Sun Nov 17 2024 21:52:16 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: 'ఓట్ ఫర్ ఇండియా' అని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపును ఇచ్చింది I.N.D.I.A కూటమికి సంబంధించినది కాదు
భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ ప్రజలను ‘ఓట్ ఫర్ ఇండియా’ అని అడుగుతున్న వీడియో వైరల్ అవుతోంది.
Claim :
భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను I.N.D.I.A కూటమికి ఓటు వేయమని అడిగారుFact :
భారత ప్రధాని నరేంద్ర మోదీ 'భారతదేశం' కోసం.. దేశ భవిష్యత్తు కోసం ఓటు వేయమని అడిగారు. అది కూడా 2013 లో ఈ వీడియోను అప్లోడ్ చేశారు
భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ ప్రజలను ‘ఓట్ ఫర్ ఇండియా’ అని అడుగుతున్న వీడియో వైరల్ అవుతోంది. దేశంలోని ప్రతిపక్ష పార్టీలు ఏర్పాటు చేసిన కూటమికి ఓటు వేయాలని ప్రధాని మోదీ కోరుతున్నారంటూ వీడియోను వైరల్ చేస్తూ ఉన్నారు.
2024లో సార్వత్రిక ఎన్నికల కోసం భారత జాతీయ కాంగ్రెస్తో సహా అనేక ప్రతిపక్ష పార్టీలు కలిసి కూటమిని ఏర్పాటు చేశాయి. ఈ కూటమికి ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజివ్ అలయన్స్ అని పేరు పెట్టారు, దీనిని సంక్షిప్తంగా I.N.D.I.A అని పిలుస్తారు.
ప్రధాని నరేంద్ర మోదీ.. ఓ సమావేశంలో మాట్లాడుతూ ఇండియా కోసం ఓటు వేయమని అడిగారు. “Vote for India. Vote for India. Modi ji is saying to vote for India, lest the party gets angry with Modi ji. @RoflGandhi_@rohini_sgh @sakshijoshii" అంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
2024లో సార్వత్రిక ఎన్నికల కోసం భారత జాతీయ కాంగ్రెస్తో సహా అనేక ప్రతిపక్ష పార్టీలు కలిసి కూటమిని ఏర్పాటు చేశాయి. ఈ కూటమికి ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇన్క్లూజివ్ అలయన్స్ అని పేరు పెట్టారు, దీనిని సంక్షిప్తంగా I.N.D.I.A అని పిలుస్తారు.
ప్రధాని నరేంద్ర మోదీ.. ఓ సమావేశంలో మాట్లాడుతూ ఇండియా కోసం ఓటు వేయమని అడిగారు. “Vote for India. Vote for India. Modi ji is saying to vote for India, lest the party gets angry with Modi ji. @RoflGandhi_@rohini_sgh @sakshijoshii" అంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ప్రతి ప్రకటన తర్వాత 'ఓట్ ఫర్ ఇండియా' అనే నినాదాన్ని లేవనెత్తాలని ప్రజలను కోరడం వీడియోలో మనం చూడవచ్చు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న పోస్టులో ఎటువంటి నిజం లేదు. ఈ వీడియో చాలా పాతది.
మేము వీడియోను జాగ్రత్తగా పరిశీలించినప్పుడు, అది ఆజ్ తక్ కు సంబంధించినదని గుర్తించాం. ఆ ఛానల్ లో ప్రసారమయ్యే వార్తల క్లిప్లో 'మోదీ కీ మహాగర్జన ర్యాలీ' అనే శీర్షికను పైన మనం చూడొచ్చు. 7 సెకన్ల తర్వాత హిందీలో 'నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి, గుజరాత్' అని ఉంది. అంటే ఆ వీడియో నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటిది అని స్పష్టంగా తెలుస్తోంది.
‘Mahagarjana Rally + Modi Chief Minister, Gujarat’ అనే కీవర్డ్స్ ను తీసుకుని మేము గూగుల్ లో సెర్చ్ చేయగా.. narendramodi.in లో ఓ ఆర్టికల్ ను చూశాం. అందులో వీడియో కూడా ఉంది. “Full Speech: Shri Narendra Modi addressing Maha Garjana Rally in Mumbai” అనే టైటిల్ తో డిసెంబర్ 22, 2013న అప్లోడ్ చేసిన వీడియోను మేము గమనించాం. 50.03 నిమిషాల వద్ద ప్రధాని నరేంద్ర మోదీ 'ఓట్ ఫర్ ఇండియా' అనే స్లోగన్ మనం వినవచ్చు. ప్రజలను కూడా నినదించమని కోరడాన్ని మనం గుర్తించవచ్చు.
ఈ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. దేశం కంటే గొప్పది ఏదీ లేదని అన్నారు. పార్టీల కోసం ఓటు వేయొద్దని అన్నారు. భారతదేశం కోసం ఓటు వేయాలని కోరారు ప్రధాని మోదీ. నేను ఒక విషయం చెబుతాను.. ఆ వెంటనే మీరు 'ఓట్ ఫర్ ఇండియా' అంటూ నినదించండి అని ప్రజలను కోరారు. అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి మోదీ కోరిన వెంటనే ప్రజలు ఆయన చెప్పినట్లు చేయడం మొదలుపెట్టారు. రాజవంశ సంస్కృతి నుండి విముక్తి కోసం - ఓట్ ఫర్ ఇండియా, అవినీతి నుండి విముక్తి కోసం - ఓట్ ఫర్ ఇండియా, ద్రవ్యోల్బణం నుండి స్వేచ్ఛ కోసం - ఓట్ ఫర్ ఇండియా, దుష్ట పాలన నుండి స్వేచ్ఛ కోసం - ఓట్ ఫర్ ఇండియా, భారతదేశం ఐక్యత కోసం - ఓట్ ఫర్ ఇండియా, సుపరిపాలన కోసం - ఓట్ ఫర్ ఇండియా, దేశ భద్రత కోసం - ఓట్ ఫర్ ఇండియా, ప్రజా భద్రత కోసం - ఓట్ ఫర్ ఇండియా, తినడానికి ఆహారం కోసం - ఓట్ ఫర్ ఇండియా, రోగులకు మందుల కోసం - ఓట్ ఫర్ ఇండియా, పేదల సంక్షేమం కోసం - ఓట్ ఫర్ ఇండియా, విద్యాభివృద్ధికి - ఓట్ ఫర్ ఇండియా, యువతకు ఉపాధి కోసం - ఓట్ ఫర్ ఇండియా, మహిళల గౌరవం కోసం - ఓట్ ఫర్ ఇండియా, రైతుల సంక్షేమం కోసం - ఓట్ ఫర్ ఇండియా, స్వతంత్ర భారతదేశం కోసం - ఓట్ ఫర్ ఇండియా, బలమైన భారతదేశం కోసం - ఓట్ ఫర్ ఇండియా, సంపన్న దేశం కోసం - ఓట్ ఫర్ ఇండియా, అభివృద్ధి చెందుతున్న భారతదేశం కోసం - ఓట్ ఫర్ ఇండియా..! మిత్రులారా, ‘ఓట్ ఫర్ ఇండియా’ అనే ఈ మంత్రంతో మనం దేశంలోని ప్రతి మూలకు చేరుకుంటామని ప్రధాని మోదీ ఆ సభలో చెప్పుకొచ్చారు.
‘Shri Narendra Modi speech during Maha Garjana Rally in BKC Ground, Mumbai’ అనే టైటిల్ తో భారతీయ జనతా పార్టీ ఈ వీడియోను డిసెంబర్ 23, 2013న అప్లోడ్ చేసింది.
కాబట్టి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో పాతది. తప్పుడు వాదనతో షేర్ చేస్తున్నారు.
Claim : Viral video shows Indian Prime Minister Modi calling the public to raise the slogan ‘Vote for I.N.D.I.A party’
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story