Mon Dec 23 2024 07:14:04 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ప్రీమియం ఫీచర్లను ఉపయోగించినందుకు వాట్సాప్ తన వినియోగదారులకు ఛార్జీలను వసూలుచేయబోతోందా?
ప్రీమియం ఫీచర్లను వినియోగించే వినియోగదారులతో వాట్సాప్ త్వరలో ఛార్జీలను వసూలు చేయబోతోందని సోషల్ మీడియా వినియోగదారులు ఒక పోస్ట్‌ను షేర్ చేస్తున్నారు.
ప్రీమియం ఫీచర్లను వినియోగించే వినియోగదారులతో వాట్సాప్ త్వరలో ఛార్జీలను వసూలు చేయబోతోందని సోషల్ మీడియా వినియోగదారులు ఒక పోస్ట్‌ను షేర్ చేస్తున్నారు.
నిజ నిర్ధారణ:
వైరల్ అవుతున్న పోస్టు ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది.
మేము 'WhatsApp premium features for users' వంటి సంబంధిత కీవర్డ్స్ ను ఉపయోగించి వైరల్ వార్తల గురించి ఇంటర్నెట్లో శోధించాము. అయితే అందుకు సంబంధించి అనేక నివేదికలను కనుగొన్నాము.
అక్టోబరు 10, 2022న ప్రచురించబడిన Quint నివేదిక ప్రకారం.. WhatsApp ప్రీమియం సబ్స్క్రిప్షన్ సేవ బిజినెస్ యూజర్ల కోసం తీసుకుని వచ్చిందని నివేదించారు. బీటా టెస్టర్లు, వినియోగదారుల కోసం ప్రస్తుతం ప్రీమియం వ్యాపార సబ్స్క్రిప్షన్ ప్లాన్ రూపొందించబడిందని వివరించారు. వాట్సాప్ బిజినెస్ ను వినియోగించే వారి కోసం త్వరలోనే అధికారికంగా ప్రారంభించనున్నారని ఆ కథనాల్లో తెలిపారు.
wabetainfo.com కథనం ప్రకారం.. "Latest versions of WhatsApp Business beta for Android and iOS are marked as compatible updates." ఆండ్రాయిడ్, iOS కోసం WhatsApp బిజినెస్ బీటా తాజా వెర్షన్లకు సంబంధించిన అప్డేట్లు ఉన్నట్లు గుర్తించారు.
సభ్యత్వ రుసుము దేశాన్ని బట్టి మారవచ్చు. ఈ ప్రీమియం ఫీచర్ బిజినెస్ వినియోగదారులను ఒకే సమయంలో ఒకే ఖాతా నుండి విభిన్న WhatsApp అకౌంట్లకు మెసేజీలు పంపవచ్చు.. ఎన్నో డివైజ్ లలో ఒకే అకౌంట్ ను కూడా ఉపయోగించవచ్చు.
పలు మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి.
https://www.ndtv.com/world-
https://brandequity.
మెసేజ్‌లను షేర్ చేసినందుకు కూడా వాట్సాప్ తన వినియోగదారులకు ఛార్జీ వసూలు చేస్తుందని వంటి వాదనలు చెలామణి అవుతున్నాయని మేము కనుగొన్నాము.
మేము WhatsApp వెబ్‌సైట్‌ను శోధించాము. సందేశాలు పంపడానికి వినియోగదారులకు ఛార్జీ విధించే కొత్త విధానాన్ని WhatsApp ప్రకటించలేదని కనుగొన్నాము.
https://www.facebook.com/
వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదారి పట్టించేది. WhatsApp ప్రీమియం అనేది 'WhatsApp బిజినెస్' యాప్‌లోని ఎంచుకున్న బీటా వినియోగదారుల కోసం అందుబాటులో ఉన్న ఐచ్ఛిక సబ్స్క్రిప్షన్ ప్లాన్. అంతేకానీ అందరికీ ఇంకా అందుబాటులోకి రాలేదు.
Claim : WhatsApp will soon charge its users for using premium features
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : Misleading
Next Story