Mon Dec 23 2024 02:51:12 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ 165 సీట్లలో గెలవడానికి ఎంఐఎం పార్టీ సహాయం చేసిందా..?
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల గురించి దేశం మొత్తం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసింది. యూపీలోని 403 స్థానాలకు గాను బీజేపీ 255 స్థానాలు గెలుచుకోగా, సమాజ్‌వాదీ పార్టీ 111 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. సోషల్ మీడియా వినియోగదారులు BJP గెలుపు విషయంలో పలు కారణాలను చెబుతూ వస్తున్నారు.
క్లెయిమ్: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ 165 సీట్లలో గెలవడానికి ఎంఐఎం పార్టీ సహాయం చేసిందా
ఫ్యాక్ట్: వైరల్ పోస్టుల్లో ఎటువంటి నిజం లేదు
ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాల గురించి దేశం మొత్తం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసింది. యూపీలోని 403 స్థానాలకు గాను బీజేపీ 255 స్థానాలు గెలుచుకోగా, సమాజ్‌వాదీ పార్టీ 111 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. సోషల్ మీడియా వినియోగదారులు BJP గెలుపు విషయంలో పలు కారణాలను చెబుతూ వస్తున్నారు. ముస్లింలు, దళితుల ఓట్లు చీలిపోవడంతో సమాజ్ వాదీ పార్టీ ఓడిపోయిందనే ప్రకటనలను కూడా కొందరు చేశారు. అసదుద్దీన్ ఒవైసీకి చెందిన AIMIM పార్టీ BJP "B" టీమ్‌గా పనిచేస్తోందనే విమర్శలు కూడా వచ్చాయి.
ఇదే నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఇటీవల జరిగిన యూపీ ఎన్నికల్లో బీజేపీ 2,000 ఓట్ల కంటే తక్కువ ఓట్ల తేడాతో 165 సీట్లు గెలుచుకుందని ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తం 165 స్థానాల్లో ఎస్పి-ఆర్ఎల్డి ఓట్లను ఎఐఎంఐఎం పార్టీ కోత పెట్టిందని, ఇది చివరకు బీజేపీ ఎన్నికల్లో విజయం సాధించడానికి దోహదపడిందని కూడా చెబుతున్నారు.
కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ సింగ్ ఈ పోస్ట్‌ను షేర్ చేశారు. "Interesting facts. MIM and BJP are doing exactly what Britishers scripted by promoting Hindu Mahasabha RSS Savarkar on one side and Jinnah Muslim League on the other side. Religious Fanaticism Globally is a curse to Humanity". అంటూ పోస్టు పెట్టారు.
"ఉత్తరప్రదేశ్ లో 82 అసెంబ్లీ స్థానాల్లో 500 (ఐదు వందల) ఓట్లతో లోపు, 81 అసెంబ్లీ స్థానాల్లో 1000 లోపు ఓట్లతో ఓడిపోయన సమాజ్ వాది పార్టీ !! 100 నియోజకవర్గాల్లో పోటీ 22.3 లక్షల ఓట్లు అంటే సగటున ఒక్కో నియోజకవర్గానికి 20 వేల ఓట్లు చీల్చిన ఒవైసీ.. బీజేపీకి 100 సీట్లు వచ్చేలా బాటలు వేశారని. ఎలెక్షన్స్ ముందు బూర్ఖ గొడవ చేశారు. ఎవరు చేపించారో ఇప్పటికైనా మీకు తెలిసిందా. ఇవ్వన్నీ బీజేపీ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే. రాబోయే రోజుల్లో ముస్లిమ్స్, బీజేపీ ఎలక్షన్స్ ట్రాప్ లో పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ముస్లింలు ఆలోచించాలి" అంటూ ఇంకొందరు పోస్టులు పెట్టారు.
ఒక ఫేస్బుక్ వినియోగదారు ఈ పోస్ట్‌ను పంచుకున్నారు,
"బీజేపీ గెలిచింది
200 ఓట్ల తేడాతో 7 సీట్లు.
500 ఓట్ల తేడాతో 23 సీట్లు
1000 ఓట్ల తేడాతో 49 సీట్లు
2000 ఓట్ల తేడాతో 21 సీట్లు.
పైన పేర్కొన్న అన్నింటిలో, ఒవైసీ బీజేపీకి బాగా సహాయం చేసారు. భారతరత్న అవార్డుకు అర్హుడే! "
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టులు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయి.మా బృందం వైరల్ పోస్టు తప్పు అని గుర్తించింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, కేవలం 29 స్థానాల్లో మాత్రమే అభ్యర్థులు 2,000 కంటే తక్కువ ఓట్ల తేడాతో గెలుపొందారు.
ప్రాథమిక విచారణలో, మేము UP ఎన్నికలలో AIMIM అభ్యర్థుల సంఖ్యను తెలుసుకోవడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా(ECI) వెబ్సైట్లో శోధించాము. మొత్తం 403 స్థానాలకు గాను AIMIM 96 స్థానాల్లో పోటీ చేసిందని మేము గుర్తించాము. 165 సీట్లలో బీజేపీకి ఎంఐఎం సహాయం చేసిందన్న వాదన అబద్ధమని స్పష్టంగా అర్థమవుతోంది.
2000 కంటే తక్కువ ఓట్ల తేడాతో బీజేపీ 165 సీట్లు గెలుచుకుందా?
మేము ECI వెబ్సైట్లో అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించాము. ఏ పార్టీ కూడా 200 ఓట్ల లోపు తేడాతో గెలిచిన సీటు లేదని గుర్తించాం. బిజ్నోర్ జిల్లాలోని ధామ్‌పూర్ విధానసభ నియోజకవర్గంలో అభ్యర్థి 203 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇదే ఆ రాష్ట్ర ఎన్నికల్లో అత్యల్ప తేడా. ఈ నియోజక వర్గంలో సమాజ్ వాదీ పార్టీకి చెందిన నయీమ్ ఉల్ హసన్ 203 ఓట్ల తేడాతో బీజేపీకి చెందిన అశోక్ రాణా చేతిలో ఓడిపోయారు.
మేము పోస్ట్‌లో చేసిన ఇతర వైరల్ పోస్టుల కోసం శోధించాము. మా పరిశోధనలో 2000 ఓట్ల కంటే తక్కువ తేడా ఉన్నవి 29 సీట్లు మాత్రమేనని మేము కనుగొన్నాము. ఈ 29 స్థానాల్లో 11 స్థానాల్లో గెలుపుకు 500 కంటే తక్కువ ఉంది. ఇందులో సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీ ఆ స్థానాలను గెలుచుకున్నాయి. 500 కంటే తక్కువ ఓట్ల తేడాతో బీజేపీ 23 సీట్లు గెలుచుకుందన్న రెండో వాదన కూడా తప్పే.
1000 ఓట్ల తేడాతో బీజేపీ 49 సీట్లు, 2000 ఓట్ల తేడాతో 21 సీట్లు గెలుచుకోవడం మూడో, నాలుగో వాదన. ఒక పార్టీ (బీజేపీ మరియు ఎస్పీతో సహా) 1,000 కంటే తక్కువ ఓట్ల తేడాతో గెలిచిన నాలుగు స్థానాలను మాత్రమే మేము కనుగొన్నాము, 2000 కంటే తక్కువ ఓట్ల తేడా కేవలం 29 స్థానాల్లో మాత్రమే ఉందని పరిశీలించాం.
అసదుద్దీన్ ఒవైసీ ఏఐఎంఐఎం పార్టీ యూపీ ఎన్నికల్లో బీజేపీ 165 సీట్లు గెలుచుకోవడానికి సహాయం చేసిందన్నది అబద్ధమని తేలింది. AIMIM పార్టీ 96 స్థానాల్లో మాత్రమే పోటీ చేసిందని మేము గుర్తించాము. 403 సీట్లలో 2000 కంటే తక్కువ ఓట్ల తేడాతో 29 సీట్లు మాత్రమే వచ్చాయి. కాబట్టి, వైరల్ క్లెయిమ్ లో ఎటువంటి నిజం లేదు.
క్లెయిమ్: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ 165 సీట్లలో గెలవడానికి ఎంఐఎం పార్టీ సహాయం చేసిందా
క్లెయిమ్ చేసింది ఎవరు: సోషల్ మీడియా యూజర్లు
ఫ్యాక్ట్: వైరల్ పోస్టుల ద్వారా చెబుతున్నది అబద్ధం
Claim : In the UP election, BJP won 165 seats with a vote margin of fewer than 2,000 votes. In all these seats, AIMIM contested elections that cut SP's votes share, ultimately helping BJP win the elections.
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story