము కనుగొన్నాము.
భారత సైన్యం కూడా ఈ వాదనలను తప్పుబట్టింది. ఈ ఆరోపణలు పూర్తిగా అబద్ధమని.. వ్యక్తులు వీడియో తీయబడినప్పుడు కమాండెంట్ని పిలిచారని.. ఆయన ఎటువంటి గొడవలకు దిగవద్దని సూచించారని తెలిపారు. ఓటు హక్కును వినియోగించుకోవాలని వారికి చెప్పారు.
తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్న వారిపై ఆర్మీ ఫిర్యాదు చేసింది. వీడియోను చిత్రీకరించిన దుండగులపై ఆర్మీ సిబ్బంది ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన వార్తా కథనాన్ని కూడా మేము కనుగొన్నాము.
ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తా కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లోని ఆర్మీ అధికారులు సాధారణ ప్రజలకు సంబంధించిన ఓటరు ID కార్డులను లాక్కోవడానికి ప్రయత్నించారని, కంటోన్మెంట్లో పోస్ట్ చేసిన ఆర్మీ ఓటర్లను అడ్డగించారని తప్పుడు కథనాలను ప్రసారం చేసిన వారిపై ఫిర్యాదు చేశారు. తప్పుడు కథనాలను ప్రచారం చేసిన గుర్తు తెలియని దుండగులపై ఇండియన్ ఆర్మీ అధికారులు ఫిర్యాదు చేశారు. వైరల్ విజువల్స్ ను ఏప్రిల్ 29, 2019న అప్లోడ్ చేశారు. ఈ నివేదికను మే 2, 2019న ప్రచురించారు.
కాబట్టి, వైరల్ వీడియో 2024 ఎన్నికలకు సంబంధించినది కాదు. ఆర్మీ అధికారులు ఓట్లు వేయడానికి వారి కుటుంబాలను ఆర్మీ ట్రక్కులో తీసుకుని వచ్చారు. వారు ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు. వైరల్ అవుతున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదు.
Claim : పోలింగ్ బూత్‌లో నకిలీ ఓట్లు వేస్తుండగా ఇండియన్ ఆర్మీ అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు
Claimed By : Twitter users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : False
Next Story