నిజ నిర్ధారణ: మూసి నదిలో మత్స్య కన్య కనిపడింది అంటూ షేర్ చేస్తున్న వీడియోలో నిజం లేదు, ఇది గ్రఫిక్స్ తో తయారుచేసారు
దేశంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు నగరాలు, రాష్ట్రాలు వరద నీటిలో మునిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురువడంతో నదులన్నీ పొంగిపొరలుతున్నాయి. ఇ
దేశంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు నగరాలు, రాష్ట్రాలు వరద నీటిలో మునిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురువడంతో నదులన్నీ పొంగిపొరలుతున్నాయి. ఇదిలావుండగా, తెలంగాణలోని నల్గొండ జిల్లా లోని దామరచర్లలో మత్స్యకన్య కనిపించిందంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది.
నిజ నిర్ధారణ:
తెలంగాణలోని నల్గొండ జిల్లా దామరచర్ల సమీపంలోని మూసీ నదిలో నిజమైన మత్స్యకన్య కనిపించిందన్న క్లెయిం అవాస్తవం. వైరల్ వీడియో JJPD ప్రొడక్షన్స్ వారు రూపొందించిన కంప్యూటర్ జెనరేటెడ్ వీడియో.
వీడియో నుండి సంగ్రహించబడిన కీఫ్రేమ్‌లను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి శోధించినప్పుడు, ఆ వీడియో జూలై 17, 2022న జెజెపిడి అనే యూట్యూబ్ ఛానెల్లో "" అనే శీర్షికతో ప్రచురించారని తెలుస్తోంది. అది తెలుగులోకి అనువదించినప్పుడు "భయంకరమైన మత్స్యకన్య పట్టుబడిన వీడియో 2022 - నిజమా లేక తప్పా?"
వీడియో వివరణ ఇలా పేర్కొంటోంది: "ఇవి వినోదం కోసం మేము సృష్టించిన పారానార్మల్ వీడియోలు. చూపిన చిత్రాలన్నీ కల్పితం. సిజిఐ వీడియో (కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజ్) మెర్మైడ్ క్రియేషన్ మరియు వీడియో ఎడిటింగ్: జోస్ జోక్విన్ పెరెజ్ యానిమేషన్ ఎడిటింగ్: జిమ్మీ జోస్ పెరెజ్.
"JJPD ప్రొడక్షన్స్ మేము ఇద్దరు నికరాగ్వాన్ యూట్యూబర్స్ బ్రదర్స్, స్పెషల్ ఎఫెక్ట్‌లతో వీడియోల సృష్టికర్తలు, పారానార్మల్ ఎన్కౌంటర్ల వీడియోలు, ఫిక్షన్ షార్ట్ ఫిల్మ్‌లు, హర్రర్ స్టోరీలు మరిన్ని. ఈ ఛానెల్‌ని లైక్ చేయండి, సబ్‌స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి." అంటూ JJPD ఛానెల్ వివరణ పేర్కొంది.
కాబట్టి, వైరల్ వీడియో ఒక స్పెషల్ ఎఫెక్ట్స్ వీడియో, ప్రొడక్షన్స్ ద్వారా ప్రచురించిన కంప్యూటర్ ద్వారా రూపొందించిన వీడియో. తెలంగాణలోని నల్గొండ జిల్లా దామరచెర్ల సమీపంలోని మూసీ నదిలో మత్స్యకన్య ను చూపడం లేదు. ఈ వాదన అవాస్తవం.