నిజ నిర్ధారణ: లేదు, రాష్ట్రపతి భవన్లో నాన్ వెజ్ ను నిషేధించలేదు
రాష్ట్రపతి భవన్, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన ప్రదేశం. ఇప్పుడు భారతదేశం యొక్క 15వ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్కడ ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే.
రాష్ట్రపతి భవన్, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన ప్రదేశం. ఇప్పుడు భారతదేశం యొక్క 15వ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అక్కడ ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే.
గిరిజన సంతతికి చెందిన మొదటి రాష్ట్రపతి కావడం తో, ఆమె సాంస్కృతిక నేపధ్యం, నిరాడంబరమైన జీవనశైలి చూసి రాష్ట్రపతి భవన్లో ఆమె చేయబోయే మార్పుల పై అందరికీ ఆసక్తిని కలిగించింది, ఇది అనేక పుకార్లకు దారితీసింది.
రాష్ట్రపతి భవన్‌లోని మెనూ పూర్తిగా శాఖాహారంగా మారిందని, అతిథులకు కూడా నాన్‌వెజ్ ఫుడ్‌ను నిషేధించారంటూ అటువంటిదే ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా షేర్ అవుతోంది. "రాష్ట్రపతి భవన్లో ఎలాంటి మాంసాహార విందులు లేదా పానీయాలపై నిషేధం" అని పోస్ట్ పేర్కొంది.
వైరల్ పోస్ట్‌ల ఆర్కైవ్ లింకు ను ఇక్కడ చూడొచ్చు:
నిజ నిర్ధారణ:
ప్రస్తుత భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచనల మేరకు రాష్ట్రపతి భవన్లో మాంసాహారం నిషేధించబడుతుందన్న వాదన అవాస్తవం.
శోధించినప్పుడు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు లేకుండా శాఖాహార భజనం మాత్రమే తీసుకుంటారనే కథనాలు దొరికాయి, కానీ ఇకపై విందుల్లో కూడా మాంసాహారం అందించకూడదని రాష్ట్రపతి కొత్త ఉత్తరువులు ఇచ్చినట్టు ఎక్కడా ప్రస్తావించలేదు. ఇటీవలి కాలంలో ఈ దిశగా ఎలాంటి పత్రికా ప్రకటన పిఐబి లో కూడా వెలువడలేదు.
https://pib.gov.in/allRel.aspx
నివేదికల ప్రకారం, రాష్ట్రపతి ముర్ము 2006లో శాఖాహారిగా మారారు, వెల్లుల్లి, ఉల్లిపాయ లేని సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకుంటారు.
రాష్ట్రపతి భవన్‌లోని మెనూలో ఒడిశా వంటకాలు అంతర్భాగంగా ఉండబోతున్నాయని కూడా వార్తలు వచ్చాయి. ముర్మూ కి ఇష్టమైన 'పఖాలా', సుగంధ ద్రవ్యాలతో నీటిలో నానపెట్టి వండిన అన్నం. అలాగే, మునగ ఆకులతో చేసిన సజన సాగా, బంగాళాదుంపల మెత్తని ఆలూ కూర వంటి వంటకాలు రాష్ట్రపతి భవన్ మెనూలో భాగం కానున్నాయి అంటూ ఎన్నో కధనాలు వచ్చాయి.
https://curlytales.com/rashtrapati-bhavan-to-include-droupadi-murmus-favourite-dish-pakhala-in-menu/
ఆజ్‌తక్ లో ప్రచురించబడిన ఒక కథనం ప్రకారం, రాష్ట్రపతి భవన్ లో వచ్చిన స్వదేశీ, విదేశీ అతిథుల ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని ఆహారాన్ని సిద్ధం చేస్తారు. అక్కడ ఏదైనా ప్రత్యేకమైన ఆహారాన్ని తినమని బలవంతం ఉండదు.
పిఐబి ఫ్యాక్ట్ చెక్ కూడా ఈ వాదన అవాస్తవం అని, రాష్ట్రపతి భవన్లో నాన్ వెజ్ లేదా డ్రింక్స్‌పై అలాంటి నిషేధం లేదని ట్విట్టర్లో స్పష్టం చేసింది.
వారి ట్వీట్:
కాబట్టి, రాష్ట్రపతి భవన్లో మాంసాహారాన్ని నిషేధిస్తున్నారనే వాదన అబద్దం.