ఫ్యాక్ట్ చెక్: ఐశ్వర్య రాయ్ బచ్చన్ అందాన్ని గౌరవించటానికి ఎలాన్ మస్క్ ట్విట్టర్ లో లైక్ బటన్ ను మార్చలేదు
సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం కోసం కొందరు ఎన్నో తంటాలు పడుతుంటారు. లైక్ లు, కామెంట్ల కోసం చేసే అనాలోచిత పనులు
Claim :
ఐశ్వర్య రాయ్ బచ్చన్ అందానికి గౌరవించటానికి ఎలాన్ మస్క్ లైక్ బటన్ ను మార్చాడుFact :
ఇదంతా పోస్టులకు మంచి రీచ్ రావడానికి, లైక్స్ సంఖ్యను పెంచుకోడానికి సోషల్ మీడియాలో చేస్తున్న పని మాత్రమే
సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం కోసం కొందరు ఎన్నో తంటాలు పడుతుంటారు. లైక్ లు, కామెంట్ల కోసం చేసే అనాలోచిత పనులు ఇతరులకు ముప్పు తెస్తాయనే ఆలోచన ఉండదు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు కూడా లైక్ లూ, కామెంట్ల, నోటిఫికేషన్ల పేరిట మన మెదడును లోబర్చుకుంటున్నాయి. ప్లాట్‌ఫారమ్ లలో విషయాలు మనం తిరిగి మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంటాయి. సోషల్ మీడియా కంపెనీలు వినియోగదారులను హెచ్చరించకుండానే తమ ప్రమాదకరమైన ఉత్పత్తులను ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తాయ్ని నిపుణులు చెప్తున్నారు.
ఇలాంటి కోవకి చెందినదే సోషల్ మీడియా ప్లాట్ ఫారం X. అయితే, మస్క్ కొనుగోలు చేసిన తరువాత X పైన తప్పుడు సమాచార వ్యాప్తి చాలా ఎక్కువైపోయింది. ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం ఫిడిలిటీ ప్రకారం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ రెండేళ్ల క్రితం ఎలోన్ మస్క్ కొనుగోలు చేసిన దాని కంటే దాదాపు 80% పడిపోయింది. X విలువలో పతనం, దాని భవిష్యత్తుపై ఆందోళన పెంచుతోంది.
ప్లాట్‌ఫారమ్‌ను $44 బిలియన్లకు కొనుగోలు చేసిన తర్వాత అక్టోబర్ 2022లో ఎలాన్ మస్క్ ట్విట్టర్ లో చాలా మార్పులను తీసుకొచ్చారు. అతను ప్లాట్‌ఫారమ్ పేరును కూడా మార్చాడు. ప్లాట్‌ఫారమ్ విషయం అనేక నియమాలను కూడా మార్చారు. సబ్స్క్రిప్షన్ మోడల్ ను కూడా మార్చింది, ట్విత్తెర్ బ్లూ అదనపు ఫీచర్లను అందిస్తోంది. అయితే, ఎలోన్ మస్క్ Xలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ కోసం లైక్ బటన్‌ను మార్చినట్లు X లో ఒక పోస్ట్ వైరల్‌గా షేర్ చేస్తున్నారు. ఐశ్వర్య రాయ్ బచ్చన్ చిత్రాలతో X లో ఈ పోస్టులు వైరల్ అవుతున్నాయి.
క్లెయిం ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఐశ్వర్యరాయ్ బచ్చన్ లేదా మరెవరి గౌరవార్థం మస్క్ ఏ బటన్నూ మార్చలేదు.
లైక్ బటన్‌ను తనిఖీ చేసినప్పుడు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలోని లైక్ బటన్‌కు ఎటువంటి మార్పులు రాలేదని తెలుసుకున్నాము. వైరల్ పోస్ట్‌ల్లో పేర్కొన్నట్లుగా లైక్ బటన్‌లో మాకు ఎటువంటి మార్పులు కనిపించలేదు. ఇంతకుముందు, X పై విభిన్న అంశాల గురించి ఇలాంటి వాదనలు వినిపించాయి. అమెరికన్ ఎన్నికల సమయంలో, X లైక్ బటన్‌ను క్లిక్ చేసినప్పుడు అది బ్యాలెట్ బాక్స్ యానిమేషన్‌గా మారుతుందని క్లెయిమ్ చేశారు. ఈ వాదన నకిలీ అంటూ కొట్టివేశారు.
రిపబ్లికన్అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌కు ఓటు వేయడానికి ఎలోన్ మస్క్ లైక్ బటన్‌ను "ప్రోగ్రామ్" చేసినట్లు మరొక క్లెయిమ్ వైరల్ అయింది. X లోని లైక్ బటన్‌లో ఏదైనా మార్పుకు సంబంధించి ఇప్పటికీ ఎటువంటి నిర్ధారణ లేదు, X, ఎలోన్ మస్క్‌ల చుట్టూ పుకార్లను వ్యాప్తి చేయడానికి సోషల్ మీడియా వినియోగదారులు ఇలాంటి పనులు చేస్తున్నారు. హాలోవీన్ సందర్భంగా గుమ్మడికాయ యానిమేషన్‌ను పోలి ఉండేలా X' లైక్ బటన్ రీప్లేస్ చేసినట్లుగా కూడా వాదనలు వచ్చాయి. అందులో కూడా ఎలాంటి నిజం లేదని తేలింది. ఈ క్లెయిమ్‌లు ప్రమాదకరం కానప్పటికీ, పోస్టుల ఎంగేజ్మెంట్ ను పెంచే లక్ష్యంతో తప్పుదారి పట్టించే కంటెంట్‌ను ప్రచారం చేయడమే వీటి లక్ష్యం.
ఎవరైనా తమ ఖాతాల జనాదరణను పెంచుకోవడానికి మరిన్ని లైక్‌లు, షేర్లు, కామెంట్లు పొందడానికి కంటెంట్‌ను పోస్ట్ చేయడాన్ని Xలో ఎంగేజ్మెంట్ అంటారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల అల్గారిథమిక్ బయాస్ ప్రయోజనాన్ని పొందడం ద్వారా ఇది జరుగుతుంది, ఇది అధిక ఎంగేజ్మెంట్తో ఉన్న కంటెంట్‌కు ప్రాధాన్యతనిస్తుంది. ఎంగేజ్మెంట్ఫార్మింగ్ అనేది సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో లైక్‌లు, షేర్లు, కామెంట్ల వంటి ఎంగేజ్మెంట్ మెట్రిక్‌లను కృత్రిమంగా పెంచడానికి రూపొందించబడిన మానిప్యులేటివ్ స్ట్రాటజీ. అయితే, ఈ ప్రయాసలో కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తూ అమాయకులైన ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు.
ఇలాంటి ప్రయాసే వైరల్ అవుతున్న పోస్ట్. ఇలాంటి ప్రచారాలు జరుతాయనే జ్ఞానం కలిగి ఉండి, వాటి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఐశ్వర్య రాయ్ బచ్చన్ అందాన్ని గౌరవించడానికి మస్క్ X లో లైక్ బటన్‌ను మార్చాడన్న వాదనలో నిజం లేదు. కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App Now