క్లెయిమ్ చేసినట్లుగా వైరల్ సర్వే టైమ్స్ ఆఫ్ ఇండియా సంస్థ నిర్వహించలేదు, ఇది ఒక బూటకపు సర్వే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాల పూర్తి చేసుకుంది. ఈ నేపధ్యంలో, ఏ పి లో పాలనపై నేషనల్ మీడియా "ది టైమ్స్ ఆఫ్ ఇండియా" చేసిన సర్వేను చూపుతున్నట్లు గా పేర్కొంటూ కొన్ని స్క్రీన్షాట్లు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాల పూర్తి చేసుకుంది. ఈ నేపధ్యంలో, ఏ పి లో పాలనపై నేషనల్ మీడియా "ది టైమ్స్ ఆఫ్ ఇండియా" చేసిన సర్వేను చూపుతున్నట్లు గా పేర్కొంటూ కొన్ని స్క్రీన్షాట్లు సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయి. ఈ స్క్రీన్షాట్లు గత 3 సంవత్సరాలలో AP పాలనలోని వివిధ అంశాల పై జరిగిన సర్వే అనీ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పట్ల ప్రజలు సంతోషంగా లేరని సూచిస్తూ ప్రతి ప్రశ్నకు ఫలితాలు ప్రతికూలంగా ఉన్నాయనీ తెలుస్తోంది.
"నేషనల్ మీడియా..మూడేళ్ల జగన్ పాలనపై టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే.. #FailedCmYsJagan" అనే క్యాప్షన్‌తో ఒక సోషల్ మీడియా వినియోగదారు వీటిని షేర్ చేశారు.
కొన్ని మీడియా సంస్థలు సర్వే ఫలితాలను చర్చిస్తూ వీడియోలను కూడా ప్రచురించాయి.
నిజ నిర్ధారణ:
ఈ చిత్రాలు టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే ఫలితాలను చూపుతున్నాయనే వాదన "తప్పుదారి పట్టించేది".
ఈ స్క్రీన్షాట్లు ఆన్లైన్ ఒపీనియన్ పోల్ ఫలితాలను చూపుతున్నాయి కానీ సర్వేవి కాదు.
టైమ్స్ ఆఫ్ ఇండియా, జాతీయ మీడియా ఇటీవలి రోజుల్లో అలాంటి సర్వే నిర్వహించలేదు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆన్లైన్ ఎడిషన్‌లో జగన్ మోహన్ రెడ్డిపై కథనాల కోసం వెతికినప్పుడు, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎక్కడా ప్రచురించబడిన అటువంటి సర్వే ఫలితాలు మాకు కనిపించలేదు.
https://timesofindia.indiatimes.com/topic/YS-Jaganmohan-Reddy
https://timesofindia.indiatimes.com/topic/jagan-3-year-rule
టైమ్స్ ఆఫ్ ఇండియా సంస్థ కు చెందిన తెలుగు ఎడిషన్ "సమయం తెలుగు" తన వెబ్సైట్లో ఆన్లైన్ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. ఈ పోల్‌లో ఎవరైనా ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని తెలియజేయవచ్చు. వెబ్సైట్ ప్రకారం, పోల్ మే 29, 2021 వరకు తెరిచి ఉంది.
ఇది కేవలం ఒపీనియన్ పోల్ మాత్రమే తప్ప భారీ గా జరిగిన సర్వే కాదు.
కాబట్టి, షేర్ చేసిన స్క్రీన్షాట్లలో కనిపించేవి సమయం తెలుగు నిర్వహించిన ఒపీనియన్ పోల్ మాత్రమే కానీ సర్వే కాదు, కనుక, అవి టైమ్స్ ఆఫ్ ఇండియా చేసిన సర్వే ఫలితాలు అని సోషల్ మీడియాలో చేసిన వాదన తప్పుదారి పట్టించేది.