Fri Nov 22 2024 15:48:48 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: అన్నమయ్య జిల్లాలో ఆంజనేయ స్వామి ఆలయాన్ని ధ్వంసం చేసింది ఇతర మతస్థులు కాదు
సల్మాన్ సలీం ఠాకూర్ అలియాస్ సల్మాన్ అనే వ్యక్తి శ్రీ ముత్యాలమ్మ ఆలయంలోని ఆలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో సికింద్రాబాద్
Claim :
ఇతర మతానికి చెందిన వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని ధ్వంసం చేశారుFact :
హనుమాన్ ఆలయ విధ్వంసంలో మతపరమైన కోణం లేదు. వ్యక్తిగత కక్షల కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుంది.
సికింద్రాబాద్ ప్రాంతంలో సల్మాన్ సలీం ఠాకూర్ అలియాస్ సల్మాన్ అనే వ్యక్తి శ్రీ ముత్యాలమ్మ ఆలయంలోని ఆలయంలోని విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయం సమీపంలోని ముత్యాలమ్మ ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించి అమ్మవారి విగ్రహాన్ని అపవిత్రం చేశారు. అందుకు సంబంధించిన విజువల్స్ సీసీటీవీలో వైరల్ కూడా అయ్యాయి. ఈ ఘటన కారణంగా అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్థానిక నివాసితులు, దుకాణదారులు, ఉద్యమకారులు నిరసనలకు దిగారు. ఈ నిరసనల్లో వేలాది మంది పాల్గొన్నారు. నిరసనలు కాస్తా ఘర్షణలకు కారణమవ్వడంతో పోలీసులు లాఠీఛార్జ్ కూడా చేసారు.
ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే ఆంధ్రప్రదేశ్లో మరో ఆలయ ధ్వంసం ఘటన వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలోని శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని కొందరు కూల్చివేశారు. ఈ ఆలయం ములకచెరువు మండలం కదిరినాథునికోట గ్రామంలో 3 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో ఉంది. ఆలయ ద్వారం, గోడలతో సహా కూల్చివేశారు. ఈ ఘటనను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్గా తీసుకున్నారు. సమగ్ర విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
దెబ్బతిన్న ఆలయాన్ని చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణకు చెందిన ఇస్లామిక్ జిహాదీలు ఆలయాన్ని ధ్వంసం చేశారనే కథనంతో X లో పోస్టులు షేర్ చేశారు. “हृदयविदारक आंध्र प्रदेश के चित्तूर जिले के मोलाकालचेरुवु में कुछ उपद्रवियों ने हनुमान मंदिर में तोड़फोड़ की। तेलंगाना में इज़लामवादी जिहादी और आंध्रप्रदेश में धर्मांतरण माफिया यह कारनामे कर रहा हैं और शांति को नष्ट कर रहा हैं।“ అంటూ హిందీలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. “హృదయ విదారకంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మలకలచెరువులోని హనుమాన్ ఆలయాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. తెలంగాణలో ఇస్లామిక్ జిహాదీలు, ఆంధ్రప్రదేశ్లో మతమార్పిడి మాఫియాలు ఇలాంటివి చేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయి. " అంటూ పోస్టులు పెట్టారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. అన్నమయ్య జిల్లాలో ఆలయం ధ్వంసం ఘటనలో మతపరమైన కోణం లేదు.
మేము వీడియో నుండి కీఫ్రేమ్లను తీసుకుని Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ ను నిర్వహించగా.. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అనేక మీడియా నివేదికలను కనుగొన్నాము. ప్రజాశక్తిలో ప్రచురితమైన కథనం ప్రకారం, హరినాథ్ యాదవ్, విద్యా సాగర్ ఇద్దరూ అర్చకులుగా ఉన్నారు. ఆర్థిక లావాదేవీల వివాదం కారణంగా ఈ సంఘటన జరిగింది. సమీపంలోని మరో ఆలయ పూజారి హరినాథ్ యాదవ్ పేలుడు పదార్థాలను ఉపయోగించి ఆలయాన్ని పేల్చివేశారు. ఆలయాన్ని కూల్చివేసి, ఆలయ ప్రధాన పూజారి విద్యాసాగర్ను తొలగించాలని హరినాథ్ పథకం పన్నాడు.
తెలంగాణ టుడేలో వచ్చిన కథనం ప్రకారం, హరినాథ్ యాదవ్ ఆదాయాన్ని పొందడానికి అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలని భావించాడు, కాని పూజారి విద్యాసాగర్ అందుకు అంగీకరించలేదు. దీంతో కోపోద్రిక్తుడైన హరినాథ్ అక్కడి నుంచి పూజారి పారిపోయేలా చేయాలని భావించి ఆలయాన్ని పేల్చివేశాడు. నిందితుడు తన పథకం ప్రకారం అభయ ఆంజనేయ స్వామి ఆలయం కింద నిధి ఉందని ప్రచారం చేశాడు.
హరినాథ్ మరో ఐదుగురితో కలిసి కుట్ర పన్నారని, పేలుడు పదార్థాలతో ఆలయాన్ని పేల్చివేసినట్లు పోలీసులు గుర్తించారు. వర్షం కారణంగా పేలుడు పదార్ధాలు సరిగ్గా పేలలేదు, కాబట్టి ఆలయం ఒక వైపునకు ఒరిగిపోయింది.
ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఇతర వర్గాలకు చెందిన వారు ధ్వంసం చేశారనే వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim : ఇతర మతానికి చెందిన వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని ధ్వంసం చేశారు
Claimed By : Twitter user
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : False
Next Story