ఫ్యాక్ట్ చెక్: జ్యోతి యర్రాజీ బంగారు పతకం గెలిచింది ఆసియా గేమ్స్ లో కాదు.. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్
భారత్ కు చెందిన ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్.. జ్యోతి యర్రాజీ ఓ రేసులో విజయం సాధించిన
Claim :
ఆసియా క్రీడల్లో మహిళల 100 మీటర్ల హర్డిల్‌లో అథ్లెట్ జ్యోతి యర్రాజీ స్వర్ణ పతకం సాధించిందిFact :
వీడియో ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో యర్రాజీ విజయానికి సంబంధించినది
భారత్ కు చెందిన ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్.. జ్యోతి యర్రాజీ ఓ రేసులో విజయం సాధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. అయితే ఆమె చైనాలో ఆసియా గేమ్స్ 100 మీటర్ల ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్ లో స్వర్ణ పతకం సాధించిందంటూ వీడియోను వైరల్ చేస్తున్నారు.
మేము ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్, ఆసియా క్రీడల లోగోలను పోల్చి చూశాం. వైరల్ వీడియో 2023 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ కు సంబంధించిన ఫుటేజ్ అని ఇది స్పష్టంగా తెలుస్తోంది. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ లో 100 మీటర్ల హర్డిల్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుంది జ్యోతి. ఆసియా క్రీడల్లో జ్యోతి బంగారు పతకాన్ని గెలుచుకోలేదు.
ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ థాయిలాండ్ దేశంలోని బ్యాంకాక్‌లో జూలై 12 నుండి 16, 2023 వరకు సాగింది. ఐదు రోజుల పాటూ ఈ ఈవెంట్ నిర్వహించారు. ఆసియా క్రీడలు చైనాలోని హాంగ్జౌలో సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 8 వరకు షెడ్యూల్ చేశారు.