నిజ నిర్ధారణ - ప్రధాని మోడీ కుటుంబ సభ్యుల గురించిన వైరల్ సందేశం అబద్ధాల పుట్ట
నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత, ఆయన అన్నదమ్ములు, బంధువులు చేసే వ్యాపారాలు, ప్రభుత్వ ఉద్యోగాలు లభించడానికీ, ధనవంతులు కావడానికి సహాయం చేశారంటూ ఒక సుదీర్ఘ సందేశం విస్తృతంగా షేర్ అవుతోంది.
నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత, ఆయన అన్నదమ్ములు, బంధువులు చేసే వ్యాపారాలు, ప్రభుత్వ ఉద్యోగాలు లభించడానికీ, ధనవంతులు కావడానికి సహాయం చేశారంటూ ఒక సుదీర్ఘ సందేశం విస్తృతంగా షేర్ అవుతోంది. మెసేజ్‌లో మోడీ కుటుంబంలోని 12 మంది సభ్యుల పేర్లు, మోడీ ప్రధాని కాకముందు వారి స్థితిని, ఇప్పుడు వారి స్థితి పోలుస్తూ క్లెయిం రాసారు.
క్లెయిం ఇలా ఉంది:
నరేంద్ర మోదీజీ కుటుంబ సభ్యుల జాబితా
1. సోమాభాయ్ మోడీ (75 సంవత్సరాలు) రిటైర్డ్ హెల్త్ ఆఫీసర్ - ప్రస్తుతం గుజరాత్లో రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మన్. 2. అమృత్ భాయ్ మోడీ (72 సంవత్సరాలు) ఒక ప్రైవేట్ ఫ్యాక్టరీలో పని చేసేవారు, ప్రస్తుతం అహ్మదాబాద్ మరియు గాంధీనగర్‌లలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి. 3. ప్రహ్లాద్ మోడీ (64 సంవత్సరాలు) చౌకైన ధాన్యం (రేషన్) దుకాణాన్ని కలిగి ఉన్నారు, ప్రస్తుతం హ్యుందాయ్, మారుతి మరియు హోండా ఫోర్ వీలర్ షోరూమ్‌లు అహ్మదాబాద్, వడోదరలో ఉన్నాయి. 4. గతంలో ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసిన పంకజ్ మోదీ (58 ఏళ్లు), నేడు సోంభాయ్తో పాటు రిక్రూట్మెంట్ బోర్డులో వైస్ చైర్మన్‌గా ఉన్నారు. 5. కిరాణా దుకాణం యజమాని అయిన భోగిలాల్ మోడీ (వయస్సు 67) నేడు అహ్మదాబాద్, సూరత్ మరియు వడోదరలో రిలయన్స్ మాల్స్‌ను కలిగి ఉన్నారు. 6. అరవింద్ మోడీ (వయస్సు 64) స్క్రాప్ డీలర్, ప్రస్తుతం ప్రధాన భవన నిర్మాణ కంపెనీలకు రియల్ ఎస్టేట్ మరియు స్టీల్ కాంట్రాక్టర్. 7. భరత్ మోదీ (55 ఏళ్లు) పెట్రోల్ పంపులో పనిచేసేవారు. ఈరోజు వారికి అహ్మదాబాద్‌లో పదకొండు పెట్రోల్ పంపులు ఉన్నాయి. 8. అశోక్ మోడీ (51 సంవత్సరాలు) గాలిపటాలు మరియు కిరాణా దుకాణం కలిగి ఉన్నారు. ఈరోజు ఆయన భోగిలాల్ మోదీతో కలిసి రిలయన్స్‌లో భాగస్వామి. 9. చంద్రకాంత్ మోదీ (48 ఏళ్లు) గోశాలలో పనిచేస్తున్నాడు. నేడు, అహ్మదాబాద్ మరియు గాంధీనగర్‌లలో తొమ్మిది ప్రధాన పాల ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. 10. రమేష్ మోడీ (57 సంవత్సరాలు) ఉపాధ్యాయునిగా పనిచేశారు, ఈ రోజు అతనికి ఐదు పాఠశాలలు, 3 ఇంజనీరింగ్ కళాశాలలు, ఆయుర్వేదం, హోమియోపతి, ఫిజియోథెరపీ కళాశాలలు మరియు వైద్య కళాశాలలు ఉన్నాయి. 11. గతంలో ట్యూషన్ సెంటర్లో పనిచేసే భార్గవ మోడీ (44 సంవత్సరాలు) ఇప్పుడు రమేష్ మోడీ సంస్థల్లో భాగస్వామి. 12. బిపిన్ మోదీ (42 ఏళ్లు) అహ్మదాబాద్ లైబ్రరీలో పనిచేస్తున్నారు. ఈరోజు కేజీ నుండి 12వ తరగతి వరకు పాఠశాల పుస్తకాలను సరఫరా చేసే పుస్తక ప్రచురణ సంస్థలో భాగస్వామి.
నంబర్ 1 నుంచి 4 వరకు ప్రధాని మోదీ సోదరులు. 5 నుంచి 9 వరకు ఉన్న వారు ప్రధాని మోదీ బంధువులు. నంబర్ 10 ప్రధాని మోదీ మేనమామ జగ్జీవందాస్ మోదీ కుమారుడు. 11 భార్గవ కాంతిలాల్, 12 బిపిన్ వీరు ప్రధాని చిన్న మామ జయంతిలాల్ మోడీ కుమారులు. - తినడు మరియు తినడానికి అనుమతించడు మరియు బంధుప్రీతి చేయడు - అని అంటారు కదా. అందరికి తెలిసేలా రీడర్స్ కు ఫార్వర్డ్ చేయగలరు. మీరు మరియు మీ కుటుంబం సంవత్సరాలుగా కష్టపడుతున్నారు కాని బతకటటానికి సరిపోవట్లేదు, మీ జీవితం మారలేదు. ఇది మోడీ దేశ భక్తి, అందరం ఆలోచించాలి
Archive links:
నిజ నిర్ధారణ:
నరేంద్ర మోదీ భారత ప్రధాని అయిన తర్వాత ఆయన అన్నదమ్ములు, బంధువులు ధనవంతులయ్యారనే వాదన అవాస్తవం. నేటికీ యథావిధిగా తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు.
'నరేంద్ర మోదీ కుటుంబం' అనే కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు, 2022లో ట్వ్9 హిందీ, తెలుగు లో కూడా ప్రచురించిన ఒక కధనం లభించింది, ఇందులో భారత ప్రధాని నరేంద్ర మోదీ కుటుంబ సభ్యులు కొందరు చేస్తున్న ఉద్యోగాల గురించి చర్చించారు.
అలాగే, 2016లో ఇండియా టుడే మ్యాగజైన్లో ప్రచురితమైన ప్రధాని మోడీ కుటుంబంపై ఫీచర్ స్టోరీ లభించింది. ప్రధాని మోడీ తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలను ఎలా వేరుగా ఉంచుకున్నారో కథనం హైలైట్ చేస్తుంది.
ఇప్పుడు క్లెయిమ్‌లను పరిశీలిద్దాం:
క్లెయిం 1:
సోమాభాయ్ పటేల్, ప్రధాని మోడీ పెద్ద సోదరుడు, రిటైర్డ్ హెల్త్ ఆఫీసర్, గుజరాత్లో లేదా దేశవ్యాప్తంగా రిక్రూట్మెంట్ బోర్డుకు నాయకత్వం వహించడం లేదు. వేర్వేరు కీలకపదాలను ఉపయోగించి వెతికగా, రిక్రూట్మెంట్ బోర్డులతో సోమాభాయ్ మోడీకి ఎలాంటి అనుబంధం లేదని తెలుస్తోంది.
https://www.govtjobportal.com/gserb-recruitment/
https://www.lrbgujarat2018.in/
ఇండియా టుడే కథనంలో అందించిన సమాచారాన్ని ధృవీకరిస్తూ 2021లో సోమాభాయ్ మోదీ నిర్వహించే వృద్ధాశ్రమాన్ని సందర్శించిన సంగతి బీజేపీ నేత తేజస్వి సూర్య ట్వీట్ చేశారు.
దిఎకనామిక్ టైమ్స్ లో ప్రచురితమైన మరో కథనం దీనిని ధృవీకరిస్తుంది.
క్లెయిం -2:
నివేదికలప్రకారం, అమృత్ భాయ్ మోడీ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేశారు, అహ్మదాబాద్‌లో తన కుమారుడు సంజయ్ కుటుంబంతో ప్రశాంతంగా రిటైర్డ్ జీవితాన్ని గడుపుతున్నారు.
క్లెయిం -3
రేషన్ దుకాణాన్ని నడిపిన ప్రహ్లాద్ మోడీ అహ్మదాబాద్, వడోదరలలో హ్యుందాయ్, మారుతీ, హోండా కార్ షోరూమ్‌ల యజమాని కాదు.
అతను ఇప్పుడు ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ ఫెడరేషన్ (ఆఈFఫ్శ్డ్F) వైస్ ప్రెసిడెంట్. ఫెడరేషన్లో తన విధుల్లో భాగంగా ప్రజాపంపిణీ వ్యవస్థలో సమస్యలపై నిర్వహించిన ధర్నాలో కూడా పాల్గొన్నారు.
ప్రహ్లాద్ మోడీ తన సోదరుడు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని పదేపదే విమర్శిస్తారు, అయితే అతను ప్రభుత్వ విధానాలను విమర్శిస్తాడే తప్ప తన సోదరుడిని కాదని తెలియపరిచాడు.
క్లెయిం -4
ప్రధాని మోదీ తమ్ముడు పంకజ్ మోదీ రిక్రూట్మెంట్ బోర్డులో పనిచేయడం లేదు. సమాచార శాఖ నుండి పదవీ విరమణ పొందిన అతను ఇప్పుడు తన తల్లి, ఇంకా కుటుంబ సబ్యులతో కలిసి గాంధీనగర్‌లో నివసిస్తున్నాడు. నివేదికల ప్రకారం అతను ఇప్పుడు సామాజిక కార్యకర్త.
క్లెయిం -5
అరవింద్భాయ్ మోదీ స్క్రాప్ డీలర్ అని తప్ప ఆన్లైన్లో ఎలాంటి సమాచారం లేదు. క్లెయిం చాలా అస్పష్టంగా ఉంది, అది నిజమని నిరూపించడానికి నివేదికలు లేవు.
క్లెయిం -6 నుండి 12 వరకు
వాటిని నిరూపించడానికి ఎక్కువ సమాచారం లేనందున ఈ వాదనలు ఏవీ నిరూపించబడవు. రిలయన్స్ మాల్స్ పూర్తిగా అంబానీ కుటుంబానికి చెందినవని తప్ప ఇతర యజమానులు లేరని అందరికీ తెలుసు కాబట్టి, అశోక్‌భాయ్ మోడీ రిలయన్స్ మాల్లో భోగిలాల్భాయ్తో భాగస్వామిగా ఉన్నారనే వాదనలు అబద్ధం.
ఇతర భారతీయ భాషలలో ఈ క్లెయిమ్‌లు దాదాపు 2020 నుండి ఉన్నాయి, అనేక నిజ నిర్ధారణ చేసే సంస్థలు వాటిని తప్పుగా నిరూపించాయి.
https://www.altnews.in/viral-message-targeting-pm-modis-family-is-a-work-of-fiction/
https://www.thequint.com/news/webqoof/pm-modi-family-members-viral-message-fact-check
అందువల్ల, నరేంద్ర మోదీ భారత ప్రధాని అయిన తర్వాత అతని తోబుట్టువులు, బంధువులు ధనవంతులు అయ్యారనే వాదనలు అబద్ధం.