Mon Dec 23 2024 05:46:55 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: అరవింద్ కేజ్రీవాల్ ఐఐటీ విద్యార్థిగా ఉన్నప్పుడు అత్యాచారం చేశాడనే క్లిప్పింగ్ డిజిటల్‌గా రూపొందించారు.
అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి గా ఉన్నారు. మద్యం పాలసీ స్కామ్‌లో ఆయన మార్చి 21, 2024న అరెస్టయ్యారు. ఏప్రిల్ 1, 2024న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీ ముగియడంతో వచ్చే రెండు వారాలు ఆయన జైలులో గడపనున్నారు.
Claim :
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై ఐఐటీ విద్యార్థిగా ఉన్నప్పుడు అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొన్నట్లు ఓ వార్తాపత్రిక క్లిప్పింగ్ చూపుతోంది.Fact :
వార్తాపత్రిక నివేదిక ఒక బూటకం, దీన్ని డిజిటల్‌గా సృష్టించారు.
అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి గా ఉన్నారు. మద్యం పాలసీ స్కామ్‌లో ఆయన మార్చి 21, 2024న అరెస్టయ్యారు. ఏప్రిల్ 1, 2024న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీ ముగియడంతో వచ్చే రెండు వారాలు ఆయన జైలులో గడపనున్నారు. కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ ఏప్రిల్ 15 వరకు కొనసాగుతుంది. మార్చి 21 తేదీన సాయంత్రం ఈడీ రెండున్నర గంటల పాటు విచారించి.. ఆయన్ను అనంతరం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ కేసు గురించి సోషల్ మీడియాలో చర్చిస్తున్న సమయంలో.. సోషల్ మీడియాలో ఒక వార్తాపత్రిక క్లిప్పింగ్ వైరల్ అవుతోంది. “IIT student accused of rape” అనే టైటిల్ లో పోస్టును వైరల్ చేస్తున్నారు.19 ఏళ్ల IIT ఖరగ్‌పూర్ విద్యార్థి అరవింద్ కేజ్రీవాల్ స్థానిక బాలికపై అత్యాచారం చేశాడని ఆ కథనంలో ఉంది. విచారణ నిమిత్తం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. వార్తాపత్రిక క్లిప్పింగ్ తేదీని జూన్ 8, 1987గా చూడవచ్చు.
ఈ పోస్టు వాట్సాప్ లో కూడా వైరల్ అవుతూ ఉంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వార్తాపత్రిక క్లిప్పింగ్ డిజిటల్‌గా రూపొందించారు.
మేము వార్తాపత్రికకు సంబంధించిన నివేదికల గురించి మేము ఎలాంటి కథనాన్ని కూడా కనుగొనలేకపోయాము. అరవింద్ కేజ్రీవాల్ గురించి ఇలాంటి ఆరోపణలు గతంలో వచ్చి ఉంటే మాత్రం గతంలో ప్రముఖంగా ప్రచురించి ఉండేవారు.
ది టెలిగ్రాఫ్, టెలిగ్రామ్ మొదలైనవాటిలో ఈ వార్త గురించి వెతికినా కూడా.. అటువంటి వార్తలను ప్రచురించిన ప్రామాణికమైన నివేదికలను మేము కనుగొనలేకపోయాము.
మరింత వెతికిన తర్వాత, సర్క్యులేషన్లో ఉన్న కథనంలో కొన్ని తేడాలు ఉన్నాయని మేము కనుగొన్నాము. రిపోర్టర్ పేరు లేదా సంఘటన చోటు చేసుకున్న తేదీ అంటూ కూడా లేదు. వార్తాపత్రికలకు సంబంధించిన క్లిప్పింగ్ జనరేటర్ అయిన ‘Fodey.com’ అనే వెబ్‌సైట్‌ను ఉపయోగించి కథనాన్ని ఎడిట్ చేశారని మేము గుర్తించాం.
Fodey.com వెబ్‌సైట్‌ని ఉపయోగించి తెలుగుపోస్ట్ సృష్టించిన వార్తాపత్రిక క్లిప్పింగ్ ఇక్కడ ఉంది. జాగ్రత్తగా గమనించినప్పుడు.. ప్రతి క్లిప్పింగ్‌లో మూడవ కాలమ్‌లో ఒకే పదాలు ఉన్నట్లు మనం చూడవచ్చు. అరవింద్ కేజ్రీవాల్ గురించి వైరల్ అవుతున్న వార్తాపత్రిక క్లిప్పింగ్ డిజిటల్‌గా రూపొందించారని మేము గుర్తించాం. నిజమైన వార్తా కథనం అయితే కాదని మేము నిర్ధారిస్తున్నాం.
ఇదే వాదనతో 2020 సంవత్సరంలో కూడా కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఈ కథనాలను పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు తిరస్కరించాయి.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : A newspaper clipping shows that Delhi CM Arvind Kejriwal was accused of rape when he was an IIT student
Claimed By : Twitter users and whatsapp users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : False
Next Story