ఫ్యాక్ట్ చెక్: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కట్టిన పాఠశాలకు ప్రధాని మోదీ వెళ్లలేదు
ఢిల్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు పోటీలో నిలబడ్డారు. ప్రజల మద్దతు తమకే ఉందంటూ ఎంతో ధైర్యంగా
Claim :
ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్మించిన పాఠశాలను భారత ప్రధాని మోదీ సందర్శించిన వీడియో ఇదిFact :
UPలోని వారణాసిలోని పాఠశాల విద్యార్థులతో ప్రధాని మోదీ సంభాషించిన వీడియో
ఢిల్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు పోటీలో నిలబడనున్నారు. ప్రజల మద్దతు తమకే ఉందంటూ ఎంతో ధైర్యంగా ఉన్నారు, ప్రధానంగా ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ ఉంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5, 2025న ఓటింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8, 2025న ఓట్ల లెక్కింపు తర్వాత ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. సోషల్ మీడియాలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కొందరు నాయకులను చాలా గొప్పగా ఓ వైపు అభివర్ణిస్తూ ఉండగా, మరో వైపు ఇతర రాజకీయ నాయకుల ప్రతిష్టను దిగజార్చేందుకు అనేక చిత్రాలు, వీడియోలను షేర్ చేస్తున్నారు. తప్పుదారి పట్టించే ఎన్నో వాదనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
క్లెయిం ఆర్కైవ్ లింకు ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదనలో నిజం లేదు. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని పాఠశాలను సందర్శించినట్లు వీడియోలో లేదు. యూపీలోని వారణాసిలోని స్కూల్లో ఈ వీడియోను చిత్రీకరించారు. వీడియో నుండి కీఫ్రేమ్లను తీసుకుని గూగుల్ లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, వైరల్ వీడియో ఇటీవలిది కాదని, ఆ వీడియో 2023 సంవత్సరానికి చెందినదని తేలింది. ప్రధాని మోదీ తలపెట్టిన వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రలో భాగంగా చిత్రీకరించారని తెలుస్తోంది.