Fri Dec 20 2024 18:33:40 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: వినేష్ ఫోగాట్ జీవిత చరిత్ర ఆధారంగా ప్రియాంక చోప్రా దంగల్ 2 సినిమాను తీస్తున్నట్లు ప్రకటించలేదు.
ప్రియాంక చోప్రా లీడ్ రోల్ లో వినేష్ ఫోగాట్ పై దంగల్ 2
Claim :
ప్రియాంక చోప్రా లీడ్ రోల్ లో వినేష్ ఫోగాట్ పై దంగల్ 2 సినిమా చేస్తున్నారుFact :
ఇది కేవలం ఫ్యాన్ ఎడిట్. ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు
ఒలింపిక్స్ లో వినేష్ ఫోగాట్ ఒలింపిక్స్ పతకానికి సంబంధించి ఊహించని పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె రెజ్లింగ్ ఫైనల్ కు చేరగా.. కేవలం 100 గ్రాములు బరువు అధికంగా ఉందంటూ ఆమెను డిస్క్వాలిఫై చేశారు. దీంతో ఆమె మాత్రమే కాదు.. దేశం మొత్తం నిరాశ చెందింది. అయితే ఆమె సాధించింది గోల్డ్ తో సమానమంటూ దేశ ప్రజలు మద్దతు తెలిపారు.
పతకం చేజారిపోయిందని నిరుత్సాహానికి గురైన వినేష్ ఒలింపిక్స్ నుండి అనర్హత వేటు పడిన ఒక రోజు తర్వాత రెజ్లింగ్ నుండి రిటైర్మెంట్ ప్రకటించేసి అందరికీ షాక్ ఇచ్చింది. "బహుశా వేర్వేరు పరిస్థితులలో, నేను 2032 వరకు ఆడుతానని భావించాను.. నాలో పోరాటం, కుస్తీ ఎప్పుడూ ఉంటాయి. నా భవిష్యత్తు ఎలా ఉంటుందో.. తదుపరి ప్రయాణంలో నాకు ఏమి ఎదురవుతుందో నేను ఊహించలేను, కానీ నేను విశ్వసించే దాని కోసం, సరైన విషయం కోసం నేను ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటానని ఖచ్చితంగా అనుకుంటున్నాను" అని ఆమె ఎమోషనల్ పోస్టు పెట్టింది.
వినేష్ ఫోగాట్ కోచ్, సిబ్బంది ఆమె బరువు తగ్గడానికి ఎన్నో పద్ధతులను అనుసరించారు. వినేష్ ఫోగాట్ కోచ్ పూలర్ అకోస్ మాట్లాడుతూ.. ఒలింపిక్ ఫైనల్ కు ముందు రోజు రాత్రి వినేష్ బరువు తగ్గేందుకు దాదాపు అయిదున్నర గంటల పాటు వివిధ రకాల కఠిన ప్రయత్నాలు చేసినట్లు తెలిపారు. ఈ సమయంలో ప్రాక్టీస్ తర్వాత వినేష్ ఫోగాట్ చనిపోతుందేమోనని భయపడ్డామని అన్నారు. సెమీ ఫైనల్ తర్వాత ఆమె 2.7 కిలోల బరువు ఎక్కువగా ఉండగా, ఒక గంట 20 నిమిషాలు వ్యాయామం చేసిందన్నారు. కానీ అప్పటికీ 1.5 కిలోలు బరువు ఎక్కువగా ఉందని దీంతో అర్ధరాత్రి నుండి వేకువజాము 5.30 వరకూ వినేశ్ వివిధ కార్డియో మేషీన్లు, రెజ్లింగ్ కదలికలపై పని చేసిందన్నారు. ఒక గంటలో కొన్ని నిమిషాలు విరామం తీసుకుని 40 – 45 నిమిషాల పాటు కసరత్తులు చేస్తూనే ఉందన్నారు. చివరి గంటలో మొత్తం చెమటతో తడిసిపోయిందని.. ఆమె చనిపోతుందేమోనని భయపడినట్లు కోచ్ పూలర్ అకోస్ తెలిపారు.
భారతదేశానికి చేరుకున్న ఆమెకు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. పారిస్ ఒలింపిక్స్లో ఫైనల్స్కు చేరినా కూడా పతకం రాలేదనే బాధ వినేష్ ముఖంలో స్పష్టంగా కనిపించింది. ఆమె భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. వినేష్కు స్వాగతం పలికేందుకు రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుని ఘన స్వాగతం పలికారు. వినేష్ బయటకు రాగానే ఇద్దరూ ఆమెను కౌగిలించుకున్నారు.
ఇంతలో ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. వినేష్ ఫోగట్ జీవిత చరిత్రకు సంబంధించి సినిమా రాబోతున్నట్లు తెలిపారు. రెజ్లింగ్ రింగ్ లో ప్రముఖ నటి ప్రియాంక చోప్రా జోనస్ ఉండడాన్ని మనం చూడొచ్చు. అలాగే పోలీసులు పట్టుకున్నట్లు.. గట్టిగా అరుస్తున్నట్లు కూడా ఆ పోస్టర్ లో చూడొచ్చు.

పోస్టర్లు మాత్రమే కాదు యూట్యూబ్ లో వీడియోలను కూడా వైరల్ చేస్తున్నారు. ఆమిర్ ఖాన్ దంగల్ సినిమా తీశారని.. ఆయన ఇప్పుడు ప్రియాంక చోప్రాను పెట్టి దంగల్ 2 సినిమా తీస్తున్నారంటూ యూట్యూబ్ వీడియోల్లో తెలిపారు.
ఫ్యాక్ట్ చెకింగ్:
ప్రియాంక చోప్రా దంగల్-2 లో నటిస్తున్నట్లు ఎలాంటి అధికారిక ప్రకటన కూడా రాలేదు. వైరల్ అవుతున్న పోస్టు ఓ ఫ్యాన్ ఎడిట్.
వైరల్ అవుతున్న ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. anmolmalikofficial అనే ఖాతాలో ఈ పోస్టర్ ను గమనించాం. ఆ పోస్టర్ కింద పోస్టర్ బై 'అనుమోల్ మాలిక్' అని ఉండడాన్ని గమనించవచ్చు. దీన్ని బట్టి కేవలం పోస్టర్ ను అతడు డిజైన్ చేశాడని తెలుసుకున్నాం.
సాధారణంగా ఏ సినిమాకు సంబంధించిన పోస్టర్లను గమనిస్తే.. ఆ పోస్టర్లలో నిర్మాత, దర్శకుడు.. టెక్నీషియన్స్ కు సంబంధించిన పేర్లు ఉంటాయి. కానీ ఈ వైరల్ పోస్టర్ లో అలాంటి పోస్టులు ఏవీ లేవు. కేవలం 2025 లో సినిమా విడుదల అవుతుంది అని ఉంది.
దీన్ని బట్టి ప్రియాంక చోప్రా ఈ సినిమా చేయడం లేదు.. వినేష్ ఫోగట్ పాత్రను పోషించడం లేదు. కేవలం ఒక వినియోగదారు ఈ పోస్టర్ ని సృష్టించగా.. అది కాస్తా తక్కువ సమయంలో వైరల్ అయిపోయింది.
మేము మరింత సమాచారం సేకరించడం కోసం ప్రియాంక చోప్రా జోనాస్ సోషల్ మీడియా ఖాతాలను వెతికాం. ఎక్కడా కూడా ఈ పోస్టర్ ను ప్రియాంక చోప్రా పోస్ట్ చేయలేదు.
ట్విట్టర్ లో ఆగస్టు 15న ప్రియాంక చోప్రా భారతీయులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపింది. అంతకు ముందు పోస్టుల్లో తన సినిమాలు, తన భర్త నిక్ జోనాస్ కు సంబంధించిన వార్తలను పంచుకుంది. అంతే తప్ప ఎక్కడా కూడా ఈ పోస్టర్ ను పోస్ట్ చేయలేదు.
ప్రియాంక చోప్రా దంగల్-2 చేస్తున్నట్లు ఎలాంటి అధికారిక ప్రకటన లేదని.. టీవీ 9 భరతవర్ష హిందీ వెబ్సైట్ లో కథనం కూడా తెలిపింది.
ఇక దంగల్ పార్ట్ 1 తీసిన ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ కు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను, వెబ్ సైట్లను వెతికినా కూడా ఈ పోస్టర్ కానీ.. ప్రియాంక చోప్రాతో దంగల్ 2 తీస్తున్నట్లు ఎలాంటి ప్రకటన కూడా రాలేదు. కాబట్టి.. ఇదొక ఫ్యాన్ మేడ్ పోస్టర్ అని తేలింది.
కాబట్టి, వైరల్ అవుతున్న పోస్టర్ కేవలం ఒక అభిమాని తయారు చేసింది మాత్రమే. ప్రియాంక చోప్రా దంగల్-2 సినిమా చేస్తున్నట్లు ఎలాంటి ప్రకటన రాలేదు.
Claim : ప్రియాంక చోప్రా లీడ్ రోల్ లో వినేష్ ఫోగాట్ పై దంగల్ 2 సినిమా చేస్తున్నారు
Claimed By : social media users
Claim Reviewed By : Telugupost
Claim Source : social media
Fact Check : False
Next Story