ఫ్యాక్ట్ చెక్: ఓరియో బిస్కెట్లు ఎంత కాల్చినా కరగవనే వాదనలో నిజం లేదు.
ప్రపంచ వ్యాప్తంగా కుకీస్ బాగా ఫేమస్. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకూ వీటిని తినడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు.
Claim :
ఓరియో బిస్కెట్లో అనేక క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నాయి, ఇవి బ్లో టార్చ్‌తో కూడా కరగవుFact :
ఓరియో బిస్కెట్లను చక్కెరతో తయారు చేస్తారు. అధిక ఉష్ణోగ్రతల వద్ద కారమెలైజ్ అవుతుంది
ప్రపంచ వ్యాప్తంగా కుకీస్ బాగా ఫేమస్. పిల్లల దగ్గర నుండి పెద్దల వరకూ వీటిని తినడానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు. క్రిస్మస్ కుకీలకు సంబంధించిన సీజన్, పండుగల సమయంలో చాలా మంది సొంతంగా కుకీలను తయారు చేస్తారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అనేక వీడియోలలో బ్లోటోర్చ్ తో మండించినా కూడా ఓరియోస్ బిస్కట్లు కరగలేదు. అధిక వేడి ఉన్నా కూడా.. కుకీలు చెక్కుచెదరకుండా, కరగకుండా ఉన్నట్లు అనిపిస్తుంది. మొదటి కుక్కీ 0.1 సెకన్లు, రెండవది 0.5 సెకన్లు, మూడవది 1 సెకను, తదుపరిది 3 సెకన్లు, తదుపరిది 5 సెకన్లు, చివరిది 30 సెకన్లు కాల్చాలని ప్రయత్నించినా ఏవీ కరగలేదు.
ఈ వీడియో Xలో వైరల్ అవుతోంది. ఓరియో కుక్కీలలో క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాలను ఉపయోగిస్తూ ఉన్నారని, భారీ టెంపరేచర్ లో కూడా వాటిని మండించలేమా? ఈ ఉత్పత్తులు తప్పుడు వాదనలతో ప్రజలను మోసం చేస్తున్నాయి. ఈ పని చేస్తున్నందుకు మోండెలెజ్ (ఓరియో యజమాని)పై క్లాస్ యాక్షన్ వ్యాజ్యం దాఖలు చేశారని వాదనలో ఆరోపించారు. ఓరియో తయారీలో ఉపయోగించే కోకోవాను బాలకార్మికులను ఉపయోగించి తీసుకుని వస్తున్నారని, ఈ గొలుసు పశ్చిమ ఆఫ్రికాలోని వర్షారణ్యాలను కూడా నాశనం చేస్తున్నాయని వైరల్ క్లెయిమ్ లో ఆరోపించారు.
వైరల్ అవుతున్న పొస్ట్లలో ఇతర వాదనలు ఉన్నా, ఈ కుకీలు అధిక వేడిలో కూడా కరగవనే వాదనను ఇక్కడ దృవీకరించబోతున్నాము. క్లెయిం స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
ఓరియో కుక్కీలు అధిక వేడిలో కూడా కరగవు, క్యాన్సర్‌కు కారణమయ్యే పదార్థాలతో తయారు చేశారనే వాదన తప్పుదారి పట్టిస్తూ ఉంది. అధిక వేడి కి ఓరియో కరగదా అని తనిఖీ చేసినప్పుడు, అధిక వేడికి గురైనప్పుడు ఓరియో కరిగిపోతుందని చూపించే కొన్ని వీడియోలు, కథనాలను మాకు లభించాయి.
ది వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన ఒక వీడియోను కూడా కనుగొన్నాము. ఊశాలో విక్రయించే ఓరియో కుక్కీల తయారీలో ఉపయోగించే పదార్థాలను తెలియజేస్తుంది. వీడియోలో షేర్ చేసిన స్క్రీన్‌షాట్‌లో ఓరియో తయారీ పదార్థాలను చూడవచ్చు.
జూన్ 2024లో ప్రచురించిన టైమ్స్ నౌ వార్తా కథనం ప్రకారం, 1912లో అమెరికన్ కుకీ తయారీదారు నాబిస్కో ఈ కుకీని మొదటిసారిగా పరిచయం చేశారు. ఇప్పుడు ఓరియో మోండెలెజ్ ఇంటర్నేషనల్ యాజమాన్యంలో ఉంది. వందకు పైగా దేశాల్లో లభిస్తున్న ఓరెఒ బిస్కెట్లు, వివిధ రకాల రుచులలోనూ, పరిమిత-ఎడిషన్స్ లోనూ లభిస్తున్నాయి.
ఓరియో బిస్కట్స్ లోని ప్రధాన పదార్థాలు: బ్లీచ్ చేయని పిండి, అధిక ఒలేయిక్ కనోలా ఆయిల్ లేదా పామాయిల్, కోకో, ఫ్రక్టోజ్ కార్న్ సిరప్, బేకింగ్ సోడా, కార్న్ స్టార్చ్, ఉప్పు, సోయా లెసిథిన్, వెనిలిన్, చాక్లెట్ వంటి లీవెనింగ్ ఏజెంట్
విపరీతంగా కుకీలను తినడం వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను కలిగిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మహిళలు గరిష్టంగా 2000 కేలరీలు, పురుషులు 2500 కేలరీలు ఒక రోజులో తీసుకుంటారు. పది ఓరియో కుక్కీలను తినడం వల్ల మీకు 700 కేలరీలు శరీరంలోకి వస్తాయి. వీటి వలన శరీరంలో కొవ్వు పేరుకుపోవడమే కాకుండా, ఊబకాయం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, గుండెపోటు, కిడ్నీ సమస్యలు, మెటబాలిక్ సిండ్రోమ్ లకు దారి తీస్తాయి.
అధిక ఫ్రక్టోజ్, చక్కెర, కనోలా నూనెలతో తయారైన ఆహారాన్ని తినడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. కనోలా నూనె, చక్కెర రెండూ జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇటీవలి అధ్యయనంలో, కనోలాతో తయారైన వస్తువులను తిన్న వాళ్ల మెదడు పనితీరులో ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ప్రాసెస్ చేసిన చక్కెర, కనోలా నూనె రెండూ రక్తంలో ఇంటర్‌లుకిన్-6 స్థాయిలను గణనీయంగా తగ్గిస్తాయి. ఇది గుండె మంటను ప్రోత్సహించే పదార్ధం.
ఈ పబ్లికేషన్లలో కుకీలలో క్యాన్సర్ కలిగించే పదార్థాల గురించి ప్రస్తావించలేదు. అక్టోబరు 2021లో ది స్ట్రెయిట్స్ టైమ్స్ ప్రచురించిన కథనంలో.. బిస్కెట్లు ఇతర బేకెడ్, వస్తువులు మితంగా తింటే సురక్షితంగా ఉంటాయని సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ పేర్కొంది. అక్రిలామైడ్ అనేది క్యాన్సర్ కు కారణమవుతుంది. ఇది బిస్కెట్లు, కుకీలు ఇతర బేకెడ్ ఆహార పదార్థాలలో కనుగొంటారు. అక్రిలామైడ్ అనేది ఆహార ప్రాసెసింగ్ లేదా ఉత్పత్తులను తయారు చేసే సమయంలో ఉత్పత్తి అవుతుంది. అయితే తగిన ముడి పదార్థాలు, ఇతర ప్రక్రియల ద్వారా వీటి ఉత్పత్తిని నియంత్రించవచ్చు.
అత్యధిక వేడికి గురైనా కూడా కుకీలు కరిగిపోకుండా కనిపించినప్పటికీ, ఎక్కువ సమయం అధిక వేడికి గురైనప్పుడు మాత్రం అవి తప్పకుండా కరుగుతాయి. మంటల్లో కాల్చినా కూడా Oreo కుకీలు కరగవనే వాదన తప్పుదారి పట్టిస్తోంది.