Thu Dec 19 2024 09:13:02 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: PUC పరీక్షకు సెంటర్ల ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు కర్ణాటక SSLC పరీక్షను మార్చి 1 న మధ్యాహ్నం షెడ్యూల్ చేశారు. మైనారిటీలను సంతృప్తి పరచడానికి కాదు.
కర్ణాటకలో త్వరలో జరగనున్న 10వ తరగతి సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ (SSLC) పరీక్షలు నమాజ్ సమయాలకు అనుగుణంగా
Claim :
కర్ణాటకలో త్వరలో జరగనున్న 10వ తరగతి సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ (SSLC) పరీక్షలు నమాజ్ సమయాలకు అనుగుణంగా శుక్రవారం రోజున షెడ్యూల్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలను ప్రసన్నం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఇలా చేసింది.Fact :
ఎస్ఎస్ఎల్సి పరీక్షను మార్చి 1వ తేదీ శుక్రవారం నాడు ఉదయం 10.15 గంటలకు నిర్వహించడం లేదు. అదే రోజు ఉదయం పియుసి పరీక్ష జరగాల్సి ఉన్న కారణంగానే ఎస్ఎస్ఎల్సి పరీక్షను మధ్యాహ్నానికి మార్చారు.
కర్ణాటకలో త్వరలో జరగనున్న 10వ తరగతి సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ (SSLC) పరీక్షలు నమాజ్ సమయాలకు అనుగుణంగా శుక్రవారం నాడున మధ్యాహ్నంకు షెడ్యూల్ చేశారని.. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీలని ప్రసన్నం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఇలా టైమ్ టేబుల్ ను మార్చిందంటూ.. సోషల్ మీడియాలో పోస్టులను వైరల్ చేశారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
మీడియా నివేదికల ప్రకారం.. కర్ణాటక స్కూల్ ఎగ్జామినేషన్ అండ్ అసెస్మెంట్ (KSEAB) బోర్డ్.. ఫిబ్రవరి 2న కర్ణాటక సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ ప్రిపరేటరీ ఎగ్జామ్ 2024 టైమ్టేబుల్ను విడుదల చేసింది. పరీక్షలు ఫిబ్రవరి 26 నుండి మార్చి 2 వరకు ఉదయం, సాయంత్రం రెండు షిఫ్ట్లలో నిర్వహించనున్నారు. ఉదయం సెషన్లలో పరీక్షలను.. ఉదయం 10.15 నుండి మధ్యాహ్నం 1.15 వరకు.. సాయంత్రం సెషన్ లో పరీక్షను మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5.15 వరకు నిర్వహించనున్నారు.
అధికారిక KSEAB వెబ్సైట్ను తనిఖీ చేసాం. SSLC సైన్స్ సబ్జెక్ట్ ప్రిపరేటరీ ఎగ్జామినేషన్.. మార్చి 1, 2024న అదే రోజు PUC పరీక్ష-1 ఉండడంతో మధ్యాహ్నం షెడ్యూల్ చేశారని ఒక సూచనను మేము గమనించాం.
అదే రోజు పీయూసీ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాల కొరత.. విద్యార్థుల మధ్య గందరగోళం తలెత్తకుండా ఉండేందుకే మార్చి 1న ఎస్ఎస్ఎల్సీ పరీక్ష మధ్యాహ్నం నిర్వహించాల్సి వచ్చిందని కర్ణాటక కాంగ్రెస్ స్పష్టం చేసింది.
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. మార్చి 1వ తేదీ శుక్రవారం నాడు ఎస్ఎస్ఎల్సి పరీక్ష జరిగే రోజే.. పియుసి పరీక్ష కూడా ఉండడంతో ఇతర పరీక్షల మాదిరిగా కాకుండా మధ్యాహ్నం పరీక్షను నిర్వహించనున్నారు.
Claim : A timetable circulating on social media claims that the upcoming Class 10 Secondary School Leaving Certificate (SSLC) exams in Karnataka are scheduled differently on a Friday to accommodate namaz timings, accusing the state government of minority appeasement.
Claimed By : X User
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media User
Fact Check : False
Next Story