నిజ నిర్ధారణ: మోదీ మైనపు విగ్రహం కోసం కొలతలు తీసుకున్నారు.. మేక్-అప్ కోసం కాదు
భారత ప్రధాని మోడీ ముఖం, చేయి, కాలు మొదలైనవాటిని కొలుస్తున్న కొంతమంది పురుషులు, మహిళా కళాకారుల వీడియో ఇంటర్నెట్లో ఒక మేకప్ ఆర్టిస్ట్ అతనిని ఫోటోషూట్ కోసం సిద్ధం చేస్తున్నారనే వాదనతో చక్కర్లు కొడుతోంది.
భారత ప్రధాని మోడీ ముఖం, చేయి, కాలు మొదలైనవాటిని కొలుస్తున్న కొంతమంది పురుషులు, మహిళా కళాకారుల వీడియో ఇంటర్నెట్లో ఒక మేకప్ ఆర్టిస్ట్ అతనిని ఫోటోషూట్ కోసం సిద్ధం చేస్తున్నారనే వాదనతో చక్కర్లు కొడుతోంది.
వీడియో ఇటీవలిది అంటూ హిందీలో ఉన్న శీర్షిక ఇలా ఉంది: "चलो टीशर्ट का मान लिया महंगी पहन लिया,पर ये मेकअप किस बात के लिए हो रहा है इसे कौन सी शादी रचानी थी और इसका सारा खर्चा कहा से आ रहा है।। ये कौनसा देसी मेकअप है।"
అనువదించగా "అతను ధరించే టీ-షర్టులు ఖరీదైనవి అని అంగీకరిస్తాం, కానీ ఈ మేకప్ దేనికి, అతను ఏ పెళ్లికి హాజరు కావాలి, దీనికి అయ్యే ఖర్చులన్నీ ఎక్కడ నుండి వస్తున్నాయి? ఇది ఏ దేశీ మేకప్?"
నిజ నిర్దహారణ:
వీడియోలో భారత ప్రధానితో కలిసి పనిచేస్తున్న వారు ఆయన మేకప్ ఆర్టిస్టులు అనే వాదన తప్పుదారి పట్టించేది.
ఇన్విడ్ టూల్‌ని ఉపయోగించి వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్‌లను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి శోధించగా, మార్చి 2016 నుండి అనేక వార్తా నివేదికలను లభించాయి.
ఈ నివేదికల ప్రకారం, మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయడానికి ఆయన మైనపు విగ్రహాన్ని తయారు చేయడానికి కొలతలు తీసుకుంటున్నారు అని తెలుస్తోంది.
మ్యూజియం కళాకారులు ఆయనను 'ప్రపంచ రాజకీయాల్లో చాలా ముఖ్యమైన వ్యక్తి'గా అభివర్ణించారు. మ్యూజియం కళాకారులు మరియు నిపుణుల బృందానికి భారత ప్రధాని న్యూఢిల్లీలోని తన నివాసంలో కొలుతలు ఇచ్చినట్టు మ్యూజియం తెలిపింది.
మైనపు విగ్రహాన్ని ఏప్రిల్ 2016లో ఆవిష్కరించారు. సింగపూర్, హాంకాంగ్, బ్యాంకాక్, లండన్ మ్యూజియంలలో మోదీ విగ్రహాలను ఏర్పాటు చేశారు.
ఆర్టిస్టులు కొలతలు తీసుకుంటున్న దృశ్యాలను చూపిస్తూ మార్చి 2016లో దేశ్ గుజరాత్ హెచ్డి ద్వారా యూట్యబ్ వీడియో ప్రచురించారు. వీడియో వివరణ ఇలా ఉంది: "లండన్, ప్రపంచంలోని అనేక ఇతర నగరాల్లో ఉన్న మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో త్వరలో భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మైనపు విగ్రహం ఉండబోతోంది. ఇటీవల ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఆయన విగ్రహాన్ని సిద్ధం చేసేందుకు కొలతలు, ఇతర పనులు పూర్తయ్యాయి. దీని కోసం ప్రఖ్యాత కళాకారులు ప్రధానమంత్రితో సంప్రదింపులు జరిపారు.
దీనిని హాంకాంగ్ యూనిట్ మేడమ్ టుస్సాడ్స్ యూట్యూబ్ ఛానెల్ కూడా షేర్ చేసింది.
కళాకారులు మైనపు విగ్రహాన్ని తయారు చేస్తున్న వీడియోను మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్ వింగ్ కూడా షేర్ చేసింది.
అందుకే, వైరల్ పోస్ట్‌లో షేర్ అయిన విజువల్స్ మార్చి 2016 నాటివి, ఇందులో మేడమ్ టుస్సాడ్స్‌కు చెందిన కళాకారుల బృందం మైనపు విగ్రహాన్ని రూపొందించడానికి పీఎం శరీర భాగాలను కొలవడం జరిగింది. వీడియోలోని పురుషులు, మహిళలు మేకప్ ఆర్టిస్టులు అనే వాదన తప్పుదారి పట్టించేది.