పంజాబ్ సిఎం భగవంత్ మాన్ కి తెలంగాణ సిఎం కెసిఆర్ లికర్ బాటిల్ గిఫ్ట్ గా ఇచ్చారా?
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫోటో ఒకటి వాట్సాప్ లాంటి సోషల్ నెట్వర్క్ లో బాగా షేర్ అవుతోంది. ఆ ఫోటోలో చంద్రశేఖర రావు పంజాబ్ సీఎంకు ఒక లికర్ బాటిల్ ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది.
క్లెయిమ్: పంజాబ్ సిఎం భగవంత్ మాన్ కి తెలంగాణ సిఎం కెసిఆర్ లికర్ బాటిల్ గిఫ్ట్ గా ఇచ్చారు
నిజం: లేదు. ఆ ఫోటో అబద్ధం.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫోటో ఒకటి వాట్సాప్ లాంటి సోషల్ నెట్వర్క్ లో బాగా షేర్ అవుతోంది. ఆ ఫోటోలో చంద్రశేఖర రావు పంజాబ్ సీఎంకు ఒక లికర్ బాటిల్ ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. దీనిని షేర్ చేస్తున్న వ్యక్తులు 'పంజాబ్ పోయింది ఇందుకా!' అని ప్రశ్నిస్తున్నారు.
ఫాక్ట్ చెక్:
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ జాతీయస్థాయిలో యాత్ర చేస్తున్నారు. వారంపాటు సాగే ఈ యాత్రలో ఆయన ప్రముఖ రాజకీయపార్టీల నాయకులను కలుస్తున్నారు. ప్రస్తుతం షేర్ అవుతున్న ఫోటో.. ఢిల్లీ ముఖ్యమంత్రి ఏకే కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ లను పంజాబ్ సిఎం నివాసంలో కెసిఆర్ కలిసిన సందర్భంలోనిది. అప్పుడు తీసిన ఫోటోలలో ఒకదానిని తమకు అనుకూలంగా కొందరు ఫోటోషాప్, పెయింట్ లాంటి సాఫ్ట్ వేర్ వాడి మార్ఫింగ్ చేశారు.
ఆ ఫోటో సోషల్ మీడియా కంటే సోషల్ నెట్ వర్క్ లో ఎక్కువ షేర్ అవటం వల్లనూ, ఒరిజినల్ ఫోటో తక్కువమంది ఉపయోగించుకోవటం వల్లనూ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఈ ఫాక్ట్ చెకింగ్ లో ఉపయోగపడలేదు. జర్నలిజం బేసిక్స్ లో ఒక లక్షణం.. సోర్సులను పరిశీలించటం.. ఆధారంగా ప్రయత్నించగా అసలు ఫోటో వెంటనే లభించింది. ఆ ఒరిజినల్ ఫోటో ఫేస్ బుక్ లోని కెసిఆర్ అధికారిక ఖాతాలో షేర్ చేయబడింది.
కెసిఆర్ భగవంత్ మాన్ కు చార్మినార్ నమూనాను బహూకరిస్తున్న ఫోటోను.. ఎవరో లికర్ బాటిల్ ఇస్తున్నట్లుగా మార్ఫింగ్ చేశారని తెలుస్తుంది.
క్లెయిమ్: పంజాబ్ సిఎం భగవంత్ మాన్ కి తెలంగాణ సిఎం కెసిఆర్ లికర్ బాటిల్ గిఫ్ట్ గా ఇచ్చారు
క్లెయిమ్ చేసింది: సోషల్ నెట్ వర్క్ యూజర్స్
నిజం: లేదు. కెసిఆర్ భగవంత్ మాన్ కి చార్మినార్ నమూనాను బహూకరించారు. అ ఫోటోను కావాలని మార్ఫింగ్ చేశారు.