ఫ్యాక్ట్ చెక్: పెడోఫిలిక్ వీడియోలను చూస్తున్న వ్యక్తులకు హెచ్చరిక అంటూ చెలామణిలో ఉన్న లేఖ నకిలీది
సైబర్ సెల్ ఇండియా, ఇంటెలిజెన్స్ బ్యూరో మొదలైన వాటి లోగోలు ఉన్న ఒక లేఖ సోషల్ మీడియాలో సర్క్యులేషన్లో ఉంది, చాలా మంది వినియోగదారులు ఆ లేఖ నిజమైనదా కాదా అని అడుగుతున్నారు. సీబీఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో లేదా మరేదైనా ప్రభుత్వ సంస్థ అలాంటి లేఖను జారీ చేసిందా అని తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు.
Claim :
పెడోఫిలిక్ వీడియోలను చూస్తున్న వ్యక్తులకు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, సీబీఐ ఆన్లైన్లో లేఖలు పంపుతున్నాయి.Fact :
సర్క్యులేషన్లో ఉన్న లేఖ నకిలీది, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఏ సంస్థ కూడా అలాంటి లేఖను జారీ చేయలేదు
సైబర్ సెల్ ఇండియా, ఇంటెలిజెన్స్ బ్యూరో మొదలైన వాటి లోగోలు ఉన్న ఒక లేఖ సోషల్ మీడియాలో సర్క్యులేషన్లో ఉంది, చాలా మంది వినియోగదారులు ఆ లేఖ నిజమైనదా కాదా అని అడుగుతున్నారు. సీబీఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో లేదా మరేదైనా ప్రభుత్వ సంస్థ అలాంటి లేఖను జారీ చేసిందా అని తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు. లేఖ జారీ చేసిన వ్యక్తి IP చిరునామాను సైబర్ క్రైమ్ అధికారులు చూస్తున్నారని లేఖ పేర్కొంది. పిల్లల అశ్లీల, పెడోఫిలిక్ వీడియోలను డౌన్లోడ్ చేయడం, చూడటం వంటి పనులు చేస్తున్న వ్యక్తుల IP అడ్రెస్ క్యాప్చర్ చేశారని ఆ లేఖలో ఉంది. 24 గంటలలోపు లేఖకు తక్షణమే ప్రతిస్పందించాలని.. అలా స్పందించడంలో విఫలమైతే, స్థానిక పోలీస్ స్టేషన్లో అరెస్ట్ వారెంట్‌ను జారీ చేస్తారు. ఈ లేఖపై ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ దేకా, శ్రీ ప్రశాంత్ గౌతమ్ పోలీస్/చీఫ్ ఆఫ్ పోలీస్ సంతకం చేసినట్లు ఉంది.