ఫ్యాక్ట్ చెక్: విమానంద్వారా కెమికల్స్ ను విడుదల చేయలేదని లుఫ్తాన్సా పైలట్ ని ఉద్యోగం నుండి తొలగించలేదు
ఆకాశంలో విమానాలు వెళుతున్నప్పుడు, వాటి వెనుక తెలుపు రంగు pogalu viDudala avvaDam చాలా మందే గమనించి ఉంటారు. ఎగ్జాస్ట్‌లో
Claim :
కెంట్రెయిల్ స్ప్రేని యాక్టివేట్ చేయడానికి నిరాకరించిన లుఫ్తాన్సా పైలట్ ను ఉద్యోగం నుండి తొలగించారుFact :
వీడియోను వ్యంగ్యం కోసం సృష్టించారు. ఇటీవల అలాంటి సంఘటన ఏదీ జరుగలేదు
ఆకాశంలో విమానాలు వెళుతున్నప్పుడు, వాటి వెనుక తెలుపు రంగు పొగలు విడుదల అవ్వడం చాలా మందే గమనించి ఉంటారు. ఎగ్జాస్ట్లోని నీటి ఆవిరి మంచు స్ఫటికాలుగా ఘనీభవించినప్పుడు జెట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ల వెనుక గీతాల్లాంటివి ఏర్పడుతూ ఉంటాయి. ఇవి మేఘాల తరహాలో ఉంటాయి, వీటిని కాంట్రెయిల్స్ అంటారు. విమానం వేగంగా వెళ్తున్న సయమంలో విమానం ఇంధనం నుంచి వేడి వస్తుంది. అన్ని వేల అడుగుల పైన ఉష్ణోగ్రత చల్లగా ఉంటుంది. ఫలితంగా చుట్టుపక్కల ఉండే చల్లని గాలి అక్కడి వేడి గాలితో కలిసి గడ్డకడుతుంది. అప్పుడే విమానం వెనుక తెల్లని చారలు కనిపిస్తాయి. ఉష్ణోగ్రతలు మారాక ఆ చారలు అదృశ్యమవుతాయి. వాతావరణంలో నీటి పరిమాణం ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా చారలు ఉంటాయి.
ఫ్యాక్ట్ చెకింగ్:
గూగుల్‌లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ఆ వీడియోను 'డెర్ పోస్టిలో' అనే యూట్యూబ్ ఛానెల్ మొదట ప్రచురించిందని తెలుస్తోంది. ‘Pilot weigerte sich, Chemtrails zu versprühen: Kündigung!’, తెలుగు లో 'పైలట్ కెంట్రెయిల్ స్ప్రే ను చేయడానికి నిరాకరించాడు: ఉద్యోగం కోల్పోయాడు!' అనే టైటిల్ తో వీడియోను వారు పోస్టు చేశారు.
డెర్ ఫొస్తిల్లొన్ యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేసిన ఇతర వీడియోలను తనిఖీ చేసినప్పుడు, పైలట్‌గా నటించిన అదే వ్యక్తి ఇతర వీడియోలలో ఇతర పాత్రలను పోషిస్తున్నట్లు తెలుసుకున్నాము, దీన్ని బట్టి అతడు నటుడని స్పష్టం అయ్యింది.