Fri Jan 03 2025 03:48:39 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఇన్ఫోసిస్-రిలయన్స్ సంస్థలు కలిసి ఆదాయం వచ్చేలా యాప్ ను సృష్టించలేదు.
డీప్‌ఫేక్స్ వంటి తాజా సాంకేతికను ఉపయోగించి ప్రజలను మోసం చేయడానికి స్కామర్లు సరికొత్త మార్గాలను ఉపయోగిస్తూ ఉన్నారు.
Claim :
ఇన్ఫోసిస్, రిలయన్స్ సంస్థలు కలిసి భారత పౌరులు డబ్బు సంపాదించడానికి ఆటోమేటెడ్ యాప్‌ను రూపొందించారు.Fact :
వీడియో ఏఐ ద్వారా రూపొందించారు. ఇన్ఫోసిస్, రిలయన్స్ పరిశ్రమలు కలిసి అలాంటి యాప్ ఏదీ ప్రారంభించలేదు.
డీప్‌ఫేక్ వంటి సాంకేతికను ఉపయోగించి ప్రజలను మోసం చేయడానికి స్కామర్లు సరికొత్త మార్గాలను ఉపయోగిస్తున్నారు. విరాట్ కోహ్లి, ముఖేష్ అంబానీ, నీరజ్ చోప్రా, సుధా మూర్తి వంటి ప్రముఖులతో గేమింగ్ యాప్‌లు, ఫైనాన్షియల్ యాప్‌లు మొదలైనవాటిని పాపులర్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఈ వీడియోలలో ప్రముఖులను చూసి ప్రజలు చాలా తొందరగా మోసపోతారు. గణనీయమైన ఆర్థిక ప్రతిఫలాలను అందిస్తాయని నమ్మేస్తూ ఉంటారు. అందులో పెట్టుబడి పెట్టడానికి సిద్ధమవుతారు. ఈ వీడియోలు తరచుగా ఎవరైనా యాంకర్లతో న్యూస్ ఛానెల్ చర్చలా కనిపిస్తాయి.
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నందన్ నీలేకని, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ, ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్తో తాము అభివృద్ధి చేసిన యాప్ గురించి చర్చిస్తున్నట్లు ఫేస్బుక్లో వీడియో ఒకటి వైరల్ అవుతూ ఉంది.
వీడియోలో కుడి ఎగువ మూలలో ఇండియా టుడే లోగో ఉంది. ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ముగ్గురు దిగ్గజ పారిశ్రామికవేత్తలతో మాట్లాడుతున్నట్లు చూపిస్తుంది. ఇన్ఫోసిస్‌కు చెందిన నారాయణ మూర్తి, రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ముఖేష్ అంబానీ, నందన్ నీలేకని అక్కడ ఉన్నారు. ఈ దేశ ప్రజలందరూ సులువుగా డబ్బు ను ఆర్జించగలిగే యాప్‌ని కలిసి అభివృద్ధి చేస్తున్నామని అందులో చెప్పడం వినొచ్చు. ఇన్ఫోసిస్, రిలయన్స్ పరిశ్రమలు కలిసి ఆటోమేటెడ్ యాప్‌ను రూపొందించాయని, లాభదాయకమైన ఆర్థిక లావాదేవీలను అందించనుంది. తానే స్వయంగా యాప్‌ను ఉపయోగించానని చెక్ చేశానని నారాయణ స్వామి చెప్పడం వినొచ్చు. ముకేష్ అంబానీ కూడా తాము అత్యుత్తమ ఇంజనీర్లను నియమించుకున్నామని, మానవ ప్రమేయం లేకుండానే అత్యుత్తమ ఆటోమేటెడ్ యాప్‌ను రూపొందించడానికి అత్యుత్తమ సాంకేతికతను ఉపయోగించామని చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇది భారతీయ పౌరులు, వ్యాపారవేత్తలు, కంపెనీలకు అందుబాటులో ఉంటుంది. నందన్ నీలేకని కూడా ఆర్థిక వ్యవస్థను పెంచడానికి ఇంతకంటే మంచి అవకాశం లేదని చెప్పారు. మొదటి 50000 మంది భారతీయులు ప్రయోజనాలను పొందుతారని, మంచి ఆదాయాన్ని పొందవచ్చని చెప్పడం వినొచ్చు.
క్లెయిం స్క్రీన్ షాట్ ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ బిలియనీర్లు అలాంటి యాప్ ఏదీ డెవలప్ చేయలేదు, AI ఉపయోగించి వీడియోను రూపొందించారు. మేము వీడియోను జాగ్రత్తగా పరిశీలించినప్పుడు, ఆడియో, వీడియోలో కొన్ని లాగ్‌లు ఉన్నాయని తెలిసింది. యాంకర్ ప్రముఖుల పేర్లు తప్పుగా చెప్పడం మనం కొన్నిసార్లు వినవచ్చు. వీడియోలో లిప్ సింక్ లేదని గమనించవచ్చు.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, మే 2020లో ఆండ్రియాస్ వాన్ డి లార్ అనే యూట్యూబ్ ఛానెల్ ప్రచురించిన ఇంటర్వ్యూ నుండి మిస్టర్ నారాయణ మూర్తి క్లిప్ తీసుకున్నట్లు మేము కనుగొన్నాము. మూర్తి దుస్తులు, ఈ వీడియో బ్యాగ్రౌండ్ కూడా వైరల్ వీడియోతో సరిపోలింది.
మేము ముఖేష్ అంబానీని చూపించే కీఫ్రేమ్‌లను సంగ్రహించి, Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించగా డిసెంబర్ 2020లో X ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో అదే విజువల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ట్వీట్‌ను ఎన్డిటివి ఎక్స్‌లో ప్రచురించింది.
మేము ముఖేష్ అంబానీని చూపించే కీఫ్రేమ్‌లను సంగ్రహించి, Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించగా డిసెంబర్ 2020లో X ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో అదే విజువల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ట్వీట్‌ను ఎన్డిటివి ఎక్స్‌లో ప్రచురించింది.
వీడియో డీప్‌ఫేక్ కాదా అని విశ్లేషించేందుకు తెలుగుపోస్ట్ టీమ్ డీప్‌ఫేక్స్ అనాలిసిస్ యూనిట్ ఆఫ్ మిస్ ఇన్ఫర్మేషన్ కాంబ్ట్ అలయన్స్‌ను (Deepfakes Analysis Unit of Misinformation Combat Alliance) సంప్రదించింది. వైరల్ వీడియో AI రూపొందించినది అని DAU ధృవీకరించింది.
హైవ్ మోడరేషన్ AI సాధనాన్ని ఉపయోగించినప్పుడు, మొదటి 30 సెకన్ల వీడియో "Not-AI" అని కనుగొనబడింది, కానీ మిగిలినవి AIతో మార్చినట్లు కనుగొన్నాం. వైరల్ విజువల్స్ కోసం, ఇతర స్పీకర్లు ఫ్రేమ్‌లో కనిపించినప్పటికీ, ఇన్సెట్లోని నీలేకని విజువల్స్‌లో టూల్ నిరంతరం మానిప్యులేషన్‌ను గుర్తించింది. నీలేకని విజువల్స్‌లో అతని ఫ్రేమ్‌లు చివరి వరకు జూమ్ చేసినప్పుడు ఏఐ అని తేలింది.
ఇన్విడ్ వెరిఫై టూల్లో భాగమైన హియా వాయిస్ డిటెక్షన్ టూల్‌ని ఉపయోగించి ఆడియోని కూడా తనిఖీ చేసాము. Hiyaని ఉపయోగించగా వాయిస్(లు) A.I. ద్వారా రూపొందించినట్లు కనుగొన్నాము.
ట్రూమీడియా ఆడియో, విజువల్ డిటెక్టర్లు, A.I ద్వారా ఆడియోను మార్చారని కూడా కనుగొంది.
కనుక, పారిశ్రామిక దిగ్గజాలు కలిసి నెలకు 3 మిలియన్ల వరకు ఆదాయాన్ని పొందేలా యాప్‌ను రూపొందించినట్లు వైరల్ వీడియో నిజం కాదు. దీన్ని AI ద్వారా సృష్టించారు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : ఇన్ఫోసిస్, రిలయన్స్ సంస్థలు కలిసి భారత పౌరులు డబ్బు సంపాదించడానికి ఆటోమేటెడ్ యాప్‌ను రూపొందించారు.
Claimed By : Facebook User
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Facebook
Fact Check : False
Next Story