Mon Dec 23 2024 13:13:22 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: జటాయువు రాకతో వణికిపోతున్న అయోధ్య అంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు.
గరుడ పక్షులు అయోధ్యలో ప్రత్యక్షమయ్యాయనే వాదన
Claim :
గరుడ పక్షులు అయోధ్యకు భారీ ఎత్తున చేరుకున్నాయని.. వాటి రాకతో ప్రజలు వణికిపోతూ ఉన్నారు.Fact :
అయోధ్యలో గరుడ పక్షులు కనిపించాయన్న వాదన అవాస్తవం. వైరల్ వీడియోలో ఉన్నది వివిధ ప్రదేశాలు, వివిధ సందర్భాలలో తీసిన రాబందులకు సంబంధించిన వీడియోలు. ఈ వీడియోలు ఎన్నో సంవత్సరాలుగా ఆన్లైన్లో వైరల్ అవుతూ ఉన్నాయి.
పలు ప్రాంతాలలో రాబంధులు ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఊహించని విధంగా ఈ పక్షులన్నీ.. ఒక్కసారిగా కనిపించడం.. గరుడ పక్షులకు రామాయణంతో సంబంధం ఉండడంతో అయోధ్యలో ప్రజలు భయంతో వణికిపోతున్నారనే వాదనతో ప్రచారం జరుగుతోంది.
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
వైరల్ అవుతున్న వీడియోలోని కీ ఫ్రేమ్స్ ను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. మేము మే 4, 2021న అప్లోడ్ చేసిన "A rare video of Andean Condor." అనే వీడియోను చూశాం. అందులో భారీ పక్షి ఎగరడం మేము గుర్తించాం.
తదుపరి పరిశోధనలో గుడ్డు మౌర్య సర్ప్ మిత్రా ఏప్రిల్ 8, 2023న పోస్ట్ చేసిన రెండవ YouTube వీడియోను కూడా మేము గుర్తించాం. "మొదటిసారిగా, భారీ జటాయు పక్షి, భారతదేశంలో కనుగొనబడిన అతిపెద్ద హిమాలయన్ గ్రిఫ్ఫోన్ రాబందు" అనే అర్థం వచ్చేలా వీడియోను పోస్టు చేశారు. ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్ జిల్లాలో రాబందును గుర్తించి, రక్షించడం గురించి ఆ వీడియోలో ప్రస్తావించారు.
వైరల్ వీడియోలోని మూడవ చిత్రం నవంబర్ 22, 2019న నేషనల్ జియోగ్రాఫిక్ వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లు గుర్తించాం. "'This is a full-blown crisis': Fighting vulture poisoning in Kenya." అనే టైటిల్ తో పోస్టు చేశారు. కెన్యాలో రాబందుకు విషం పెట్టారని.. అది కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడడం చూడవచ్చు అంటూ ఆ వీడియోలో తెలిపారు. విషపూరితమైన హైనా కళేబరాన్ని తినడం ద్వారా రాబందుల ఆరోగ్యం దెబ్బతినిందని.. వాటిని రక్షించే ప్రయత్నాలను చేస్తున్నట్లు ఆ వ్యాసంలో వివరించారు.
అక్టోబర్ 23, 2020న యూట్యూబ్ యూజర్ MCVlogMercy James అప్లోడ్ చేసిన మరో వీడియో కూడా వైరల్ క్లిప్లో ఉంది. ఒరిజినల్ వీడియోలో కేరళలోని సదయమంగళం అడవిలో రాబందును విడిచిపెట్టారని మేము గుర్తించాం.
తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ బృందం, వైరల్ వీడియోలోని ఒక క్లిప్ లో ఏ మాత్రం నిజం లేదని ఇప్పటికే తేల్చి చెప్పింది. ఆ వీడియో 2021 నాటిదని.. రామాయణానికి లేదా అయోధ్యలోని రామ మందిరంలో జరిగే పవిత్రోత్సవానికి ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఈ కింది లింక్ ను మీరు పరిశీలించవచ్చు.
కాబట్టి గరుడ పక్షులు అయోధ్యలో ప్రత్యక్షమయ్యాయనే వాదన అబద్ధమని తేలింది. వైరల్ వీడియో వివిధ ప్రదేశాలలో, వివిధ సందర్భాలలో రాబందులకు సంబంధించిన వీడియోలను చూపిస్తుంది. ఈ వీడియోలు చాలా సంవత్సరాలుగా ఆన్లైన్లో వైరల్ అవుతూ ఉన్నాయి.
Claim : A viral video shows vultures from various locations and contexts, and has been circulating with a claim that Garuda has appeared in Ayodhya
Claimed By : Social media users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social media users
Fact Check : False
Next Story