Thu Dec 26 2024 03:05:13 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: నిమ్మకాయలు క్యాన్సర్ ను కూడా నయం చేయగలవా.. కీమో థెరపీ అవసరం లేకుండా చేయగలవా..?
వివిధ రకాల క్యాన్సర్లను నయం చేయడంలోనూ, శరీరంలోని క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో కీమోథెరపీ కంటే నిమ్మకాయ తొక్కలు, ఫ్రీజ్ చేసిన నిమ్మకాయలు మంచివని సోషల్ మీడియాలో ఒక సందేశం వైరల్ అవుతోంది.

నిమ్మకాయ తొక్కలలో ఉండే ఫ్లేవనాయిడ్స్, న్యూట్రియెంట్స్ లో యాంటీ-క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉంటాయని, అవి క్యాన్సర్ సెల్స్ ను చంపేసి.. క్యాన్సర్ నుండి విముక్తుల్ని చేస్తాయంటూ పోస్టులను వైరల్ చేస్తూ ఉన్నారు.
నిమ్మకాయల తొక్కలకు సంబంధించిన ఔషధ గుణాలను ప్రముఖ ఫార్మా కంపెనీలు చెప్పడం లేవని.. ఈ విషయాలు బయటకు వస్తే ఫార్మా కంపెనీలకు చాలా నష్టం చేకూరుతుందని ఆ వైరల్ మెసేజీలో ఉంది. కీమో థెరపీ కూడా లేకుండా క్యాన్సర్ ను క్యూర్ చేయగలదని వైరల్ మెసేజీలో ఉంది. నిమ్మకాయల్లో క్యాన్సర్ సెల్స్ ను చంపే గుణం కీమో థెరపీ కంటే 10000 రెట్లు ఎక్కువగా ఉంటుందని ఆ మెసేజీలో ఉంది. ఔషధ తయారీదారులు, ఫార్మాస్యూటికల్ కంపెనీలు తమ సొంత సింథటిక్ వెర్షన్లను అధిక ధరలకు విక్రయిస్తూ ఉండడంతో.. నిమ్మ తొక్కల ప్రయోజనాల గురించి సమాచారాన్ని ఎప్పటికీ పంచుకోరని కూడా సందేశంలో ఉంది.
ఈ మెసేజీ వాట్సాప్, సోషల్ మీడియాలో కొన్ని నెలలుగా వైరల్ అవుతూ ఉంది.

ఫ్యాక్ట్ చెకింగ్:
ఈ వైరల్ పోస్టును పలువురు ఆంకాలజిస్టులు తప్పుబడుతూ ఉన్నారు. ఈ వైరల్ మెసేజీలో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేశారు. క్యాన్సర్ చికిత్సకు నిమ్మకాయ మాత్రమే సరిపోదని, సోషల్ మీడియాలో వస్తున్న సందేశంలో నిజం లేదని ఆంకాలజిస్టులు స్పష్టం చేశారు.
కీమోథెరపీ కంటే నిమ్మకాయ క్యాన్సర్ను బాగా నయం చేస్తుందని వైరల్ సందేశం పేర్కొంది. నిమ్మకాయలు క్యాన్సర్ను నయం చేయగలవని తగినంత అధ్యయనాలు లేవు. కొన్ని శాస్త్రీయ అధ్యయనాలు నిమ్మకాయలు, ఇతర సిట్రస్ పండ్లలో ఉండే ఫ్లేవనాయిడ్స్ వంటి పోషకాలు యాంటీ-కార్సినోజెనిక్ లక్షణాలు కలిగి ఉంటాయని తేలింది.
చైనాలోని టియాంజిన్ యూనివర్సిటీకి చెందిన బయోటెక్నాలజిస్టుల 2014 అధ్యయనం క్యాన్సర్ చికిత్సలో ఈ ఫ్లేవనాయిడ్ల పాత్రను అర్థం చేసుకునే దిశలో ప్రయోగాలను చేశారు. మానవ కొలొరెక్టల్ కణాలు, ఎండోథెలియల్ కణాలు.. రొమ్ము క్యాన్సర్ కణాలపై ఫ్లేవనాయిడ్ల చర్యలపై అధ్యయనాలను హైలైట్ చేసింది. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడానికి ఈ చికిత్స నిజంగా పనిచేస్తుందో లేదో నిర్ధారించడానికి తదుపరి పరిశోధన అవసరమని రీసెర్చర్లు తెలిపారు. ఫ్లేవనాయిడ్లను ఉపయోగించే ఈ చికిత్సలు క్యాన్సర్తో బాధపడుతున్న వ్యక్తులపై ఇంకా ప్రయోగించలేదని కూడా తెలిపారు.
కీమోథెరపీ కంటే నిమ్మకాయలను ఉపయోగించడం మంచిదని వైరల్ మెసేజీ పేర్కొంది. కెమోథెరపీ, అత్యంత విస్తృతంగా ఉపయోగించే క్యాన్సర్ చికిత్సలలో ఒకటి. దీని గురించిన సంపూర్ణ విశ్లేషణ ఇంటర్నెట్ లో లభిస్తుంది. కీమోథెరపీని ఎంచుకున్న వారు బతికిన సందర్భాలు ఎక్కువగానే ఉంటాయని కనుగొన్నారు.
కాబట్టి, వైరల్ మెసేజీలో చెబుతున్న వాటిలో నిజం లేదు.

Claim : Lemon peels are better than chemotherapy at killing cancer cells
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story