నిజ నిర్ధారణ: ఓణం వేడుకల్లో పాల్గొనేందుకు ముస్లిం విద్యార్థినులను ఇంటికి తిరిగి పంపలేదు
ఓణం కేరళలో ప్రసిద్ధి చెందిన పంట పండుగ.ఇది మలయాళీ కాలగణనములో మొదటి నెల అయిన చింగంలో వస్తుంది. ఈ పండుగ మహాబలి ఆ ప్రాంతమునకు తిరిగి రావటాన్ని సూచిస్తుంది. సింహ మాసంలో వచ్చే శ్రవణా నక్షత్రయుక్త దినమును ఓణం లేక తిరువోణం పేరిట జరుపుకొంటారు.
ఓణం కేరళలో ప్రసిద్ధి చెందిన పంట పండుగ.ఇది మలయాళీ కాలగణనములో మొదటి నెల అయిన చింగంలో వస్తుంది. ఈ పండుగ మహాబలి ఆ ప్రాంతమునకు తిరిగి రావటాన్ని సూచిస్తుంది. సింహ మాసంలో వచ్చే శ్రవణా నక్షత్రయుక్త దినమును ఓణం లేక తిరువోణం పేరిట జరుపుకొంటారు.
హిజాబ్ ధరించి ఓణం వేడుకలను జరుపుకుంటున్న హైస్కూల్ విద్యార్థుల వీడియో క్లిప్ దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఇటీవల జరుపుకున్న ఓణం వేడుకల్లో భాగంగా విద్యార్ధినులు హిజాబ్‌లు చీర ధరించి నృత్యం చేస్తున్న వీడియో ఆన్లైన్లో చాలా మంది దృష్టిని ఆకర్షించింది.
ఇంతలో, ఓణం పండుగలో పాల్గొన్నందుకు బాలికలను శిక్షిస్తున్నారనే వాదనతో హిజాబ్‌లతో బాలికలు తమ పాఠశాల నుండి ఇంటికి తిరిగి వెళుతున్నప్పుడు వేదిస్తున్నట్టు చూపే మరో వీడియో ప్రచారంలో ఉంది.
కేరళలోని కాసర్గోడ్లో ఇస్లామిక్ జిహాదీలు ఓణం పండుగను జరుపుకోవడం హరామ్ అని చెప్పి ప్రభుత్వ పాఠశాలలో ఓణం పండుగ జరుపుకుంటున్న బాలికలను తరిముతున్నట్టు క్లెయిం ఒకటి ట్విట్టర్లో ప్రధానంగా వైరల్ అవుతోంది.
వైరల్‌గా మారిన ట్వీట్‌ను ఫేస్బుక్ యూజర్లు షేర్ చేస్తున్నారు.
ఆర్కైవ్ లింక్:
https://web.archive.org/web/
ఆ వీడియోలో, దుండగులు 'వాళ్లకు పెళ్లి జరగాల్సి ఉంది, ఇప్పుడు వాళ్లను ఎవరు పెళ్లి చేసుకుంటారు, వాళ్లకు సిగ్గు, సంకోచం లేవని' అమ్మాయిలపై వ్యాఖ్యానించడం మనం వినవచ్చు.
నిజ నిర్ధారణ:
ఓణం పండుగలో పాల్గొన్నందుకు హిజాబ్ ధరించిన విద్యార్థులను ఒక వర్గానికి చెందిన వ్యక్తులు వేధించారనే వాదన అవాస్తవం.
'కేరళలో హిజాబ్ ధరించిన విద్యార్ధినులను వేధించడం' అనే కీవర్డ్ లతో వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్‌లను సెర్చ్ చేసినప్పుడు, మలయాళంలో ఉన్న కథనం లభించింది, వైరల్ అవుతున్న వీడియో నుండి క్లిప్పింగ్‌ను షేర్ చేసి, దానిని నకిలీ అని పేర్కొంది.
మరింత శోధించగా, కాసరగోడ్ పోలీసుల ఫేస్బుక్ ఖాతా చేసిన మలయాళం పోస్ట్ లభించింది 'ജില്ലയിലെ സമാധാന അന്തരീക്ഷവും
అనువదించినప్పుడు 'జిల్లాలో శాంతియుత వాతావరణం, మత సామరస్యాన్ని ధ్వంసం చేయాలనే ఉద్దేశ్యంతో సంఘ వ్యతిరేకులు సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని జిల్లా పోలీసు చీఫ్ దృష్టికి వచ్చింది. అలాంటి వారి కోసం సైబర్ పెట్రోలింగ్ నిఘా పెడుతోంది. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ సెల్‌ను ఆదేశించారు.
ఓణం వేడుకలలో పాల్గొన్నారనే కారణంగా ముస్లిం విద్యార్థినులను వెనక్కి పంపారనే వాదనను ఖండిస్తూ కాసరగోడ్ జిల్లా కలెక్టర్ కూడా సెప్టెంబర్ 5, 2022న వారి ఫేస్బుక్ ఖాతాలో పొస్ట్ చేసారు.
കാസർകോട് ജില്ലയിലെ ഒരു സ്ഥാ
అనువదించినప్పుడు, "కాసర్గోడ్ జిల్లాలోని ఒక సంస్థలో ఓణం జరుపుకోవడానికి వచ్చిన విద్యార్థులను ఒక వర్గంవారు దుర్భాషలాడారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవం. విద్వేషపూరిత ప్రచారం కోసం తప్పుడు వార్తలను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు
బూమ్ లైవ్.కామ్‌లోని నిజ నిర్ధారణ ప్రకారం, వారు పాఠశాల యాజమాన్యాన్ని సంప్రదించినప్పుడు, విద్యార్థులు ఓణం వేడుకల రోజున పాఠశాల యూనిఫాం ధరించనందున వారిని ఇంటికి తిరిగి పంపినట్లు పేర్కొన్నారు. బాలీక్లు ఇంటికి వెళుతుండగా, సమీపంలోని నివాసితులు కొందరు వీడియోను చిత్రీకరించారు, బాలికలపై వ్యాఖ్యలు చేశారు. కొంతమంది విద్యార్థులు పాఠశాల యూనిఫారంలో తిరిగి పాఠశాలకు వచ్చారు.
కనుక, ఓణం వేడుకల్లో పాల్గొన్నందుకు హిజాబ్ ధరించిన విద్యార్థులను తిరిగి ఇంటికి పంపించారనే వాదన అబద్దం.