Wed Apr 02 2025 17:18:16 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: పాత వీడియోలను ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం యమునా నదిని శుభ్రం చేయిస్తున్న వీడియోలుగా ప్రచారం చేస్తున్నారు
ఢిల్లీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే యమునా నదిని

Claim :
ఢిల్లీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే యమునా నదిని శుభ్రం చేస్తోందిFact :
వాలంటీర్లకు సంబంధించిన వీడియోను ఇటీవలిదిగా ప్రచారం చేస్తున్నారు
ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చిన కీలక హామీలలో యమునా నదిని శుద్ధి చేయడం. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే యమునా నదిని శుభ్రం చేస్తామని బీజేపీ తన మేనిఫెస్టోలో పొందు పరిచింది. నదిని పునరుద్దరించడంలో భాగంగా యమునను శుభ్రపరిచి.. ఆ నీటిని సాగు, తాగు నీటికి వినియోగించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేసింది.
మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు, చెత్త పేరుకుపోవడం వల్ల చాలా కాలంగా యమునా నది కలుషితమవుతూ వచ్చింది. యమునా నదిపై 75 శాతం కాలుష్య భారం దేశ రాజధానిలోనే ఉంది. నది ఢిల్లీలోకి ప్రవేశించే చోట తప్ప, ఎక్కడా కూడా ఢిల్లీ స్ట్రెచ్‌లో కనీసం స్నానం చేయడానికి కూడా యమునా నది సరిపోదు. కొన్ని ప్రదేశాలలో కాలుష్య కారకాల సాంద్రత 700 రెట్లు ఎక్కువగా ఉంది. రాబోయే మూడు సంవత్సరాలలో నదిని శుభ్రం చేయాలనే సంకల్పంతో పని చేస్తామని ఢిల్లీ కొత్త ప్రభుత్వం చెబుతోంది. మురుగునీటి శుద్ధి కర్మాగారాలను తిరిగి సిద్ధం చేయడం, నగరంలోని కాలువల నుండి చేరే వ్యర్థాలను అడ్డుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఇంతలో కొందరు వ్యక్తులు నదిలోని చెత్తను బయటకు తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
"यमुना मैया की सफाई
धन्यवाद मोदी जी धन्यवाद रेखा गुप्ता जी " అంటూ కొందరు పోస్టులు పెట్టారు.
యమునా నదిని శుభ్రం చేస్తున్నారని ఈ పోస్టుల ద్వారా తెలిపారు.
వైరల్ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు
ఫ్యాక్ట్ చెకింగ్:
వైరల్ అవుతున్న వీడియో ఇటీవలిది కాదు. ఈ వీడియోకు ఢిల్లీలో ఏర్పడ్డ కొత్త ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. వైరల్ వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.
వైరల్ వీడియోకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ ను తీసుకుని మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేశాం. Instagram వినియోగదారు Earthworri ఈ వీడియోను డిసెంబర్ 29, 2024న పోస్ట్ చేసారని గుర్తించాం. అప్పటికి ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడలేదు.
ఇన్స్టాగ్రామ్ లోని వీడియో, ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో ఒకటేనని స్పష్టంగా తెలుస్తోంది.
ఢిల్లీలోని కాళింది కుంజ్ ఘాట్ వద్ద యమునాను శుభ్రపరిచే ఇతర వీడియోలను ఈ ఖాతాలోని ఇతర వీడియోలలో కూడా చూడవచ్చు.
22 ఫిబ్రవరి 2025న ఎక్స్ యూజర్ యతి శర్మ పోస్ట్‌కి ఎర్త్ వారియర్ ప్రతిస్పాదించారు. ఈ వీడియో తన టీమ్‌కి చెందినదని, 2024 సంవత్సరం నాటిదని తెలిపారు. ఏ రాజకీయ పార్టీతోనూ తమకు సంబంధం లేదని తెలిపారు. గత ఐదేళ్లుగా ఢిల్లీలోని కాళింది కుంజ్ ఘాట్ వద్ద యమునా నదిని శుభ్రపరిచే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఫిబ్రవరి 20న రాంలీలా మైదాన్‌లో బీజేపీకి చెందిన రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటు ప్రవేశ్ వర్మ, ఆశిష్ సూద్, మంజీందర్ సింగ్ సిర్సా, రవీంద్ర ఇంద్రరాజ్ సింగ్, కపిల్ మిశ్రా, డాక్టర్ పంకజ్ కుమార్ సింగ్ కూడా క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణం చేశారు. ఫిబ్రవరి 20న బీజేపీ ప్రభుత్వం అధికారం లోకి రాకముందే ఈ వీడియో సోషల్ మీడియాలో ఉంది.
ఫిబ్రవరి 22, 2025న పలు వార్తా కథనాల ప్రకారం కొత్త ప్రభుత్వం యంత్రాలతో చెత్తను శుభ్రపరిచే పని మొదలుపెట్టింది. తాజాగా లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశాల మేరకు యమునా నదిని శుభ్రం చేసేందుకు యంత్రాలను తీసుకుని వచ్చారు.
ఈ విషయాన్ని పలు ఫ్యాక్ట్ చెక్ సంస్థలు కూడా నిజ నిర్ధారణ చేశాయి. వాటిని ఇక్కడ, ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంది.
Claim : ఢిల్లీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే యమునా నదిని శుభ్రం చేస్తోంది
Claimed By : Social Media Users
Claim Reviewed By : TeluguPost
Claim Source : Social Media
Fact Check : Misleading
Next Story