ఫ్యాక్ట్ చెక్ - హైదరాబాద్‌లో బాణసంచా దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 35 మంది మృతి చెందలేదు
దీపావళి దీపాలు, తీపి మిఠాయిలూ, దీపాల పండుగ.ఇది అమావాస్య రాత్రి జరుపుకుంటారు, చీకటి ని తరిమికొట్టేందుకు
Claim :
హైదరాబాద్ అబిడ్స్‌లోని పరాస్ బాణసంచా దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 35 మంది మృతి చెందారుFact :
వాదన అబద్దం. ఈ ఘటనలో ఒక మహిళ మాత్రమే గాయపడింది, ఎవరూ చనిపోలేదు
దీపావళి దీపాలు, తీపి మిఠాయిలూ, దీపాల పండుగ.ఇది అమావాస్య రాత్రి జరుపుకుంటారు, చీకటి ని తరిమికొట్టేందుకు రంగురంగుల దీపాలూ, బాణసంచా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. దీపావలి రోజున అన్ని వయసుల వారినీ ఆకర్షించేది బాణసంచా. చిన్నపిల్లలు, యువకులు లేదా వృద్ధులు అనే తేడా లేకుండా, ప్రతి ఒక్కరూ మెరిసే బాణసంచా కాల్చడం ఆనందిస్తారు. ఈ సంవత్సరం దీపావళి వేడుకల సందర్భంగా భారీ శబ్ధాలు పుట్టించే బాణసంచా వాడకంపై హైదరాబాద్ సిటీ పోలీసులు నిషేధం విధించారు. దీపావళి రోజు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే పౌరులు బానాసంచా కాల్చవచ్చని పోలీసులు తెలిపారు.
పండుగకు ముందు నగరంలో ఎక్కడ చూసినా తాత్కాలిక బాణసంచా దుకాణాలు దర్శనమిస్తున్నాయి, వీటిలో ప్రజలు పటాకులు కొనుగోలు చేస్తున్నారు. అయితే పండుగకు కొన్ని రోజుల ముందు, ఆదివారం రాత్రి హైదరాబాద్ అబిడ్స్‌లోని పారస్ బాణాసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది, ఫలితంగా చాలా మంది ప్రమాదం లో చిక్కుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఐదు ఫైరింజన్లతో వచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
అయితే వీటన్నింటి మధ్య, హైదరాబాద్‌లోని బాణసంచా కర్మాగారంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 35 మంది ప్రాణాలు కోల్పోయారని ఇన్స్టాగ్రామ్ వినియోగదారుడు ఈ వైరల్ వీడియోను పంచుకున్నాడు. హిందీలో క్యాప్షన్ ఉంది, అనువదించగా, "దేవుడు వారికి శాంతిని ప్రసాదించుగాక, బాణసంచా ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి".
ఫ్యాక్ట్ చెక్:
వాదన అబద్దం. పారస్ బాణాసంచా దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదం గురించిన వార్తల కోసం వెతికినప్పుడు, మాకు అనేక మీడియా నివేదికలు లభించాయి.
ఎకనామిక్టైమ్స్ నివేదిక ప్రకారం, అక్టోబర్ 27న హైదరాబాద్ సుల్తాన్ బజార్ ప్రాంతంలోని పారస్ బాణసంచా దుకాణం లో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు వ్యాపించకుండా ఆపాయి. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
టైమ్స్ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, నాలుగు అగ్నిమాపక యంత్రాలు ప్రదేశానికి చేరుకున్నాయి. అయితే క్రాకర్లు పేలుతుండడంతో పరిస్థితి సవాలుగా మారింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాగా, ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. లైసెన్స్ లేకుండా అక్రమంగా దుకాణం నడుపుతున్నట్లు పోలీసులు నిర్ధారించారని ఇండియా టుడే నివేదిక పేర్కొంది.
“షాప్‌కి సర్టిఫికేట్ లేదు. అది అక్రమ దుకాణం. మేము వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము, ”అని ఇండియా టుడే సుల్తాన్ బజార్ అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ కె శంకర్‌ని ఉటంకించారు.
న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, అబిడ్స్‌లోని బాణాసంచా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం జరిగిన ఒక రోజు తర్వాత, సుల్తాన్ బజార్ పోలీసులు పరాస్ బాణసంచా మరియు దాని యజమాని గురువిందర్ సింగ్, 33, అనుమతులు పొందకుండా దుకాణాన్ని నడుపుతున్నందుకు కేసు నమోదు చేశారు. "జిహెచ్ఎంసి, అగ్నిమాపక శాఖ నుండి అవసరమైన అనుమతులు, ఇరుగుపొరుగు నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, స్టోర్ యొక్క మునుపటి రికార్డులు, ఇతర పత్రాలతో పాటు స్టోర్ తీసుకోలేదు" అని సుల్తాన్ బజార్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్ఓ) శ్రీనివాసా చారి ట్ణీఏ కి చెప్పారు.
ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో అబిడ్స్‌లోని హనుమాన్ టేకిడిలోని బాణాసంచా దుకాణంలో మంటలు చెలరేగాయి. పలువురు కస్టమర్లు, సిబ్బంది దుకాణం నుంచి బయటకు వచ్చేసరికే మంటలు సమీపంలోని రెస్టారెంట్‌కు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో స్టోర్‌కు సమీపంలో ఉన్న తాజా అనే రెస్టారెంట్లో ఉన్న మహిళను రక్షించేలోపే ఆమె చేతికి గాయాలయ్యాయి. “అగ్ని వల్ల బాధితురాలు పద్మజకు 10% కాలిన గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. దాదాపు ఏడెనిమిది వాహనాలు కూడా అగ్నికి ఆహుతైనట్లు సమాచారం.
ఈ ఘటన లో ఎవరూ మరణించలేదని హిందూస్తాన్ టైమ్స్ నివేదిక నిర్ధారించింది. ఏదేమైనా, ఈ సంఘటన బాణాసంచా దుకాణాల వద్ద ఉన్న భద్రతా ప్రోటోకాల్‌ల గురించి తీవ్రమైన ఆందోళనలను లేవనెత్తిందని ఈ నివేదిక తెలిపింది. సుల్తాన్ బజార్ ఏసీపీ కే శంకర్ ఈ ఘటన గురించి తెలిపిన వివరాలు ఇక్కడ చూడొచ్చు.
కనుక, ఈ అగ్ని ప్రమాదంలో 35 మంది మరణించారనే వాదన అబద్ధం. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.