Mon Dec 23 2024 16:32:50 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: కరీనా కపూర్ మూడో సారి గర్భవతి అవ్వలేదు
Kareena Kapoor Khan is a Bollywood actress who appeared in more than 60 Hindi films. She made her acting debut in the year 2000. She is known to have played a variety of characters across a range of film genres. She married another Bollywood actor Saif Ali Khan.
Claim :
బాలీవుడ్ నటి కరీనా కపూర్ మూడవసారి గర్భవతి అయిందిFact :
వైరల్ అవుతున్న ఫోటోలు పాతవి.. కరీనా కపూర్ మూడవసారి గర్భవతి అవ్వలేదు
కరీనా కపూర్ ఖాన్ 60కి పైగా హిందీ చిత్రాలలో నటించిన బాలీవుడ్ నటి. ఆమె 2000 సంవత్సరంలో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆమె అనేక రకాల సినిమాలలో విభిన్నమైన పాత్రలను పోషించింది. ఆమె బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌ను పెళ్లాడింది. వారి కుమారుల పేర్లు తైమూర్ అలీ ఖాన్, జహంగీర్ అలీ ఖాన్. తమ పిల్లలకు పెట్టిన పేర్లకు కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ లను విపరీతంగా ట్రోల్ చేశారు.
ఇంతలో, కరీనా కపూర్ బేబీ బంప్‌తో పోజులిచ్చిన కొన్ని చిత్రాలు వైరల్ అవుతున్నాయి. కరీనా కపూర్ గర్భవతి అని ఛంగిజ్ ఖాన్ రాబోతున్నాడేమో అనే ప్రచారం చేస్తున్నారు. కరీనా కపూర్ తన మూడవ బిడ్డకు జన్మనివ్వబోతోందంటూ ప్రచారం చేస్తున్నారు.
ఈ చిత్రాలను షేర్ చేస్తూ.. “ఛంగిజ్ ఖాన్ ఆనే వాలా హే మిత్రో” అనే శీర్షికతో పోస్టులను వైరల్ చేస్తున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ చిత్రాలు ఇటీవలివి కావు.. 2020 సంవత్సరానికి చెందినవి.
మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి సెర్చ్ చేయగా.. ఆ చిత్రాలు డిసెంబర్ 2020లో వివిధ వెబ్సైట్లలో అప్లోడ్ చేసినట్లు మేము కనుగొన్నాము.
india.comలో ప్రచురించబడిన ఒక కథనం ప్రకారం, బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ గర్భంతో ఉన్నా కూడా సరికొత్త ట్రెండ్ ను సృష్టిస్తూ ఉంది. ఆమె తన తాజా ఫోటో షూట్లో, హై-నెక్ బ్లూ బాడీ హగ్గింగ్ డ్రెస్ ధరించింది. బేబీ బంప్‌తో ఉన్న ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె తన బేబీ బంప్ తో ఫోటో గ్రాఫర్లకు ఫోజులు ఇచ్చింది.
డిసెంబర్ 23, 2020న ప్రచురించిన మరో కథనం ప్రకారం, కరీనా కపూర్ ఖాన్ ఇటీవల అందమైన బాడీకాన్ టీల్ బ్లూ డ్రెస్‌ని ధరించారని.. పార్టీలో గర్భిణీ స్త్రీలు ధరించవచ్చని పేర్కొంది. వచ్చే ఏడాది సైఫ్ అలీ ఖాన్‌తో తన రెండవ బిడ్డను స్వాగతించడానికి నటి సిద్ధంగా ఉందని కూడా పేర్కొంది. గత కొన్ని నెలలుగా, కరీనా అద్భుతమైన మెటర్నిటీ వేర్ లను చూపిస్తూ ఉంది.
బాలీవుడ్ నటి కరీనా కపూర్ పాత చిత్రాలు మరో సారి వైరల్ అవుతూ ఉన్నాయి. ఆమె మూడవ బిడ్డకు ఛంగిజ్ ఖాన్ అని పేరు పెట్టబోతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : The images show Kareena Kapoor pregnant with a third child and they are recent
Claimed By : Facebook Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Facebook
Fact Check : False
Next Story