Tue Dec 24 2024 02:21:48 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ను పట్టించుకోలేదనే వాదనలో ఎలాంటి నిజం లేదు
పురుషుల వన్డే ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా ఎగరేసుపోయింది. టోర్నమెంట్ లో అద్భుతంగా రాణిస్తూ
Claim :
ప్రపంచ కప్ ట్రోఫీ అందించిన తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్‌ను పట్టించుకోలేదు, భారత్ ఆతిథ్యం ఘోరంగా ఉందిFact :
వీడియో ను ఎడిట్ చేశారు. ఆస్ట్రేలియన్ క్రికెట్ కెప్టెన్‌ను ఇరు దేశాల నేతలు అభినందించే భాగాన్ని చూపించలేదు.
పురుషుల వన్డే ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియా ఎగరేసుపోయింది. టోర్నమెంట్ లో అద్భుతంగా రాణిస్తూ.. భారత్ అజేయ పరంపరను కొనసాగించి ఫైనల్ కు చేరుకోగా.. ఆస్ట్రేలియా భారత్ ను ఓడించింది. ఆస్ట్రేలియా క్రికెట్ ప్రపంచ కప్‌ను రికార్డు స్థాయిలో ఆరవ సారి గెలుచుకుంది. ఫైనల్లో ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుని భారత క్రికెట్ జట్టుకు షాక్ ఇచ్చింది. ఆస్ట్రేలియన్ క్రికెటర్ ట్రావిస్ హెడ్ 137 పరుగులు చేసి విజయంలో ప్రముఖ పాత్ర పోషించాడు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ నుండి 2023 ICC ప్రపంచ కప్ ట్రోఫీని అందుకున్న తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఒంటరిగా నిలబడి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. కమిన్స్ ను పట్టించుకోకుండా అవమానించారనే వాదనతో ప్రచారంలో ఉంది.
“India proved itself to be the most disgraceful host” అనే క్యాప్షన్ తో వీడియోను షేర్ చేశారు. భారత్ ఆతిథ్యం బాగాలేదనేది కొందరి వాదన.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వరల్డ్ కప్ క్రికెట్ ట్రోఫీని అందించిన తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్‌ను అభినందించకుండా నేతలు వెళ్లిపోయారనే విధంగా వీడియో ఎడిట్ చేశారు.మ్యాచ్ తర్వాత ప్రెజెంటేషన్ వేడుకకు సంబంధించిన చిత్రాలు, వీడియోలను సెర్చ్ చేసినప్పుడు.. నవంబర్ 20, 2023న అన్షు కశ్యప్ వ్లాగ్స్ అనే ఛానెల్ ద్వారా YouTubeలో అప్లోడ్ చేసిన వీడియో మాకు కనిపించింది. ఆస్ట్రేలియా జట్టు కోసం కమిన్స్ వేచి ఉండగా.. ఆ సమయంలో ఇరు దేశాల నాయకులు వేదికపై నుండి కిందకు వెళ్తున్నట్లు వీడియో చూపిస్తుంది. ట్రోఫీని ఇచ్చే నరేంద్ర మోదీ కమిన్స్ ను ఆప్యాయంగా పలకరించారు.
వీడియోకు సంబంధించిన క్లోజ్-అప్ వెర్షన్‌ను చూడొచ్చు.
"అహ్మదాబాద్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించిన తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్‌తో కలిసి క్రికెట్ ప్రపంచ కప్ 2023 ట్రోఫీని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్‌కు అందజేశారు” అనే శీర్షికతో ANI పోస్ట్ చేసింది.
Aljazeera.comలో ప్రచురించిన చిత్రాలలో.. ట్రోఫీని అందించిన తర్వాత ఆస్ట్రేలియా కెప్టెన్‌తో ప్రధాని మోదీ కరచాలనం చేయడం, శుభాకాంక్షలు చెప్పడం మనం చూడొచ్చు.
కాబట్టి, ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ పాట్ కమిన్స్‌ను నరేంద్ర మోదీ పలకరించకుండా ఒంటరిగా వదిలివేసినట్లు చూపించే వీడియోలో ఎలాంటి నిజం లేదు. ట్రోఫీని ఇవ్వడానికి ముందు అతనిని అభినందించారు. మాట్లాడారు కూడా!! ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
కాబట్టి, ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ పాట్ కమిన్స్‌ను నరేంద్ర మోదీ పలకరించకుండా ఒంటరిగా వదిలివేసినట్లు చూపించే వీడియోలో ఎలాంటి నిజం లేదు. ట్రోఫీని ఇవ్వడానికి ముందు అతనిని అభినందించారు. మాట్లాడారు కూడా!! ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
Claim : Indian Prime Minister Narendra Modi ignored Australian captain Pat Cummins after the trophy presentation, India proved to be a disgraceful host.
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media
Fact Check : False
Next Story