Mon Dec 23 2024 03:52:11 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: వైఎస్ఆర్సీపీ గెలుపుపై ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రీ పోల్ సర్వే నివేదికను ప్రచురించలేదు
ఆంధ్రప్రదేశ్‌లో మే 13, 2024న పార్లమెంటు ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు కూడా పోలింగ్ నిర్వహించనున్నారు. పలు పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం కూడా వేడెక్కింది
Claim :
ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయిFact :
వైరల్ అవుతున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదు. ఇంటెలిజెన్స్ బ్యూరో అటువంటి నివేదికలను ప్రచురించదు
ఆంధ్రప్రదేశ్‌లో మే 13, 2024న పార్లమెంటు ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు కూడా పోలింగ్ నిర్వహించనున్నారు. పలు పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయ వాతావరణం కూడా వేడెక్కింది. ఈ నేపథ్యంలో ఫేక్ పోల్ సర్వేలు, నేతల ప్రకటనలు, మార్ఫింగ్ చేసిన చిత్రాలు, పార్టీల అభ్యర్థుల ఎడిట్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో రకరకాల తప్పుడు సమాచారాన్ని వైరల్ చేస్తున్నారు.
తాజాగా పలువురు యూజర్లు షేర్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ లలో.. ఇంటెలిజెన్స్ బ్యూరో రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయం గురించి ఒక నివేదికను ప్రచురించిందని ఉంది. వైఎస్సార్సీపీ 124 సీట్లు గెలుచుకుని వరుసగా రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని ఆ పోస్ట్‌లు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా ఎన్డీయే కూటమి 52 సీట్లకే పరిమితం కానుంది. వైఎస్సార్సీపీకి 51 శాతం ఓట్లు వచ్చాయని నివేదిక పేర్కొందన్నది వైరల్ పోస్టుల్లో ఉంది.
“కేంద్ర ఇంటలిజెన్స్ రిపోర్టులో వైసీపీదే ప్రభంజనం 124 సీట్లతో వైసీపీ అధికారంలోకి వస్తుందన్న నిఘా సంస్థ ఐబీ 51 సీట్లకే పరిమితం కాబోతున్న ఎన్టీయే కూటమి ఇటీవలే ఏపీలో రహస్య సర్వే నిర్వహించిన ఇంటలిజెన్స్ బ్యూరో 51 శాతం ఓటు బ్యాంకుతో మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి!! “ అంటూ పోస్టులు పెడుతున్నారు.
“కేంద్ర ఇంటలిజెన్స్ రిపోర్టులో వైసీపీదే ప్రభంజనం 124 సీట్లతో వైసీపీ అధికారంలోకి వస్తుందన్న నిఘా సంస్థ ఐబీ 51 సీట్లకే పరిమితం కాబోతున్న ఎన్టీయే కూటమి ఇటీవలే ఏపీలో రహస్య సర్వే నిర్వహించిన ఇంటలిజెన్స్ బ్యూరో 51 శాతం ఓటు బ్యాంకుతో మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి!! “ అంటూ పోస్టులు పెడుతున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఇంటెలిజెన్స్ బ్యూరో అటువంటి నివేదికలను ప్రచురించదు.
ఇంటెలిజెన్స్ బ్యూరో అనేది దేశంలోని అంతర్గత, బాహ్య భద్రతా సమస్యల గురించి తెలియజేసి.. దేశ రక్షణ కోసం పాటుపడే ఒక సంస్థ. అంతే తప్ప ఎన్నికలపై ఎలాంటి రహస్య సర్వేలు నిర్వహించదు.
భారతదేశానికి చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో ఒక ప్రసిద్ధ గూఢచార సంస్థ. ఇంటెలిజెన్స్ బ్యూరోను అధికారికంగా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నియంత్రిస్తుంది. దేశ పరిపాలనలోని అన్ని అంశాలను పర్యవేక్షించే బాధ్యత కలిగిన అంతర్గత ఏజెన్సీగా పరిగణిస్తారు. ముఖ్యంగా శత్రు మూకలను, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ఇంటెలిజెన్స్ బ్యూరో సిద్ధంగా ఉంటుంది. ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) పార్లమెంటరీ కార్యక్రమాలకు సంబంధించిన పరిణామాలను నిశితంగా పర్యవేక్షిస్తుంది. క్యాబినెట్ సెక్రటేరియట్‌కు తిరిగి నివేదికలు అందజేస్తుంది.
ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రధాన లక్ష్యం కీలక సమాచారాన్ని సేకరించడం. అనేక బహిరంగ, రహస్య పద్ధతులను ఉపయోగించి ఏజెన్సీ గూఢచర్యాన్ని చేస్తుంది. IB బాధ్యతలు నిఘా (భౌతిక, ఎలక్ట్రానిక్ రెండూ), పరిశోధన, కమ్యూనికేషన్ , చొరబాటు లాంటి వాటిపై కీలక సమాచారాన్ని కలిగి ఉంటుంది. ఇంటెలిజెన్స్ ఉద్యోగులు ఎక్కడైనా ఉండొచ్చు.. ఇతర ఉద్యోగాలు చేస్తూ సమాచారాన్ని కూడా అందిస్తూ ఉండొచ్చు.
ఎన్నికల ప్రక్రియ లేదా ఫలితాలు ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా తెలుసుకోరు.
మేము ప్రభుత్వ ఏజెన్సీకి చెందిన సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను సెర్చ్ చేయగా.. మాకు అలాంటి నివేదికలు ఏవీ కనిపించలేదు.
ఈటీవీకి చెందిన బ్రేకింగ్ న్యూస్ టెంప్లేట్‌ను ఉపయోగించి కొందరు తప్పుడు వార్తలను షేర్ చేస్తున్నారని ఈటీవీ ఒక టీవీ నివేదికను ప్రచురించింది. నకిలీ టెంప్లేట్లను సృష్టించిన సోషల్ మీడియా వినియోగదారులపై సంస్థ హైదరాబాద్‌లోని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆంధ్రజ్యోతి వెబ్సైట్ కూడా ప్రచారంలో ఉన్న సర్వే నివేదిక నకిలీదని.. సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అటువంటి నివేదికను పంచుకోలేదంటూ కథనాన్ని ప్రచురించింది.
కాబట్టి, ఇంటెలిజెన్స్ బ్యూరో పేరుతో ప్రచురించిన ప్రీ పోల్ సర్వే రిపోర్ట్ ఫేక్. ఎన్నికల సర్వే నివేదికను ప్రభుత్వ యంత్రాంగం ప్రచురించదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story