Fri Jan 10 2025 05:52:56 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ప్రధాని మోదీ బాత్ రూమ్ లో ఉన్నప్పుడు ఫోటోలను తీయలేదు
వాష్బేసిన్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతులు కడుక్కుంటున్నారని.. ప్రధాని మోదీ ఫోటో టాయిలెట్లో ఉండగా కూడా ఫోటోలు తీశారనే వాదనతో ప్రచారంలో ఉంది. ఫోటోషూట్ కోసం ఫోటోగ్రాఫర్ బాత్రూమ్ వరకు కూడా PMని అనుసరించారని ఈ చిత్రాన్ని వ్యంగ్యంగా షేర్ చేస్తూ వస్తున్నారు.

ఈ చిత్రం సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్‌గా మారింది.
ఫ్యాక్ట్ చెకింగ్:
టాయిలెట్లో ప్రధాని మోదీ ఉండగా ఫోటోలు తీశారనేది అబద్ధం. ఈ చిత్రం ఢిల్లీలోని గురుద్వారా రాకబ్ గంజ్ సాహిబ్ వెలుపల తీయబడింది.
ముందుగా.. ఈ చిత్రంలో, PM ఉపయోగించిన వాష్‌బేసిన్ పక్కన ఉన్న మెట్లని మనం చూడవచ్చు.
అసలు చిత్రాన్ని కనుగొనడానికి మేము Google రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించినప్పుడు, డిసెంబర్ 20, 2020న ప్రచురించబడిన ఫ్రీ ప్రెస్ జర్నల్ లో కథనాన్ని మేము కనుగొన్నాము. ఆ కథనం 'చిత్రాలలో: ఢిల్లీలోని గురుద్వారా రకబ్ గంజ్ సాహిబ్‌కు PM మోదీ ఆకస్మిక సందర్శన' శీర్షికతో ఉంది. వైరల్ ఇమేజ్ ఈ కథనంలో ఒక భాగం, అందులో ప్రధాని మోదీ ఉపయోగిస్తున్న వాష్‌బేసిన్ పక్కన ఉన్న మెట్లని కూడా చూపిస్తుంది.
కథనం ప్రకారం.. ఢిల్లీలోని గురుద్వారా రకబ్ గంజ్ సాహిబ్ వద్ద గురు తేజ్ బహదూర్‌కు ప్రధాని మోదీ నివాళులర్పించారు.
ఢిల్లీలోని గురుద్వారా శ్రీ రకబ్ గంజ్ సాహిబ్‌కు ప్రధానమంత్రి సందర్శనకు సంబంధించిన చిత్రాలు, విజువల్స్‌ని చూపించే కొన్ని ఇతర కథనాలు మీరు చూడవచ్చు.

మేము Google చిత్రాలను తనిఖీ చేసినప్పుడు, గురుద్వారాలోకి ప్రవేశించే ముందు భక్తులు తమ చేతులు, కాళ్ళు కడుక్కోవడానికి మెట్ల దగ్గర ఏర్పాటు చేసిన వాష్బేసిన్ల యొక్క కొన్ని చిత్రాలను మేము కనుగొన్నాము.
భారతదేశంలో దేవాలయాలు, గురుద్వారా మొదలైన పవిత్ర స్థలాలలోకి ప్రవేశించే ముందు చేతులు, కాళ్ళు కడుక్కోవడం ఒక ఆచారం. కాబట్టి, వైరల్ ఇమేజ్‌లో కనిపించే విధంగా ప్రవేశద్వారాల దగ్గర కుళాయిలు, వాష్బాసిన్ల ఏర్పాట్లను చూడవచ్చు.
కాబట్టి, ప్రధాని మోదీ వైరల్ చిత్రం టాయిలెట్లో తీశారనే వాదన తప్పు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 2020లో ప్రధాని మోదీ సందర్శించగా.. గురుద్వారా ప్రవేశ ద్వారం దగ్గర చిత్రీకరించారు.
Claim : The viral image was taken inside toilet
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Network
Claim Source : Social Media
Fact Check : False
Next Story