Fri Nov 22 2024 01:18:49 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: దేశవ్యాప్త అల్లర్లు, హింసకు అవకాశం పొంచి ఉందని ప్రధాని మోదీ ఇటీవల వ్యాఖ్యలు చేయలేదు
ఇటీవల బహిరంగ ప్రసంగం సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగంలో
Claim :
ఇటీవల బహిరంగ ప్రసంగం సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగంలో "దేశవ్యాప్త అల్లర్లు, హింసకు అవకాశం పొంచి ఉంది" అంటూ హెచ్చరించారు. సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను షేర్ చేయాలంటూ ఇతరులను ప్రోత్సహిస్తున్నారు.Fact :
సెప్టెంబరు 2023లో, ప్రధాని మోదీ ఇండియా కూటమి గురించి ఆరోపణలు చేశారు. వారు దేశాన్ని విభజించడానికి, హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
బంగ్లాదేశ్ లో ఊహించని పరిణామాల మధ్య బంగ్లాదేశ్ లో ప్రభుత్వం మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుత బంగ్లాదేశ్ నాయకుడు ముహమ్మద్ యూనస్ ఆగస్టు 13న దేశంలోని హిందూ బెంగాలీ నాయకులతో సమావేశాన్ని నిర్వహించారు.బంగ్లాదేశ్ లో రాజకీయ గందరగోళం మధ్య అనేక హిందూ దేవాలయాలు, గృహాలు, వ్యాపారాలను లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టించారు.
ఆగస్టు 14, 2024న ది హిందుస్థాన్ టైమ్స్ ప్రచురించిన కథనం ప్రకారం. “వారు (మైనారిటీలు) ఈ దేశ ప్రజలు కాదా? మీరు (విద్యార్థులు) ఈ దేశాన్ని రక్షించగలిగారు. మీరు కొన్ని కుటుంబాలను రక్షించలేరా? ఎవరూ వారికి హాని చేయకూడదు. వారు నా సోదరులు.. మేము కలిసి పోరాడాము, మేము కలిసి ఉంటాము, ”అని నోబెల్ బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనస్ అన్నారు. రంగ్‌పూర్ నగరంలోని బేగం రోకేయా విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో ఈ వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడులు దేశ పురోగతిని అణగదొక్కాలని కోరుకునే వ్యక్తులు చేస్తున్న 'విధ్వంసం' కావచ్చునని అన్నారు. “మీ ప్రయత్నాలను ఫలించకుండా చేయడానికి చాలా మంది అడ్డుగా నిలబడి ఉన్నారు” అని చెప్పుకొచ్చారు.
బంగ్లాదేశ్ హిందూ బౌద్ధ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్, బంగ్లాదేశ్ పూజ ఉద్జపన్ పరిషత్ అనే రెండు హిందూ సంస్థల ప్రకారం.. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయినప్పటి నుండి 52 జిల్లాల్లో మైనారిటీ వర్గాలకు చెందిన సభ్యులపై 205 దాడులు జరిగాయి. విధ్వంసం కాకుండా, హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీకి అనుబంధంగా ఉన్న ఇద్దరు హిందూ నాయకులను చంపేశారు.
బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో కూడా నిరసనలు చెలరేగాయి. వీధి వ్యాపారుల నుంచి గుర్తింపు పత్రాలు, ఆధార్ కార్డులు కావాలని స్థానికులు డిమాండ్ చేస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి సంబంధించిన ఓ వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో.. మోదీ మాట్లాడుతూ.. “ఈ రోజు, ఈ వ్యక్తులు బహిరంగంగా మాట్లాడటం, బహిరంగంగా దాడి చేయడం ప్రారంభించారు. రేపు మాపై దాడులను మరింత ఉధృతం చేస్తారు. ప్రతి సనాతనీ, మన దేశాన్ని, నేలను, ప్రజలను ప్రేమించే ప్రతి వ్యక్తి అప్రమత్తంగా ఉండాలి. వారు సనాతనాన్ని నిర్మూలించడం, మన దేశాన్ని వెనక్కు నెట్టడం లక్ష్యంగా పెట్టుకున్నారు." అని అందులో చెప్పారు.
సోషల్ మీడియా వినియోగదారులు “ప్రధానమంత్రి నుండి ప్రజలకు హెచ్చరిక” అనే శీర్షికతో వీడియోను పలువురు షేర్ చేశారు. "దేశవ్యాప్తంగా రక్తపాత అల్లర్లు జరిగే అవకాశం ఉంది. సంక్షోభం మొదలవ్వచ్చు. వీడియోను త్వరగా వైరల్ చేయండి. అత్యంత అప్రమత్తత అవసరం. జై హింద్.. వందేమాతరం” అంటూ పలువురు పోస్టులను వైరల్ చేస్తున్నారు.

ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము కనుగొన్నాము. వీడియో ఇటీవలిది కాదు.
వైరల్ వీడియోలో ప్రధాని మోదీ ఇండియా కూటమి గురించి వ్యాఖ్యలు చేశారు.
రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. సెప్టెంబర్ 14, 2023న ANI సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను పోస్ట్ చేశారు. ANI క్యాప్షన్‌లో “ప్రతిపక్ష కూటమి అయినా ఇండియా కూటమికి నాయకుడు లేడు.. వారు భారతదేశ సంస్కృతిపై దాడి చేయడానికి రహస్య అజెండాను కూడా నిర్ణయించుకున్నారు. 'సనాతన్' సంస్కృతిని అంతం చేయడానికి భారత కూటమి ఒక తీర్మానంతో వచ్చింది." అని అందులో ఉంది.

కాబట్టి, వైరల్ వీడియో 2023 నుండి ఇంటర్నెట్లో ఉందని తేలింది.
సెర్చ్ చేస్తున్న సమయంలో, మేము సెప్టెంబర్ 14, 2023న టైమ్స్ ఆఫ్ ఇండియా యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేసిన లైవ్ స్ట్రీమ్ వీడియోను కూడా కనుగొన్నాము: “లైవ్ | పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ." అంటూ ఈ వీడియోను స్ట్రీమ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ ను దశాబ్దాలుగా పాలించినప్పటికీ, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆర్థికంగా వెనుకబడి ఉందని అన్నారు. బీజేపీ హయాంలో ప్రతి పల్లెకు కొత్త రోడ్లు నిర్మించామని, ప్రతి ఇంటికి కరెంటు వచ్చిందన్నారు. సమీప భవిష్యత్తులో మధ్యప్రదేశ్ పారిశ్రామికీకరణలో కొత్త శిఖరాలకు చేరుకుంటుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
50.01 టైమ్‌స్టాంప్ వద్ద.. దేశాన్ని అనేక భాగాలుగా విభజించడానికి INDI కూటమి ఎలా ప్రయత్నిస్తుందో ప్రధాని మోదీ చెప్పడం మనం వినవచ్చు. ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడం వల్లే కూటమి తమ నాయకుడిని కూడా నిర్ణయించలేదని ఆయన అన్నారు. ఈ కూటమి ఇటీవల ముంబైలో ఒక సమావేశాన్ని నిర్వహించిందని, ఈ సందర్భంగా వారు భారతీయ సంస్కృతి, భారతీయుల విశ్వాసంపై దాడి చేయడానికి ఎజెండాను ఏర్పాటు చేశారని అన్నారు. కూటమి దేశాన్ని కలిపి ఉంచే ప్రతిదాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు.
55.23 టైమ్ స్టాంప్ వద్ద మేము వైరల్ భాగాన్ని కనుగొన్నాము.
తన ప్రసంగం చివరిలో, మోదీ మాట్లాడుతూ "ఢిల్లీ నుండి భోపాల్ వరకు, మేము ప్రతి భారతీయుడిని వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించాం. కోవిడ్-19 మహమ్మారి సమయంలో కూడా మా ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉచిత టీకా డ్రైవ్ నిర్వహించింది. 80 మిలియన్లకు పైగా ప్రజలకు రేషన్లు, ఆహారం సక్రమంగా అందుబాటులో ఉండేలా చూస్తున్నాం." అని చెప్పారు.
ఆర్గనైజర్ ప్రచురించిన కథనం ప్రకారం.. “రాష్ట్రంలో రూ. 50 వేల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తూ.. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం, రాష్ట్ర ప్రజలు ఎలా ఇబ్బందులు పడ్డారో తెలిపారని.. కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ మండిపడ్డారు." అని ఉంది.
“PM Modi attacks 'INDI Alliance' for its design to 'destroy' Sanatana Dharma" అంటూ బిజినెస్ స్టాండర్డ్ లో కథనాన్ని మేము చూశాం.
Deccan Herald సంస్థ "I.N.D.I.A alliance wants to destroy Sanatan Dharma, alleges PM Modi" అంటూ కథనాన్ని ప్రచురించింది. ఇండియా కూటమి సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని ప్రయత్నించిందంటూ ప్రధాని మోదీ విమర్శించారు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదన ఇటీవలిది కాదని మేము కనుగొన్నాము. సెప్టెంబర్ 2023లో, ప్రధాని మోదీ INDI కూటమి గురించి చేసిన వ్యాఖ్యలు ఇవి. దేశాన్ని విభజించడానికి, హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. దేశవ్యాప్త అల్లర్లు, రక్తపాతం, తీవ్ర సంక్షోభానికి సంబంధించిన ఎటువంటి హెచ్చరికలు మోదీ ఇటీవల జారీ చేయలేదు.
Claim : ఇటీవల బహిరంగ ప్రసంగం సందర్భంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ప్రసంగంలో \"దేశవ్యాప్త అల్లర్లు, హింసకు అవకాశం పొంచి ఉంది\" అంటూ హెచ్చరించారు. సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను షేర్ చేయాలంటూ ఇతరులను ప్రోత్సహిస్తున్నారు.
Claimed By : social media users
Claim Reviewed By : Telugupost
Claim Source : social media
Fact Check : False
Next Story