Mon Dec 23 2024 06:31:23 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 'జై చంద్రబాబు' అంటూ నినాదాలు చేయలేదు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుచుకుంది. టీడీపీ కార్యకర్తల సంబరాలు మిన్నంటాయి. ఎన్డీఏ కూటమిలోని టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 చోట్ల విజయం సాధించాయి. వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది.
Claim :
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2018లో బహిరంగ సభలో ‘జై చంద్ర బాబు’ అంటూ నినాదాలు చేస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.Fact :
2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ‘జై చంద్ర బాబు' అంటూ వ్యంగ్యంగా నినాదాలు చేసిన వీడియో వైరల్గా మారింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుచుకుంది. టీడీపీ కార్యకర్తల సంబరాలు మిన్నంటాయి. ఎన్డీఏ కూటమిలోని టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 చోట్ల విజయం సాధించాయి. వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. 175 సీట్లకు గాను టీడీపీ కూటమి ఏకంగా 164 సీట్లతో అధికారాన్ని కైవసం చేసుకుంది.
తెలుగుదేశం పార్టీ గెలుపు 'జై చంద్ర బాబు' అంటూ జగన్మోహన్ రెడ్డి నినాదాలు చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. 2018లో జరిగిన ప్రజా సంకల్ప యాత్రలో బహిరంగ సభలో జై చంద్రబాబు అంటూ వ్యంగ్యంగా నినాదాలు చేసిన వీడియో ఇది.
వీడియో నుండి ఎక్స్ట్రాక్ట్ చేసిన కీఫ్రేమ్లను మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ని ఉపయోగించి సెర్చ్ చేశాము. ఎక్కువ నిడివి ఉన్న వీడియోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూట్యూబ్ ఛానెల్ లో చూశాము. పబ్లిక్ మీటింగ్లో వైఎస్ జగన్ “జై చంద్రబాబు జై చంద్రబాబు” అంటున్న వీడియోను మేము కనుగొన్నాము. ఈ వీడియో డిసెంబర్ 30, 2018న అప్లోడ్ చేశారు.
Tupaki.com ప్రకారం, శ్రీకాకుళం జిల్లా పలాసలో ప్రజా సంకల్ప యాత్రలో ప్రసంగిస్తూ.. 'చంద్రబాబు నాయుడు యువ నేస్తాన్ని మోసం చేసాడు. హౌసింగ్ స్కీమ్ కోసం రూ.5 లక్షలు పునాదికి మాత్రమే ఇచ్చాడు. నిర్మాణ పనులు ప్రాధాన్యత ప్రాతిపదికన జరుగుతాయి. ఇళ్ల నిర్మాణానికి ముందే స్టిక్కర్లు అంటిస్తాం కాబట్టి జై చంద్రబాబు నినాదాలు చేయాలి. రైతు రుణమాఫీ అమలు కాకముందే రైతులు ఆనందంతో ఉప్పొంగాలి. డ్వాక్రా మహిళలను కూడా దూషించాడు. ఇలాంటి వాటికైనా ప్రజలు జై చంద్రబాబు... జై చంద్రబాబు అని నినదించాలి.' అంటూ కథనాన్ని మేము చూశాం.
వైరల్ అయిన వీడియోలో జగన్ మోహన్ రెడ్డి బహిరంగ సభ లో 'జై చంద్ర బాబు' అంటూ నినాదాలు చేయ లేదు. డిసెంబర్ 2018లో శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన ప్రజా సంకల్ప యాత్రలో చంద్రబాబు నాయుడుపై వ్యంగ్యంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఈ వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది.
Claim : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2018లో బహిరంగ సభలో ‘జై చంద్ర బాబు’ అంటూ నినాదాలు చేస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : Misleading
Next Story