ఫ్యాక్ట్ చెక్: USA లో జరిగిన కాన్ఫరెన్స్‌లో దాల్ చావల్ బెస్ట్ హెల్తీ ఫుడ్‌గా ప్రకటించలేదు
ప్రజల జీవన శైలిలో చాలా మార్పులు వచ్చాయి. వీలైనంత త్వరగా ఇంటి పని, ఉద్యోగ పని పూర్తి చేయాలి అనుకుంటూ బిజీ అయిపోతున్నారు
Claim :
USAలో జరిగిన ప్రపంచ ఆహార, పోషకాహార సదస్సులో దాల్ చావల్ ను ఆరోగ్యకరమైన ఆహారంగా ప్రకటించారుFact :
శాస్త్రవేత్తలు సాంప్రదాయ ఆహారాలను ఆరోగ్యకరమైనవిగా గుర్తించారని మాత్రమే తెలుపబడింది. ఎలాంటి బిరుదులూ ఇవ్వలేదు
ప్రజల జీవన శైలిలో చాలా మార్పులు వచ్చాయి. వీలైనంత త్వరగా ఇంటి పని, ఉద్యోగ పని పూర్తి చేయాలి అనుకుంటూ బిజీ అయిపోతున్నారు. వేగవంతమైన జీవనశైలి కారణంగా ఒత్తిడి స్థాయి బాగా పెరిగిపోతూ ఉంటుంది. భోజన వేళలు కూడా సరిగా ఉండక పోవడం వల్ల ఎన్నో కష్టాలు మొదలు అవుతున్నాయి. దీంతో స్థూలకాయం, నిద్ర లేమి, మానసిక ఆరోగ్య సమస్యలు మొదలైన వాటితో సహా శారీరక ఆరోగ్యం కూడా దిగజారిపోతూ ఉంటుంది. సాధారణంగా తీసుకునే ఆహారం కాకుండా ప్రజలు అధిక కేలరీలు ఉన్న జంక్ ఫుడ్‌ను తినడానికి మొగ్గు చూపుతున్నారు. ఒంట్లో చక్కెర, కొవ్వు పేరుకుపోడానికి ఈ ఆహారం ముఖ్య కారణం.
క్లెయిం ఆర్కైవ్ లింకు ను ఇక్కడ చూడొచ్చు.మంచి ఆహారం, మంచి ఆరోగ్యానికి కారణమవుతుంది. శరీర పనితీరుకు మద్దతు ఇస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జంక్ ఫుడ్ జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం వల్ల బరువు పెరగడం, పోషకాహార లోపం, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం మరీ ఎక్కువగా ఉంటుంది. భారతీయ ఆహారంలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయని, అనారోగ్యకరమైనవనే అపోహ ఉంది. కొన్నింటిలో చక్కెర, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు అధిక స్థాయిలో ఉండవచ్చు. కానీ అనేక సాంప్రదాయ వంటకాలలో మంచి పోషకాహారాలు కూడా ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఇటీవల, భారతీయ వంటకం ‘దాల్ చావల్’ ప్రాముఖ్యత గురించి ఒక మహిళ మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సా లో జరిగిన ప్రపంచ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కాన్ఫరెన్స్‌లో దాల్ చావల్ బెస్ట్ హెల్తీ ఫుడ్‌గా ప్రకటించారనే వాదనతో ఈ వీడియోను షేర్ చేశారు.
క్లెయిం ఆర్కైవ్ లింకు ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేదిగా ఉంది. USA లో జరిగిన ప్రపంచ ఆహారం, పోషకాహార సదస్సులో దాల్ చావల్‌ను ఉత్తమ ఆహారంగా ప్రకటించలేదు.
వీడియో లో ఆమే చెప్పేది విన్నప్పుడు, ఆమె మాంచేస్టర్ లో జరిగిన ఒక కాంఫరెన్స్ లో జరిగిన ఉదంతం గురించి చెప్తున్నారని అర్ధం అయింది, USA లో కాదు.
వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి గూగుల్ లో సెర్చ్ చేశాం. అందులో మాట్లాడుతున్న మహిళను జినాల్ షా గా గుర్తించాం. పోషకాహార నిపుణులని మేము కనుగొన్నాము. jinals89 అనే ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కూడా అదే వీడియోను షేర్ చేశారు. ఆహారం విషయంలో చాలా విషయాలలో మన పెద్దవాళ్లు సరైన పద్ధతులు పాటించారని ఆమె వివరించారు. స్థానిక, సీజనల్, సాంప్రదాయ ఆహారం, దాల్ రైస్, సాంబార్ రైస్, ఖిచడి మొదలైన వంటకాలు ఆరోగ్యకరమైనవి, పోషకాలతో నిండినవని వివరించారు. రోటరీ సమ్మిట్‌లో తన ప్రసంగానికి సంబంధించిన క్లిప్ అంటూ ఆమె ఈ వీడియోను షేర్ చేసారు. కాన్ఫరెన్స్‌లో దాల్ చావల్‌ను బెస్ట్ హెల్తీ ఫుడ్‌గా ఎంపిక చేసినట్లు ఆమె తన ప్రసంగంలో చెప్పలేదు.
మాంచెస్టర్‌లో జరిగిన కాన్ఫరెన్స్‌ల గురించిన వివరాల కోసం వెతకగా.. డిసెంబర్ 2024లో ఇంటర్నేషనల్ స్పోర్ట్ అండ్ ఎక్సర్సైజ్ న్యూట్రిషన్ కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు తెలుస్తోంది.
మేము ISENC24 కాన్ఫరెన్స్ సోషల్ మీడియా హ్యాండిల్‌లను తనిఖీ చేసినప్పుడు, మాకు అలాంటి పోస్ట్‌లు ఏవీ కనిపించలేదు.
టైమ్స్ఆఫ్ ఇండియా ప్రకారం, దాల్ లో అంటే పప్పులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. పప్పు పోషకాహారానికి పవర్‌హౌస్ లాంటిది. వాటిలో ప్రోటీన్లు, డైటరీ ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
పప్పు దినుసులు అద్భుతమైన ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ సోర్స్ గా భావిస్తారు. ఇవి శాఖాహారులకు ప్రోటీన్ కోసం ఎంతో కీలకమైనవి. ఒక కప్పు వండిన పప్పు సుమారు 18 గ్రాముల ప్రొటీన్‌ను అందిస్తుంది. పప్పులో కరిగే, కరగని పీచు ఉంటుంది. కరిగే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను, తక్కువ కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. కరగని ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఐరన్, ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం వంటి అవసరమైన విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటాయి. రక్తహీనతను నివారించడానికి ఐరన్ కూడా చాలా ముఖ్యమైనది. మెగ్నీషియం కండరాలు, నరాల పనితీరుకు మద్దతు ఇస్తుంది. పొటాషియం గుండె ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది.
బియ్యం, ప్రత్యేకించి బ్రౌన్ రైస్ లో పోషకాలలు ఉంటాయి. బియ్యం కార్బోహైడ్రేట్లను అందిస్తుంది. వీటిని తీసుకుంటే రోజువారీ కార్యకలాపాలకు అవసరమైన శక్తి లభిస్తుంది. ఒక కప్పు వండిన అన్నంలో దాదాపు 45 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. జీవక్రియ ప్రక్రియలకు అవసరమైన నియాసిన్, రిబోఫ్లావిన్, థయామిన్‌తో సహా బి విటమిన్లకు బియ్యం మంచి మూలం. బ్రౌన్ రైస్‌లో మెగ్నీషియం, మాంగనీస్, సెలీనియం పుష్కలంగా ఉంటాయి. మెగ్నీషియం కండరాల పనితీరులో సహాయపడుతుంది, ఎముకల నిర్మాణానికి మాంగనీస్ అవసరం, సెలీనియం యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరంలోని కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది.
NDTVఫుడ్ ప్రకారం, దాల్ చావల్ శరీరానికి పోషకాలను అందించే సూపర్ హీరో. పప్పు ధాన్యాలు ఫైబర్, ఐరన్, ఫోలేట్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలతో నిండి ఉంటాయి. వీటిని తీసుకుంటే కడుపు నిండిపోయినట్లు అనిపిస్తుంది. రైస్ తీసుకుంటే వచ్చే కార్బోహైడ్రేట్లు మీ శరీరానికి శక్తినిస్తాయి. అన్ని వయసుల వారి కోసం పోషకాలను అందించగలదు.
దాల్ చావల్ ను ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన ఆహార ఎంపికలలో ఒకటిగా గుర్తించినప్పటికీ. మాంచెస్టర్‌లో జరిగిన ప్రపంచ ఆహారం, పోషకాహార సదస్సులో ఇది ఉత్తమ ఆరోగ్యకరమైన ఆహారంగా ప్రకటించలేదు. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.