Fri Nov 22 2024 22:19:47 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: భారత్- చైనా సైన్యాల మధ్య ఇటీవల గొడవలు జరిగాయని వైరల్ అవుతున్న వాదనల్లో నిజం లేదు.
భారతదేశం- చైనా మధ్య గత కొన్ని సంవత్సరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంబడి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కాస్తా ఘర్షణలకు దారితీశాయి. తూర్పు లడఖ్‌లో కూడా ఇరు దేశాల సైనికుల మధ్య గొడవలు జరిగిన సంగతి తెలిసిందే
Claim :
లడఖ్‌లోని బర్ట్సే ప్రాంతంలో భారత్ - చైనా దళాల మధ్య ఘర్షణలు జరిగాయి.Fact :
భారతదేశం, చైనా సైనికుల మధ్య ఘర్షణలు జరిగాయనే వాదనలను భారత సైన్యం తోసిపుచ్చింది
భారతదేశం- చైనా మధ్య గత కొన్ని సంవత్సరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంబడి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కాస్తా ఘర్షణలకు దారితీశాయి. తూర్పు లడఖ్‌లో కూడా ఇరు దేశాల సైనికుల మధ్య గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. భారతదేశాన్ని చైనా కవ్విస్తూ వెళుతోంది. భారత్ కూడా చైనా కుట్రలను తిప్పికొడుతూ ఉంది. ఇరు దేశాలు గతంలో పెద్ద ఎత్తున సైన్యాన్ని మొహరించాయి. అయితే రెండు దేశాల మధ్య వరుసగా చర్చలు జరగడంతో పరిస్థితి ప్రస్తుతం ప్రశాంతంగా మారింది. అయితే భారత భూభాగానికి సంబంధించిన మ్యాప్‌పై చైనా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.
వీటన్నింటి మధ్య, తూర్పు లడఖ్‌లోని బర్స్ట్సే ప్రాంతంలో భారత సైన్యం, PLA దళాల మధ్య ఘర్షణ జరిగిందని పలువురు వినియోగదారులు X లో పోస్ట్ చేశారు. లడఖ్‌లోని పిల్లర్ పాయింట్ 12 వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య గొడవ జరిగిందని పలువురు పోస్టుల్లో చెబుతున్నారు. పరిస్థితి మరింత దిగజారిపోయే అవకాశం ఉండంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదు. ఇవన్నీ అసత్య కథనాలు అంటూ ఇండియన్ ఆర్మీ తప్పుడు కథనాలను ఖండిస్తూ ప్రకటనను విడుదల చేసింది.
ADG PI - భారత సైన్యం X (ట్విట్టర్)లో భారత సైన్యం, చైనా సైనికుల మధ్య గొడవలు జరిగిన సంఘటన ఏదీ ఇటీవల చోటు చేసుకోలేదని తెలిపింది. సోషల్ మీడియాలో ప్రచారంలో వైరల్ అవుతున్నది తప్పుడు సమాచారం అంటూ ఖండించింది. నకిలీ సందేశాల పట్ల జాగ్రత్త వహించాలని ప్రజలను కోరింది.
PIB ఫాక్ట్ చెక్ ఇండియా ఆర్మీ ప్రకటనను రీపోస్ట్ చేసి.. వైరల్ కథనాల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది.
తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి భారత సైనికులు, చైనా సైనికుల మధ్య గొడవ జరిగిందని పేర్కొంటూ సోషల్ మీడియా నివేదికలను భారత సైన్యం ఖండించిందని జాగరన్ ఇంగ్లీష్ వెబ్సైట్ నివేదికలో పేర్కొంది. LACలో అశాంతి కొత్త సమస్య కాదని కూడా కథనం పేర్కొంది. 2020లో తూర్పు లడఖ్‌లో ఇరు దేశాల సైన్యాలు పరస్పరం తలపడ్డాయి. గాల్వాన్ లోయలో వారి మధ్య ఘర్షణ కూడా జరిగింది. 1975 తర్వాత ఇరుపక్షాల మధ్య ఇదే ఘోరమైన ఘర్షణ. సరిహద్దు వద్ద ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరుపక్షాలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. 2023 ఆగస్ట్‌లో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధినేత జీ జిన్‌పింగ్‌తో మాట్లాడారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలు చేస్తామని ఇద్దరు నేతలు అంగీకరించారు.
కాబట్టి, ఇటీవల చైనా- భారత్ సైన్యాల మధ్య గొడవలు జరిగాయి అంటూ వైరల్ అవుతున్న వాదనల్లో ఎలాంటి నిజం లేదు. అలాంటి సంఘటన ఏదీ ఇటీవల జరగలేదు
Claim : లడఖ్‌లోని బర్ట్సే ప్రాంతంలో భారత్ - చైనా దళాల మధ్య ఘర్షణలు జరిగాయి.
Claimed By : Twitter users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Twitter
Fact Check : False
Next Story