నిజ నిర్ధారణ: విడీయో లో పఠాన్ సినిమాలోని ‘బేషారమ్ రంగ్’కు డ్యాన్స్ చేసింది పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో కాదు.
షారుఖ్ ఖాన్ తాజా చిత్రం పఠాన్‌లోని ‘బేషారం రంగ్’ పాటకు పాకిస్థానీ జాతీయుడు డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది, ఈ వీడియోలో ఉన్న వ్యక్తి పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ అంటూ సోషల్ మీడియాలో ప్రజలు షేర్ చేస్తున్నారు.
షారుఖ్ ఖాన్ తాజా చిత్రం పఠాన్‌లోని ‘బేషారం రంగ్’ పాటకు పాకిస్థానీ జాతీయుడు డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది, ఈ వీడియోలో ఉన్న వ్యక్తి పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ అంటూ సోషల్ మీడియాలో ప్రజలు షేర్ చేస్తున్నారు.
బిలావల్ భుట్టోపై చాలా వ్యంగ్య వ్యాఖ్యలతో వీడియోను ప్రచారం చేస్తున్నారు.
https://www.facebook.com/reel/
https://www.facebook.com/
నిజ నిర్ధారణ:
క్లెయిం అవాస్తవం. ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి పాకిస్థాన్ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ కాదు.
సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్‌లకు వ్యాఖ్యలను గమనించినప్పుడు, బేషరమ్ రంగ్ పాటకు డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి మెహ్రోజ్ బేగ్ అనే విద్యార్థి అంటూ కొందరు ప్రత్యుత్తరాలు ఇవ్వడం గమనించాము.
కొంతమంది వినియోగదారులు వీడియో నుండి సంగ్రహించిన చిత్రాన్ని ట్వీట్ చేశారు, అందులో ఇనాయఖాన్ అఫీషియల్ అనే ఇన్స్టాగ్రామ్ నుంచి తీసుకున్నట్టు తెలుస్తోంది. ట్వీట్‌పై క్యాప్షన్ ఇలా ఉంది: “తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయవద్దు. అతను పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ బిలావల్ భుట్టో కాదు. అతను మెహ్రోజ్ బేగ్, ఇక్రా విశ్వవిద్యాలయం (కరాచీ, పాకిస్తాన్) విద్యార్థి.”
ఇన్‌స్టాగ్రామ్‌లో ఇనాయఖాన్ అఫీషియల్ కోసం వెతుకుతున్నప్పుడు, కరాచీకి చెందిన ఒక పాకిస్తానీ నటి, బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ ఖాతా లభించింది.
వీరిద్దరూ వైరల్ వీడియోలో వేసుకున్న దుస్తులే ధరించి మరో పాటకు డ్యాన్స్ చేస్తున్న వీడియో కూడా లభించింది. ఈ వీడియోలో డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి కరాచీకి చెందిన మెహ్రోజ్ బేగ్.
భేషారం రంగ్ పాటకు జంట డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇక్కడ చూడొచ్చు.
అతని ఇన్స్టాగ్రామ్ ఖాతా ప్రకారం, అతను మీడియా విద్యార్థి.
మెహ్రోజ్ బేగ్ యూట్యూబ్ ఛానెల్ లో ఇంకా విపులంగా ఉన్న డ్యాన్స్ వీడియోను చూడొచ్చు.
కనుక, వీడియోలో ఉన్న వ్యక్తి బిలావల్ భుట్టో జర్దారీ అనే వాదన అవాస్తవం. బేషరమ్ రంగ్ పాటలకు డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి కరాచీకి చెందిన మీడియా విద్యార్థి.