Tue Nov 05 2024 12:41:16 GMT+0000 (Coordinated Universal Time)
ఫ్యాక్ట్ చెక్: ఓటు వేయకపోతే ప్రభుత్వం మీ అకౌంట్ నుండి 350 రూపాయలు కట్ చేస్తుంది అంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు
న్యూస్ పేపర్ క్లిప్‌ను నిశితంగా పరిశీలించిన తర్వాత.. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని
Claim :
ఓటు వేయని వ్యక్తుల బ్యాంకు ఖాతాల నుంచి ఎన్నికల సంఘం రూ.350 కట్ చేస్తుందిFact :
ఎన్నికల సంఘం అటువంటి ప్రకటన ఏదీ చేయలేదు. పాత, నకిలీ పేపర్ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది
పేపర్ క్లిప్పింగ్ లాగా కనిపించే ఒక చిత్రం వివిధ సోషల్ మీడియా, పలు వాట్సాప్ గ్రూపులలో చక్కర్లు కొడుతోంది
“नहीं दिया वोट तो बैंक अकाउंट से कटेंगे 350 रुपए: आयोग” అనే హెడ్డింగ్ అందులో ఉంది.
ఓటు హక్కు ఉన్న వాళ్లు.. ఓటు వేయకపోతే రూ. 350 బ్యాంకు ఖాతాల నుండి కట్ చేస్తారు. ఓటరుకు బ్యాంకు ఖాతా లేకుంటే మొబైల్ రీఛార్జ్ సమయంలో కూడా డబ్బులను డిడక్ట్ చేయవచ్చని క్లిప్పింగ్ లో ఉంది.
https://www.facebook.com/permalink.php?story_fbid=213060758446455&id=100092275975144
ఫ్యాక్ట్ చెకింగ్:
న్యూస్ పేపర్ క్లిప్‌ను నిశితంగా పరిశీలించిన తర్వాత.. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదని మేము కనుగొన్నాము. వైరల్ పోస్ట్ చాలా పాతది.. చాలా కాలం నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. వార్తాపత్రికకు సంబంధించిన క్లిప్ కల్పితమైనదని తెలిపారు.
Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ ప్రకారం.. ఈ నోటీసును PIB ఫ్యాక్ట్ చెక్ కూడా ఫేక్ అని తేల్చి చెప్పింది. వారి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లో మార్చి 29, 2024న “दावा: लोकसभा चुनाव में जो मतदाता अपने मताधिकार का प्रयोग नहीं करेंगे, चुनाव आयोग द्वारा उनके बैंक खातों से Rs 350 काट लिए जाएंगे #PIBFactCheck , यह दावा फर्जी है । @ECISVEEP द्वारा ऐसा कोई निर्णय नहीं लिया गया है । ऐसी भ्रामक खबरों को शेयर न करें। అనే క్యాప్షన్‌తో షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము.
దాన్ని అనువదించగా.. లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోని ఓటర్లకు ఎన్నికల సంఘం వారి బ్యాంకు ఖాతాల నుంచి రూ.350 కట్ చేస్తుందనే వాదనలో ఎలాంటి నిజం లేదని తెలిపారు. అలాంటి ప్రకటన ఏదీ ఎన్నికల కమీషన్ చేయలేదని మేము గుర్తించాం.
“दावा: लोकसभा चुनाव में जो मतदाता अपने मताधिकार का प्रयोग नहीं करेंगे, चुनाव आयोग द्वारा उनके बैंक खातों से Rs350 काट लिए जाएंगे। ఈ హెడ్ లైన్ ను తీసుకుని సెర్చ్ చేయగా.. మాకు ఎలాంటి వార్తా కథనాలు కనిపించలేదు.
గూగుల్ సెర్చ్ చేయగా.. 2020 & 2021 సంవత్సరాల్లో PIB అధికారిక X ఖాతాలో షేర్ చేసిన పేపర్ క్లిప్‌తో అదే పోస్ట్‌ను మేము కనుగొన్నాము.
మేము Google రివర్స్ ఇమేజ్‌ని ఉపయోగించి కీ ఫ్రేమ్‌లను సెర్చ్ చేసినప్పుడు.. నవంబర్ 29, 2021న ECI అధికార ప్రతినిధి తన అధికారిక X ఖాతాలో అదే పేపర్ క్లిప్‌ను షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము. అందులో కూడా ఈ పేపర్ క్లిప్పింగ్ ఫేక్ అంటూ తేల్చి చెప్పారు.
డిసెంబర్ 5, 2021న, NDTV లో ఈ తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న వారిని పట్టుకోడానికి పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారంటూ కథనాలను వైరల్ చేశారు. “ఓటు వేయనందుకు రూ. 350 జరిమానా విధిస్తారు అనే పుకారుపై ఢిల్లీ పోలీసులు విచారణ మొదలు పెట్టారు” అనే టైటిల్ తో కథనాన్ని ప్రచురించారు.
అదే రోజు, హిందూస్థాన్ టైమ్స్ కూడా "ఓటు వేయనందుకు రూ.350 జరిమానా విధిస్తారనే పుకారుపై ఢిల్లీ పోలీసులు విచారణ ప్రారంభించారు" అని ప్రచురించింది.
ఎన్నికల సంఘం ఇప్పటి వరకూ అలాంటి ప్రకటన చేయలేదని మేము నిర్ధారించాము.
2024 ఎన్నికలకి లింక్ చేయడం ద్వారా ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు పాత, నకిలీ పేపర్ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.
Claim : Election Commission would deduct Rs 350 from the bank accounts of people not casting their vote
Claimed By : Social Media Users
Claim Reviewed By : Telugupost Fact Check
Claim Source : Social Media
Fact Check : False
Next Story