Sun Dec 22 2024 15:21:05 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: అయోధ్యలో మెగా బ్రదర్స్, రామ్ చరణ్ కలిసి సెల్ఫీ తీసుకోలేదు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జనవరి 22, 2024న అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయంలో రామ్ లల్లా విగ్రహాన్ని ఆవిష్కరించారు. బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, విక్కీ కౌశల్, ఆయుష్మాన్ ఖురానా, కంగనా రనౌత్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తదితరులు ఈ వేడుకలకు హాజరయ్యారు.
Claim :
అయోధ్యలో నిర్వహించిన ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, చిరంజీవి, రామ్ చరణ్ కలిసి సెల్ఫీ దిగారు.Fact :
వైరల్ అవుతున్న ఫోటోను మార్ఫింగ్ చేశారు. ఒక సెల్ఫీలా కనిపించేలా రెండు వేర్వేరు చిత్రాలను కలిపారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జనవరి 22, 2024న అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయంలో రామ్ లల్లా విగ్రహాన్ని ఆవిష్కరించారు. బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, విక్కీ కౌశల్, ఆయుష్మాన్ ఖురానా, కంగనా రనౌత్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తదితరులు ఈ వేడుకలకు హాజరయ్యారు. క్రికెట్, సినిమా, రాజకీయాలు, కళలు వంటి పలు రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు ఈ వేడుకకు హాజరవ్వడానికి ఆహ్వానాలు అందుకున్నారు. ఈ వేడుకకు చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ వంటి తెలుగు స్టార్స్ కూడా హాజరయ్యారు.
పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, చిరంజీవి కలిసి రామమందిరం ముందు ఒక సెల్ఫీ తీసుకున్నారంటూ ఫోటో వైరల్ అవుతూ ఉంది. ‘#MeGa’ అనే హ్యాష్ ట్యాగ్ తో ఫోటోను వైరల్ చేస్తూ ఉన్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ చిత్రాన్ని ఎడిట్ చేశారు. రామ్ చరణ్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ కలిసి సెల్ఫీ తీసుకుంటున్నట్లు ఎక్కడా చూపలేదు.
Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా “Pawan Kalyan : అయోధ్య రామ మందిరంతో పవన్ కళ్యాణ్ సెల్ఫీ.. రామకార్యం అంటే ప్రజా కార్యం..” అనే టైటిల్‌తో 10tv ప్రచురించిన చిత్రం మాకు కనిపించింది
పవన్ కళ్యాణ్ తన సోషల్ మీడియా ఖాతాలలో “రామకార్యం అంటే రాజ్య కార్యం ప్రజా కార్యం... జై శ్రీ రామ్” అంటూ పోస్టు పెట్టారు. అందులో పవన్ కళ్యాణ్ మాత్రమే ఫోటో తీసుకున్నారు.
అయోధ్యలో చిరంజీవి, రామ్ చరణ్ చిత్రాల కోసం సెర్చ్ చేసినప్పుడు.. మాకు టూలీవుడ్.నెట్లో ‘అయోధ్యలో చిరంజీవి, రామ్ చరణ్’ అనే శీర్షికతో ఒక కథనం కనిపించింది. అందులో చిరంజీవి, రామ్ చరణ్ లకు సంబంధించిన చిత్రాలను మనం గమనించవచ్చు.
goldandhra.com అనే వెబ్ సైట్ లో కూడా పలు ఫోటోలు మనం చూడొచ్చు.
ఈ చిత్రాలను వైరల్ ఇమేజ్‌తో పోల్చినప్పుడు, రెండు వేర్వేరు చిత్రాలను.. ఒకటిగా కనిపించేలా ఎడిట్ చేశారని మనం గుర్తించవచ్చు. రెండు చిత్రాల మధ్య పోలికలు, తేడాలను మీరు గమనించవచ్చు.
కాబట్టి, వైరల్ చిత్రాన్ని రెండు వేర్వేరు చిత్రాలను మెర్జ్ చేసి ఎడిట్ చేశారు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ వేడుకలో చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కలిసి సెల్ఫీని తీసుకోలేదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : Pawan Kalyan, Chiranjeevi and Ram Charan took a selfie together at the consecration ceremony in Ayodhya
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story