Fri Nov 22 2024 17:41:33 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఓ వీధిలో గిరిజన బాలికలను ఇబ్బందులు పెడుతున్న వ్యక్తులకు బీజేపీకి సంబంధం లేదు
18వ లోక్సభ ఎన్నికలకు మొదటి దశ ఓటింగ్ ఏప్రిల్ 19, 2024న మొదలైంది. 16.63% కంటే ఎక్కువ మంది ఓటర్లు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్ మొదలైన రాష్ట్రాల్లో తమ ఓటు వేశారు.
Claim :
మధ్యప్రదేశ్లోని ఓ వీధిలో బహిరంగంగా గిరిజన బాలికలపై బీజేపీ కార్యకర్తలు లైంగిక వేధింపులకు పాల్పడ్డారుFact :
ఈ ఘటన మార్చి 2022లో జరిగింది. నిందితులకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు
18వ లోక్సభ ఎన్నికలకు మొదటి దశ ఓటింగ్ ఏప్రిల్ 19, 2024న మొదలైంది. 16.63% కంటే ఎక్కువ మంది ఓటర్లు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్ మొదలైన రాష్ట్రాల్లో తమ ఓటు వేశారు. లోక్సభకు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫలితాలు జూన్ 4న ప్రకటించనున్నారు.
ఎన్నికలు జరుగుతున్న నేపధ్యంలో సోషల్ మీడియాలో పలు తప్పుడు కథనాలు వైరల్ అవుతున్నాయి. భారతీయ జనతా పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు మధ్యప్రదేశ్లో గిరిజన బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ కొన్ని విజువల్స్ వైరల్ అవుతూ ఉన్నాయి.
“బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం. నడి రోడ్డు మీద గిరిజన అమ్మాయిల పై బీజేపీ రౌడీల దౌర్జన్యం. మధ్యప్రదేశ్ లో బీజేపీ గుండాలు గిరిజన అమ్మాయిల మీద బహిరంగంగా లైంగిక వేధింపులకు గురి చేశారు. బీజేపీ రాక్షస రాజ్యంలో దళితులు, గిరిజనుల దీన పరిస్థితి ఇది. సిగులేని బతుకులు.” అంటూ పోస్టులు పెడుతున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. కొంతమంది వ్యక్తులు రోడ్డుపై గిరిజన బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన మార్చి 2022లో చోటు చేసుకుంది.
మేము ఈ చిత్రాన్ని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు.. ఈ సంఘటన 2022 సంవత్సరంలో జరిగిందని మేము కనుగొన్నాము. ఈ సంఘటనకు BJPతో సహా ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు.
ఇండియా టీవీ న్యూస్ ప్రకారం.. మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్ జిల్లాలో పట్టపగలు కొంతమంది పురుషులు ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడిన వీడియో ట్విట్టర్లో వైరల్ అయ్యింది. హోలీకి ముందు ఈ ప్రాంతంలో జరుపుకునే గిరిజన పండుగ భగోరియా సందర్భంగా ఈ వీడియోను చిత్రీకరించారు. క్లిప్లో ఒక మహిళ వాహనం వెనుక దాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా.. ఒక వ్యక్తి ఆమెపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఆమె అతని నుండి తప్పించుకుంటూ వెళ్లగా మరొక వ్యక్తి ఆమెపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత ఆమెను ఓ మగవాళ్ల గుంపు వేధించడం కనిపించింది. ఆమె సహాయం కోసం అరుస్తున్నప్పుడు వారంతా ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు.
ఈ వేధింపులకు సంబంధించిన వీడియోను NDTV.com కూడా షేర్ చేసింది.
మార్చి 2022లో Indiatimes.comలో ప్రచురించిన కథనం ప్రకారం ఈ వేధింపులకు.. ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదని పోలీసులు వివరణ ఇచ్చారు. పోలీసులు వేధింపులకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులపై సెక్షన్ 354, 345-A (లైంగిక వేధింపులు), సెక్షన్ 34 కింద కేసులు నమోదు చేశారు. వైరల్ అయిన వీడియో ప్రకారం చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు.
వైరల్ అవుతున్న విజువల్స్ ఇటీవలివి కాదు. బీజేపీకి అనుబంధంగా ఉన్న వ్యక్తులు గిరిజన మహిళపై దాడి చేసినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. ఈ ఘటన పాతది. నిందితులకు ఏ పార్టీతోనూ సంబంధాలు లేవు.
Claim : మధ్యప్రదేశ్లోని ఓ వీధిలో బహిరంగంగా గిరిజన బాలికలపై బీజేపీ కార్యకర్తలు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story